February 28, 2013

ఇంగ్లీష్ - తెంగ్లీష్



రచన : సాత్విక

అదిగదిగో వచ్చాడు ఒక NRI , ఆధునిక భావాలు తనవన్నాడు
పడ్డది ఒక పనమ్మాయి ఆ NRI  కంట్లో, ఆ అమ్మాయి పని చేసేది ఒక సాఫ్ట్-వెర్ వాళ్ళ ఇంట్లో,  
కాస్తో కూస్తో  ఇంగ్లీష్ రావాలన్నాడు,  పనమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకొన్నాడు,
కానీ అమ్మాయి కి వచ్చింది మాత్రం తెలుగు + ఇంగ్లీష్  = తెంగ్లిష్ ................. 
అయినా పర్లేదు రమ్మన్నాడు ,  ఆ రోజుటి ఆమె దిన చర్య మొత్తం వినిపించమన్నాడు ...

ఆమె వివరించింది ఇలా ....

పొద్దునే పక్కింటి పనోడు 'పింగా'డుపాల వ్యాను వచ్చిందని 'చ్యాటా'డు,  (ping, chat),
అంతలోనే నేను వెళ్లి పాలు కలేక్టాను, ఎదురుగున్న కొట్టులో కూరలు బయ్యాను, (collect, buy),
నేను ఇంటి వసారా లో ముగ్గుడింగు, ఇస్త్రివోడు కన్ను నాకు గీటింగూ.. (ముగ్గు,కన్ను)
ఇంటికొచ్చి నేను అంట్లు తోమింగు, విరగబడి ఉన్న బట్టలన్నీ ఉతికింగు (తోము , ఉతుకు) ….

అమ్మగోరు  నిద్ర నుండి లేచింగు, అంతలోనే అయ్యగారి ఫోను మొగింగు,  (లేచుట , మ్రోగుట),
నేను వేడినీళ్ళు బాత్రూమ్లో ఉంచింగు , ఫలహారం టేబుల్ మీద పెట్టింగు (ఉంచుట  , పెట్టుట )
పిల్లలిద్దరి లంచ్ బాక్స్ లు ప్రిపరాను ,  సందులోకి  స్కూల్ బస్సు కమ్మింది, (prepare, come)
నేను ఫిల్టరు కాఫీని కాస్త డ్రింక్యాను , ఇంటిలో ఉన్న అన్ని గదులని క్లీనాను , (drink, clean)

ఆ పూట వంటెంటని ఆస్కాను , అమ్మగోరితో పనులన్నీ డిస్కాను  (ask, discuss)
పక్కింట్లో చింతపండు బారాను, వాళ్ళింట్లో TV సీరియల్ వాచాను, (borrow, watch)
అరువిచ్చిన పిన్నిగారికి పులుసు పంపింగు,  పులుపెక్కువని కసిరిన అమ్మగోరిని తిట్టింగు , (పంపుట , తిట్టుట )
బాల్కనీ లో ఆరేసిన బట్టలు సర్దింగు, ఆనక రేపటి రోజుకి దోస పిండి రుబ్బింగు (సర్దడం , రుబ్బటం) 

మాపటేళ పిల్లలు స్కూలు నుండి వచ్చింగు, ఇల్లంతా మూక తో చేరి జాతర చేసింగు,(వచ్చు, చేసు)
ఇరుగు పొరుగు అమ్మగోరితో చర్చింగు, అయ్యగారు ఆఫీసు పని కుమ్మింగు,(చర్చించు , కుమ్ము )
ఇంక రేత్రి అయింది నేను అన్నం ఈటాను, ఈ రోజుకి సెలవంటూ గుర్రు పెట్టి స్లీపాను,(eat, sleep)
ఇప్పటికే నేను శానా  టాకానండి , ఇంక మరి మీరు తప్పకుండ కమేన్టండి.... (talk, comment)

ఓ హీరో!! ఇంతకీ నన్ను నువ్వు సేలేక్టావా ? అన్నది ...

మీరే ఆ NRI  అయితే ఆ అమ్మాయిని  టేకు తారా ? ?

ఇదే విషయం అదే మేటర్.. కదా ?

కవిత రచన : సాత్విక

అబ్బిగాడి  స్నేహితుడు  సుబ్బిగాడు, సుబ్బిగాడికి ఫ్రెండ్ అబ్బిగాడు,

ఎలా.. ఎలా.. ఎలా చెప్పనూ ? 
ఈ చిన్న మేటరు .....(అదేనండి  విషయం)
ఎలాగోలాగా ప్రయత్నిస్తాను మరి  .....

మన అబ్బిగాడు ....

చిన్నప్పుడే వీధి బడికి పోయాడుతెలుగు మీడియం చేరాడు,
పంతులుగారు తెచ్చారు బాలశిక్షఆ పై తీర్చుకున్నారు ఆయన కక్ష,
ప్రక్రుతి వికృతి ఎలుగెత్తి చాటారుఇదే తేట తెలుగు అని నొక్కి వక్కాణించారు,
లంబ కోణ లెక్కలెన్నో మీకు విదితమేనన్నారు ఇదంతా మన గణితమేనన్నారు,
'అసామాన్య' విషయాలు భోదించారు , ఇదే సామాన్య శాస్త్రమంటూ వివరించారు,
'అసాంఘిక' చర్యలకు అద్దం పట్టారు అదే  చరిత్ర నేర్పిన సాంఘికమన్నారు ...

మరి సుబ్బిగాడో ..............


చిన్నప్పుడే కాన్వెంట్ లో చేరిపోయాడుఆంగ్ల మీడియం  లో దూరిపోయాడు,
పెట్టించారు అందరికి గుడ్డు మార్నింగుచేయించేసారు పొద్దున్నే వాకింగ్ 
జాతీయ భాష నేర్వమన్నారు తెలుగు ఎందుకంటూ జాతియం చేసారు,
… య్… యా... యాపిల్.. అని చేసేసారు ఫిక్స్ అత్యవసరంగా నేర్పించేసారు సీలబుల్ ఫోనిక్స్,
చదివేయమన్నారు మోరల్ సైన్స్అసలు అక్కరలేదు అన్నారు కామన్ సెన్స్ ,
వింత వింత విక్టరీలు వినిపించేసారుఇదే తర-తరాలుగా తెచ్చుకున్న హిస్టరీ గా తేల్చేసారు …


తెలుగు మీడియం అబ్బిగాడికి, సుబ్బిగాడు  ఒక మంచి స్నేహితుడు,
ఆంగ్ల మీడియం సుబ్బిగాడికి, అబ్బిగాడు  ఈస్  ఏ గుడ్ ఫ్రెండ్ యూ నో ...

February 27, 2013

భం-చిక్ భం-చిక్ బ్లాగాడించా !!


కవిత రచన : సాత్విక

నేనూ...   పక్క మీదున్నపుడు 
...
పక్షులు కిల-కిల మనగానేతూరుపు తెల-తెల వారగనే,
రవి కిరణాలు తలుపు తట్టగా నిదురమ్మ నన్ను విడనాడక,
ప్రకృతి పిలుపులు నాలో వారధి కట్టగావికృత భావం వాటికి సారధి అవ్వగా,
జనరల్ గాఅప్పుడు నేనూ భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా మొదటిసారి !!

నేనూ...  ఆఫీసు కి బయల్దేరేటప్పుడు ...
ఇంటి ముందు ఎక్కాను కారుఉత్సాహంగా ఉల్లాసంగా నా మనసు చేస్తోంది షికారు,
ట్రాఫిక్ జాము అని రేడియోలో పుకారునేను పొరపాటున చేసాను బేఖాతరు,
ఇటొక వాహనం అటొక వాహనంఇంక నేను కోల్పోయాను నా సహనం...
క్యాజువల్ గాఅప్పుడు నేనూ భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా రెండవసారి !!

నేనూ...  ఆఫీసు లో టీం మీటింగ్ ఉన్నప్పుడు ...
అయ్యాను నేను మీటింగు కి గైర్హాజరుమా మేనేజర్ పెట్టేసాడు నా మీద నజరు,
కేఫు లో కలిసింది కొలీగు పావనిఆశగా ఎదురు చూసాను ఏదో చెబుతుందని,
మీటింగ్ బయటికి వచ్చాడు మేనేజర్ మామచూసేసాడు మమ్మల్ని అయ్యో రామ,
టేర్రిఫిక్ గాఅప్పుడు నేనూ భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా మూడవసారి !!

నేనూ...   ఈవెనింగ్ వాక్ చేసేటప్పుడు ...
ఎదురింటి సంధ్య కాలికి అయ్యింది గాయం అవకాశం దొరికింది చేయడానికి సాయం,
వేసేశాను ఆమె గాయానికి మలాం పట్టి నడిపిస్తున్నాను నా చేయి ఆమె కాలు కింద పెట్టి,
అప్పుడే వచ్చాడు మా డాడి అనకొండఈ సీను చూసి ఆపేసాడు బండి శబ్దం కాకుండా,
సిల్లీ గాఅప్పుడు నేనూ భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా నాలుగోసారి !!

నేనూ...  రాత్రి పక్క మీదకేక్కినప్పుడు ...
రిలాక్స్డ్ గా చూడాలనిపించింది న్యూస్కాని బుల్లిపెట్టేలో వస్తున్నాయి న్యూసెన్స్,
మార్చి మార్చి చూసాను మరియొక చానెల్తారసపడ్డారు ఆడియో ఫంక్షన్ ఫిక్స్డ్ పానెల్,
చేసారు హీరోకి రొటీన్ పొగడ్తల సందడిపెట్టించేసారు ప్రేక్షకులందరికీ కంట తడి,
జెంటిల్ గాఅప్పుడు నేనూ !  భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించాఆఖరిసారి !



రోజుకి 5 టైమ్స్ నేను ,  భం-చిక్ భం-చిక్  బ్లాగాడించాను ... మరి మీరో ??



February 26, 2013

ఔనంటారా ? కాదంటారా ?



కవిత రచన : సాత్విక
ఓ  జననమా !
ప్రసవ  వేదన   కలిగిస్తావు ,  సృష్టి రహస్యాన్ని  తెలియ  చేస్తావు  .. 
తోలి  అడుగుకు  ఆధ్యం  నీవేనంటావు,  ప్రాణం  ఖరీదుకు  సాధ్యం  కాదంటావు ...
  జననమా !!  నువ్వు  దేవుడిచ్చిన  వరమా ?

  మరణమా !!
ప్రతి  జీవికి  నువ్వు  రుణపడి  ఉంటావు,అడగకనే  భ్రమపడి  ఋణం  చెల్లిస్తావు ..
జీవరాసి  విషయంలో  నీ  షరా  మామూలే,మా    జీవితకాలానికి  పహారా నీవేలే ...
  మరణమా  !!  నువ్వూ  దేవుడిచ్చిన  వరమేనా ?

తొమ్మిది  నెలల   ప్రస్థానం  ''  జననం,  తొమ్మిది  ఘడియల  ప్రహసనం  ''  మరణం,
ఆహ్వానం  అంది  వచ్చే  అతిధే  ''  జననం,  తిరస్కారానికి  తలొగ్గక  తీసుకుపోయేదే  ''  మరణం,
ఇంతేకదా   మన   గీతాసారం !  అంతేలేనిది  ఈ  జీవన్మరణం   !!

కుల మత  తారతమ్యం  ఎరుగదు  ''  జననం,  తన-మన  కారుణ్యం   తలవదు  ''  మరణం,
సృష్టి  రహస్యమే  ''  జనన  అంతర్జాలం,  ఎవ్వరికి  అంతుబట్టదు  ''  మరణ  మాయాజాలం,
ఇంతేకదా   మన   గీతాసారం !  అంతేలేనిది  ఈ  జీవన్మరణం   !!

కాలాంకితమయినది  ''  జననం కలానికతీతమయినది  ''  మరణం,
జన్మించి  ''  జీవి  కుటుంబానికి   'హోస్ట్',  మరణించి  ''  జీవి  ప్రపంచానికిక  'ఘోస్ట్',
ఇంతేకదా   మన   గీతాసారం !  అంతేలేనిది  ఈ  జీవన్మరణం   !!

February 25, 2013

చూడు .... నన్నిలా ...!!


కవిత రచన : సాత్విక

ఎగిసిపడుతున్నది  ఒక  అల,  
తీరం దరి చేరాలన్నది  దాని  కల ...

వువ్విళ్ళూరుతున్నది  నా మనసు, 
అది  నిన్ను  చేరటానికని  నీకు  తెలుసు ...

నిన్ను  కలుసుకోవాలని  తపించాను  అనుక్షణం, 
చేసాను  విశాల  ప్రపంచ  విహంగ  వీక్షణం ...

నీ  దరిచేరక  నాలో  ఆవహించింది  నిస్తేజం,
నీ  చిరునామా  తెలిసి  నాలో  ఎగిసింది  ఉత్తేజం ...

కడకు  చేరి   విశ్రమించాను  ఇక్కడ  చతికిల,
కడలి  తీరాన  చూడాలని   నీ  నవ్వుల  కిల కిల ...

నిన్ను  చూసి  చిన్నబోతుందా  చందమామ  వెన్నెల,
అందుకే  చాటేసావా ? నీ నగుమోము  ప్రక్కకు  ఆలా...

February 24, 2013

ప్రకృతిచ్చిన ఆకృతి


కవిత రచన : సాత్విక

(ప్రక్క చిత్రానికి నా భాష్యమే ఈ కవితారూపం)

 కనిపించిది ఇలా

ఒక కన్ను ఆకాశం,
మరియొక కన్ను పర్వత/సాగరం చెంత ,
నాసికము సాగర మధ్యమున
పెదవులు సాగర గర్భమున
ఒక మగువ ఆకృతి

****                                  ****                                  ****                      

నాకు అనిపించింది ఇలా 

చిగురించే  ఆశకి  చిహ్నం  ఉషోదయమన్నావు,
స్వచ్చతకు  సారూప్యతగా  వెన్నెల  పంచావు
ఆ  రెంటిని  కలగలిపి  అర్ధ  నేత్రమయినావు..
మగువా !   ఇదేనా  ప్రకృతి  నీకిచ్చిన  ఆకృతి.

అవుధుల్లెని  ఆనందానికి  ప్రతీక  పర్వతమన్నావు
ఉప్పొంగే  దుఃఖానికి   'జత'ఇక  కడలేనన్నావు,
ఈ  రెంటిని  జత  చేసి  మరో  అర్ధ  నేత్రమయినావు..
మగువా !   ఇదేనా  ప్రకృతి  నీకిచ్చిన  ఆకృతి.

అర్ధ  నేత్రాన్ని  పర్వత  సాగర  సాక్షి  అన్నావు,
మరొక  భాగాన్ని  సూర్య  చంద్రుల  పాలు  చేసావు,
  రెంటిని  కలగలిపి  నీవు  వీక్షిస్తున్నావు..
మగువా !   ఇదేనా  ప్రకృతి  నీకిచ్చిన  ఆకృతి.

నిశ్చల-నిర్మల  సాగర  మధ్యమునే  స్వాశిస్తున్నావు,
సుఖ-దుఃఖ  వర్ణసంకేతముగా  చెంగావి  నీ  మోవినున్చావు,
  కల్మష  రహిత  ప్రపంచ పావని గా  నిలచావు..
మగువా !   ఇదేనా  ప్రకృతి  నీకిచ్చిన  ఆకృతి.

February 21, 2013

ఎలగెలగా! ఎలాగేలాగా?




   కధారచన : సాత్విక           

రామ చక్కని సీతకి అరచేత గోరింట..

ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట...   రామ చక్కని సీతకి......

అని రాజారత్నం గారి ఇంటి ముందున్న పందిట్లోని  మైకు  'తెలుగులో గొంతు చించుకొని', 'టెక్నికల్ గా సౌండ్ పెంచబడి' పాడుతోంది...


రామ చక్కని సీత... ఇలాంటి  'బాణీ'లు  అంటే ఈ మధ్యే  'వొణీ'లు   వేసుకుంటున్న రాజారత్నం గారి పనిపిల్ల  అయిన రామసీత కి ఎంతో మక్కువ...అసలు ఆ చరణాలు తనని చూసే రాసారు అన్నంత కాన్ఫిడెంట్ గా  ఫీల్ అయ్యేది రామసీత.


ఇక అసలు విషయానికి వస్తే  'అయన పేరు రాజారత్నం , రాహుల్ వారి పుత్రరత్నం'.  అజ్ఞానం పారదోలేది 'ఆ'జ్ఞానమని రాజారత్నం గారి  స్ట్రాంగ్ ఫీలింగ్.  హా !! చెప్పడం మరిచెను 'ఆ'జ్ఞానం అంటే 'కాల'జ్ఞానంమండి బాబూ !!


'ప్రతిరోజూ కాలజ్ఞాన గ్రంధాన్ని ఎంతో పవిత్రంగా పూజించటం' రాజారత్నం దినచర్యలలో అతి ముఖ్యమయిన ఘట్టం. 'పూజ రోజు చేయి, 'గ్రంధ' పారాయణ మటుకు కొన్ని ముఖ్యమయిన రోజులలో మాత్రమె చేయ'మని ఊరి జ్యోతీష్యుడి చేత చెప్పించారు కొందరు పెద్దలు. ఎందుకంటే?  'గ్రంధ' పారాయణ లో ఏదో ఒక వాక్యం దగ్గర 'లాక్' అవడం, ఆ విషయాన్నీ తన జీవితానికి అన్వయించుకొనే పరిణామక్రమంలో ఏదో ఒక డెసిషన్  తీసుకొని అందరిని 'షాక్' కి గురి చేయడం కొన్ని సంవత్సరాలగా  'రాజారత్నం ఫాలో అవుతున్న స్టైల్, బట్ ఇట్స్ జస్ట్ ఫర్ ఏ వైల్'  అని మొదట్లో సరిపెట్టుకున్నారు అందరూ, తరవాత కాదని ఇలా గురిపెట్టారు ఇంకొందరు.
.


*****            *****            *****            *****

అయితే గతంలోకి  వెళితే , కొన్ని సంవత్సరాల క్రితం రాజారత్నంగారు గ్రంధ పారాయణ చేసిన రోజున  'బుల్లి తెరల బూచి, భావి  జీవత బాచి' అన్న కాలజ్ఞాన వాక్యం దగ్గర లాక్ అయ్యారు. కాలజ్ఞాన వాక్యాన్ని తలుచుకొని కనులు మూసుకున్నారు రాజారత్నం గారు, అంటే ఆయనకు భవిష్యత్తు కనిపించిందిలా...
'కనుల ముందు లీలగా తెర మీద రాక్షసుల యుద్దాలు,తెర ముందు  చిన్న పిల్లలు ఏడుపులు .. కడుపు పట్టుకొని మెలికలు తిరుగుతూ కింద పడి దొర్లుతున్న చిన్నారుల ఆక్రందనలు ......          'నో..నో .... అంటూ కళ్ళు తెరిచారు రాజారత్నం గారు. తను చూసిన ఆ దృశ్యానికి రియాలిటీ అప్లై చేసి ... బుల్లితెర బూచి అంటే రియాలిటీ షో యాంకర్లని, వారి వికృత భావజాలానికి బలి అయ్యేది భావి  పౌరుల  జీవితమని వివరించేసాడు...

లాక్ అయిన వాక్యం ఓకే !   కాకపొతే షాక్ అయ్యే డెసిషన్ ఏంటంటే తన బాబు రాహుల్ ఈ బుల్లి తెర బూచికి బలి  కాకూడదన్న  సంకల్పంతో విదేశాలకి పంపాలని నిర్ణయించేసాడు రాజారత్నం.


రాజారత్నం వివరించిన కాలజ్ఞాన వాక్య తాత్పర్యానికి ,ఆయన తీసుకున్న డెసిషన్ కి   పారాయణకి అటెండ్ అయిన  చిన్నా-చితక ముసలి-ముతక అందరి కళ్ళు చెమర్చాయి.  ఇంతలో కాలజ్ఞాన గ్రంధానికి అటెండ్ అయిన జూనియర్ భక్తుడు ఒకాయన తన యెగ్జ్యేట్మెంట్ ఆపుకోలేక అడిగేసాడిలా     
"కాలజ్ఞానం అంటే ఏమిటి గురూజీ? "   అని.   రాజారత్నం చిద్విలాసంగా నవ్వి  కాలజ్ఞానం అంటే "కాలం చేసిన   జ్ఞానం' అని సమాధానమిచ్చాడు.


కాస్తో కూస్తో చదువుకున్న సీతారత్నం  మటుకు , ఎస్  ఇది ఖచ్చితంగా  కాలం చేసిన జ్ఞానమే కాని  .. కాలం గురించి వివరించే జ్ఞానం కానే కాదు, అందుకు అయన ఇచ్చిన తాత్పర్యమే ఉదాహరణ అని మనసులో అనుకోని,  అసలు ''బుల్లి తెరల బూచి, భావి  జీవత భాచి'' వాక్యం కాలజ్ఞానం లో ఉండి ఉండదని, రాజారత్నానికి  సంస్కృతం చదవడం కూడా  రాదు  అని కన్ఫర్మ్ చేసుకొని  మిన్నకుండి పోయాడు.


అందువల్ల  'రాహుల్ చిన్నప్పుడే వెళ్ళాల్సి వచ్చింది దుబాయికి, వీడికి కంపెనీ ఇవ్వక తప్పలేదు వాళ్ళ బాబాయికి '. బాబాయి పక్కింట్లో ఉండేవాడు  షేక్ రషీద్, రాహుల్ ని ఆడించేవాడు.  రాహుల్ బాబాయి కూడా మార్గదర్శి లో చేరాడు ఒక చిన్న  పెట్రోల్ బావి  కొనుక్కున్నాడు. బాబాయ్ ట్రైనింగ్ లో అబ్బాయి ఆ బావిని చిన్న చెరువు చేసేసాడు.


ఒంటరిగా  బావి  లో  పెట్రోల్ 'తోడి-తోడి' విసుగు చెంది,

తన  భావి జీవితానికి తోడు అవసరాన్ని గ్రహించి ,
తోడు తెచ్చుకుంటే జంటగా తోడుకోవచ్చు, అని భావించి  ఇండియా బయలుదేరాడు  రాహుల్.


*****            *****            *****            *****

వర్తమానంలోకి వస్తే, రాజారత్నం గారి ఇంటి ముందర పందిరికి అదే కారణం 'రాహుల్ ఇరవయ్యేళ్ళ తరవాత' ఇండియా  తిరిగొస్తున్నడొచ్.......

స్వాగత-బలాత్కార,  సంకర-సత్కార,  సాహిత్య-చీత్కారాల చివర  రాహుల్ ఇండియా లోని తన ఇంటికి చేరాడు.


వివరంగా చెప్పాలంటే, రాజారత్నం బంధుగణం ఎయిర్-పోర్ట్ లో సెక్యూరిటీ ని బలాత్కరించి లోపలికి  దూసుకెళ్ళి రాహుల్కిచ్చిన స్వాగత శుభాబినందనల ని 'స్వాగత-బలాత్కార'ముగా పరిగణించి, ఆ పైన వారు అందించిన బోకే  గట్రా వాటిని 'సంకర-సత్కార'ములగ అందుకొని, అటు పిదప వాహనములో అసలే దుబాయి నుంచి  వచ్చిన రాహుల్ (ఫారన్ రిటర్న్) ప్రక్కన తమకు దక్కని స్థానానికి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకున్న  అచ్చ తెలుగు నిందలని 'సాహిత్య-చీత్కారాల'గా చివరకి ఇల్లు చేరాడు రాహుల్.

(ఇంతోద్దు అనుకుంటున్నారు కదూ, నిజమేనండి ! మనం మామూలు తెలుగు వాడదాము చాలు, నేను ఫిక్స్-- మీరు ఫిక్స్ అవ్వండి, ఇంక భారి తెలుగు వాడన్ !!)

దుబాయి లో పెరిగిన 
రాహుల్, తెలుగు బుల్లితెరకే కాకుండా తెలుగు నేటివిటీ కి కూడా కొంచం దూరమయ్యాడు. అందుకే చీరలు కట్టుకున్న ఆడవాళ్ళని, లుంగీలు కట్టుకున్న మగవాళ్ళని వింతగా చూస్తుండిపోయాడు  రాహుల్. రాహుల్ కి అందరిని పరిచయం చేయసాగాడు వాళ్ళ బాబాయి. ఇంతలో అటుగా వచ్చిన రాజ్యలక్ష్మిని చూపిస్తూ అన్నాడు బాబాయి 'అదిగో ఆ హాఫ్-శారీ' కట్టుకుందే ఆ అమ్మాయే నీ మరదలు మాణిక్యం 'రాజ్యలక్ష్మి' అన్నాడు. ఈ పరిచయ వాక్యంలో తనకు ఎన్నో పరిచయంలేని పదాలని వాడిన బాబాయిని కోర-కోర చూసాడు రాహుల్. 
ఏదోకటి మాట్లాడి తను మేనేజ్ చేయాలి అనే ఉద్దేశ్యంతో 'హాఫ్-శారీ' ఎందుకు బాబాయి వాళ్ళు 'పూరా' అన్నాడు. కాదు బావా నువ్వే తెలుగు  సంస్కృతీ లో పూర్ 'హాఫ్-శారీ' అంటే వోణి అని తను కట్టుకున్న వోణి చూపిస్తూ సిగ్గు పడింది రాజ్యలక్ష్మి . గతుక్కుమన్నాడు రాహుల్!! అయినా మేనేజ్ చేయాల్సిందేనని మళ్ళి ఇందాక బాబాయి పరిచయ వాక్యాన్ని గుర్తుకి తెచుకుంటూ ఇంతకీ నీ పేరు మాణిక్యమా లేక రాజ్యలక్ష్మినా? అన్నాడు  ఫోజు కొడుతూ. ఇప్పుడు గతుక్కుమనడం  తక్కిన వారి వంతయ్యింది.
రషీద్ షేక్

అంతలోనే చటుక్కున లేచి నుంచొని "పరిచయాలు తరవాత", ముందు మనింట్లో బావి ఎక్కడుందో చూపించండి అంటూ ఇంటి వెనక వైపు కి పరుగు తీసాడు రాహుల్. బావకంటే ముందే బావి దగ్గరికి వెళ్లి నీళ్ళు తోడి బావకి అందించింది రాజ్యలక్ష్మి. బావిలోనుంచి అంత  ఫాస్ట్గా నీళ్ళు తోడిన రాజ్యలక్ష్మిని చాలా క్లోజ్ గా వాచ్  చేయడం మొదెలెట్టాడు రాహుల్.  సింపుల్ గా చెప్పాలంటే  "దుబాయి లో చిన్నప్పుడు  రషీద్ ' షేక్ ఆడించాడు రాహుల్ ని', ఇప్పుడు  రాహుల్  'షేక్ ఆడిస్తున్నాడు ఇండియాలో  అందరిని'".



*****              *****              *****              *****

ఒక నెల గడిచింది మొత్తానికి, రాజారత్నం అడిగాడు రాహుల్ ని రాజ్యలక్ష్మి  నచ్చిందా ? అని. కాకపొతే కేవలం మరదలు అన్న ఒకే కారణానికి  ఓ.కే  చెప్పి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక 'అందరి అమ్మాయిలని పిలిపిస్తే? తను పరిక్ష పెట్టి సెలెక్ట్ చేసుకుంటాను' అన్నాడు తండ్రితో.
 చుట్టు ప్రక్కల పేరు మోసిన పెద్దవారి పిల్లలని అందరిని పిలిపించాడు రాజారత్నం.


పరిక్ష ఏమిటంటే అంటూ 'కాలజ్ఞాన గ్రంధాన్ని బావిలోకి జార విడి'చాడు రాహుల్. రాజారత్నం గుండె ఝల్లుమంది. అక్కడున్న వారందరూ ఒక్క క్షణం అవాక్కయ్యారు. ఇవేమీ పట్టించుకోకుండా కంటిన్యూ చేశాడు రాహుల్. 

"ఎవరయితే కాలజ్ఞాన గ్రంధం కనపడేవరకు ఈ బావి లో నీళ్ళు   తోడతారో, ఆ అమ్మాయినే  నేను పెళ్లి చేసుకుంటాను" అని ప్రకటించేశాడు.  ఇలాంటి పరీక్ష ఇంతవరకు వినక పోవడం మూలాన సగం మంది మావల్ల కాదు అని వెళ్ళిపోయారు. మరి కొంతమంది  చూస్తూ చూస్తూ దుబాయి సంబంధం వదులుకోలేక 'తోడ'టానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రయత్నించినవారందరి చేతులకి ఉచితంగా కట్లు కట్టించాడు రాహుల్. 'రాహుల్ బావ' బావి పోటికి అందరూ వోడిపోయిన రాజ్యలక్ష్మి మొక్కవోని ధైర్యంతో తోడసాగింది. రాజారత్నం తో సహా అందరూ ఎంకరేజు చేస్తున్నారు ఆమెను. రాజారత్నం చాలా ఆత్రంగా చూస్తున్నాడు 'కాలజ్ఞానం గ్రంధం ఎప్పుడు బయటపడుతుందా?' అని, మిగిలిన వారంతా ఎదురు చూస్తున్నారు 'రాహుల్ తో దుబాయ్ కి వెళ్ళే ఛాన్స్ రాజ్యలక్ష్మికీ దక్కుతుందా ?' అని. కొంతసేపటికి రాజ్యలక్ష్మి కూడా మూర్చబోయింది...


అంతే పోటి అంతటితో ముగిసింది అనుకున్నారు అందరూ, కాని రాజారత్నం మటుకు రామసీతకి పని పురమాయించాడు మొత్తం నీళ్ళు తోడమని, కాలజ్ఞానం బయటకు తీయమని. రాజరత్నం మీద ఉన్న భయంలాంటి భక్తితో, 'చివరాఖరికి మొత్తం నీళ్ళు తోడేసింది, కాలజ్ఞాన గ్రంధాన్ని వెలికి తీసేసింది' రామసీత. బావి అన్నా, తోడటం అన్నా  మైమరచిపోయే రాహుల్ కి,  
సులువుగా  నీళ్ళు  తోడేసిన రామసీత పై బాగా ఇంప్రెస్స్ అయ్యాడు.

కాలజ్ఞానం మళ్ళి తన వశమయినందుకు  హమ్మయ్య అన్నాడు రాజారత్నం , ఒక్క అమ్మాయి అయినా పోటిలో గెలిచినందుకు  వావ్! అన్నాడు రాహుల్. కొడుకు తెలివితేటలకి మురిసిపోకుండా ఉండలేకపోయాడు రాజారత్నం, ధన్యవాదాలు తెలుపుకున్నాడు కాలజ్ఞాన గ్రంధానికి.



రాహుల్ కి తోడేసే తోడు (భా(బా)వి భార్య) దొరికింది, రాజారత్నానికి కాలం చేసిన జ్ఞానం మాత్రమే మిగిలింది




February 19, 2013

ఇలా అయితే ఎలా ?

కధా రచన : సాత్విక

సంకురాత్రి కోడి కూసింది, అబ్బిగాడు కెవ్వు మంటూ వచ్చాడు....
అదేంటి సంకురాత్రి మాత్రమే కోడి కూస్తుందా ? కోడి కూస్తే అబ్బిగాడు వస్తాడా ? అబ్బిగాడు వచ్చేటప్పుడు కెవ్వు మంటాడా ?  అని  హ్..హ్..హ్..హాస్చ్చర్యపోతున్నారా !! 

'రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే  అసమ్మతి' లాగా మన 'కోడి' కూడా ఎప్పుడు పడితే అప్పుడు కూస్తుంది దానికి సంకురాత్రి అవసరం లేదు. అసలు నిజం ఏమిటంటే కోడి కూయకపోయనా, అబ్బిగాడు వచ్చేవాడు. కాకపోతే  ఇప్పుడే పుట్టాడు, అందుకే కెవ్వు మన్నాడు  (అద్గది లెక్క..). 


ఓ.కే   ఇంక అబ్బిగాడి ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ..

" బాబీ , సోనీ , వాణీ "లది పవిత్ర బంధం. అవును మీరు చదివింది కరెక్టే.... ఎలా అంటారా ?
అదేనండి 'పోరి  పోరి మధ్యలో చారీ' ....
'నిరోషా శోభన మధ్యలో బాలకృష్ణ' అని...      ఇంకా అర్ధం కాలేదా ?  
'నారీ నారీ నడుమ మురారి' ఫ్యామిలీ అండి మన 'బాబీ గాడి'ది.

బాబీ -- మన అబ్బిగాడికి డాడీ (కన్ఫర్మ్
డు గా),   కాకపొతే  సోనీ , వాణీ లు మటుకు మన అబ్బిగాడికి మమ్మీ రిలేషన్ అవుతారు. 
అంతే మరి!   ఎందుకంటే ? 

బాబీ ఇంట్లో ఎప్పుడూ రెండు అంశాలు విపరీతంగా పోటి పడుతుంటాయి అవే  'పవిత్ర బంధం' మరియు 'అన్యోన్య దాంపత్యం'. ఈ రెండు అంశాల పోటికి బాబీ జస్టిఫికేషన్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది.

పవిత్ర బంధాన్ని కన్ఫర్మ్ చేస్తూ, ' కామన్ సెన్స్ పక్కకు నెట్టి, సివిక్ సెన్స్ కి పదును పెట్టి ' వంధ్యక్క సాయం తో  ' కోర్టు  కెక్కి , చట్టం గొంతు నొక్కి' మన అబ్బిగాడి బర్త్ సర్టిఫికేట్ లో 'మదర్' అన్న కాలమ్ లో  సోనీ , వాణీ ల ఇద్దరి పేర్లు ఎంటర్ చేయించేసాడు బాబీ.  

అన్యోన్య దాంపత్యానికి అన్యాయం జరగకుండా ' రైట్ ఫ్రం జీరో అవర్ ఆఫ్ అబ్బిగాడి బర్త్' వాడికి అసలు మమ్మీ ఎవరో చెప్పకుండానే పెంచసాగారు మన 'ఒక డాడీ ఇద్దరు మమ్మీసు'. అందుకే అబ్బిగాడికి సోనీ, వాణీలు మమ్మీ వరస అవుతారు మన అబ్బిగాడికి సంబంధించినంతవరకు.. అంతే !!


*****       *****       *****


"వేట రియాలిటీ షో యాంకర్, 
బాబీ వాళ్ళ పక్కింటి శంకర్ఒక్కరే ....


'చెట్టు ముందా ? విత్తనం ముందా ?' అనే ప్రశ్నకి కూడా ఠక్కున సమాధానం చెప్పే రాష్ట్ర ప్రజలకే  
'సీరియల్ మధ్యలో యాడ్ వస్తోందా ? లేక యాడ్ మధ్యలో సీరియల్ వస్తోందా ?' అని పజిల్ని విసిరేసిన శంకరం ఆంటే యావత్ రాష్త్రానికి చాలా డిసిప్లిన్. 


శంకర్ పోయినేడాది తీసిన రియాలిటీ షో చూసి జనాలు రోడ్ల మీదకు విసిరేసిన వస్తువులు కలక్ట్ చేసి వరల్డ్ బ్యాంకు అప్పుకి వడ్డీ చెల్లించిన ప్రభుత్వం, "ఈసారి మరింత జాగ్రత్తగా ప్లాన్ చేయాలనీ , వరల్డ్ బ్యాంకు దగ్గర మన రాష్ట్రం తరుపున చేసిన మొత్తం అప్పుని తీర్చే భాధ్యత శంకరం మీద పెట్టేసింది" రాష్ట్ర ప్రభుత్వం. 


రాష్ట్ర-వరల్డ్-బ్యాంకు అప్పు మొత్తాన్ని తన భుజాల మీద మోస్తున్న శంకరం కొంచం భారంగా ఫీల్ అయ్యాడు, అందుకే ఈ విషయంలో రాష్ట్ర ప్రజలని, 
ప్రభుత్వాన్ని కూడా ఇంతకింతా ఫీల్ అయ్యేట్టు చెయ్యాలి అని డిసైడ్ అయ్యాడు.  బాబీ గాడి ధోభి ద్వారా 'ఇద్దరు మమ్మీ' ల కాన్సెప్ట్, 'బర్త్ సర్టిఫికేట్' లో ఇద్దరి మమ్మీల పేర్ల గురించి రహస్యంగా తెలుసుకున్నాడు శంకరం.  అంగారక గ్రహం మీద తిరగాల్సిన 'క్యురియాసిటీ రోవర్' (అంతరిక్ష నౌక) సడన్ గా తన గతిని మార్చుకొని శంకరం మెదడు లో సెటిలయి బాబీ గాడి ఇంటి పరిణామాల మీద క్యురియాసిటీ పెంచేసింది.  

' ఇలా అంతమయింది ' అనే  టైటిల్ తో ('ఛీ-రియల్' అనే  కాప్షన్ తో) బాబీ ఫ్యామిలీ డ్రామాని బుల్లి  తెర కేక్కించడం మొదలెట్టాడు శంకరం. 

'వినుడు వినుడు రామాయణ' గాధ అన్నంత సోంపుగా 
టైటిల్ సాంగ్ రాసి మరీ బాబీ ఫ్యామిలీ డ్రామాని బుల్లి తెర కేక్కించే ప్రయత్నంలో పడ్డాడు. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసాడిలా...
ఆగదూ ...ఆగదూ ..
(ఆగదూ ఆగదూ ... సాంగ్ ఫ్రం ప్రేమాభిషేకం .. ట్యూన్ ని వాడేసాడిలా...)

ఆగదూ..ఆగదూ ... 
ట్యావ్....ట్యావ్ ...., ఆగదు ఏ ఎపిసోడ్ నీ కోసము,
ఆగితే ముందుకు సాగదు ఈ సీరియలు, ముందుకు సాగదు ఈ ఛీ-రియలు

ఈ స్టోరీ బాబీదని
.... ట్యావ్....ట్యావ్.., పరమ సోది అని...., 
తెలిసినా....ఆ ....ఆ....... రేపు రాక మానదు ,
నటీ నటులు బేవార్సని...... ట్యావ్...... ట్యావ్, డైరెక్షన్ దరిద్రమని..., 
తెలిసినా...ఆ....ఆ... మేము  తీయకా మానము...,
ప్రేక్షకులు పాపమని .... ట్యావ్, ఇన్సూరన్స్ ఉండదని......, 
తెలిసినా....ఆ....ఆ...  తెలిసినా  ఈ రిలే నిలువదు...
ఆగదూ .. ఆగదూ ... 

అని  వరల్డ్ బ్యాంకు అప్పు దృష్టిలో పెట్టుకొని రెచ్చిపోయాడు శంకర్...



*****       *****       *****


'బర్త్ సర్టిఫికేటు' కి సంబంధించి కోర్టు గొడవల్లో పడి పది నెలలు గడిచినా అబ్బిగాడికి బారసాల చేయలేకపోయాడు బాబీ. బారసాల డిలే అయింది. పది నెలల వయసు పై బడి అబ్బిగాడు మెల్లి మెల్లిగా మాటలు పలకటానికి ప్రయత్నిస్తున్నాడు... ఉన్నట్టుంది ఒక రోజు ఇలా అన్నాడు        అ.. అ ..  అమ్మా అని...
అన్యోన్య దాంపత్యం ఎఫెక్ట్ తో అసలు తల్లి ఎవరో  సోనీ, వాణీ లు కూడా మర్చిపోయారు. అందువల్ల  అ.. అ... అమ్మా అని పిలిచినా ఎవరికీ వారే తమని కాదని మిన్నకుండిపోయారు.

అబ్బిగాడి పిలుపుకి సోనీ, వాణీ ఇద్దరు రియాక్ట్ అవ్వలేదని బాబీ ఆ రోజు ఎపిసోడ్ లోని తన బతుకు 
ఛీ-రియల్ చూసి తెలుసుకున్నాడు, భాదపడ్డాడు. కాకపొతే  ఈ 'రియల్'  సీనుని ఛి-రియల్ లో  శంకరం తన భావ దారిద్రాన్ని ఉపయోగించి బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఇచ్చాడిలా..   ' అమ్మా అని పిలచినా ఆ..ల..కించ..వేవమ్మ .... ' అంటూ.. శంకరం తీసిన ఆ సన్నివేశం బాబీని ఎంతగానో కదిలించి వేసింది .....
వెంటనే బాబీ  'కట్టేశాడు సీరియల్ , ఫోన్ లో నోక్కేసాడు రీ-డయల్'.

"ఫోన్ లైనులో కి వచ్చింది వాళ్ళ చెల్లి సులోచన, 
సులువుగా చెప్పేసింది ఒక చిన్న ఆలోచన". 

వెంటనే ఫోన్ కనెక్ట్ చేసాడు 'ఈ సారి వాళ్ళ బాసుకి,  టుడే తను లీవు అని చెప్పడానికి'. అబ్బిగాడికి అమ్మా అని ఎలా పిలవాలి అని ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసాడు బాబీ. 

ఈ నిజ సన్నివేశాన్ని శంకరం మళ్లీ తన భావ దరిద్రాన్ని లైట్ గా ఉపయోగించి 
ఛీ-రియల్ ప్రోమో చూపించాడిలా ...
"దెబ్బ తగిలిన బాబు అమ్మా అని ఒకలాగా పిలుస్తాడు, ఆకలితో ఉన్న బిడ్డ అమ్మా అని మరోలా అరుస్తాడు, 
అలాగే ఒక్క  తల్లి ఉన్న పిల్లలు అమ్మా అని ఒక లాగా పిలిస్తే , ఇద్దరు మమ్మీలు ఉన్న అబ్బిగాడు ఎలా పిలుస్తారో చూడండి రేపటి ఎపిసోడ్ లో ..... " చూస్తూనే ఉండండి  'ఇలా అంతమయింది'.. టాన్...టాన్...ట..న్...    అని  బ్యాక్-గ్రౌండ్ మ్యూజిక్ తో ఆదరగోట్టేసాడు ఆ రోజు 'ప్రోమో'ని. 

వరల్డ్ బ్యాంకు అప్పుని తీర్చటానికి  (తను చెయ్యాల్సిన కల్లెక్షన్), రేపటి అబ్బిగాడి పిలవబోయే 'అమ్మా' అన్న కొత్తరకం పిలుపుని 'లైవ్' ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు ఇంక ఆలస్యం చేయకుండా కెమెరా పెట్టేసాడు బాబీ ఇంట్లోనే ....

సంకురాత్రి కోడి కూయలేదు, కాని తెల్లారింది ...


యావత్ రాష్ట్ర ప్రజలు టీవి ల ముందు సెటిల్ అయ్యారు, 'లైవ్-
ప్రోగ్రాం' విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం హాలిడే డిక్లేర్ చేసేసింది ....
తమ బాబు కొత్త పిలుపు కోసం వొత్తులు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని మరీ వేసుకొని ఎదురుచూడసాగారు సోనీ, వాణీలు . 'అమ్మా' అని పిలవడాన్ని  శంకరాభరణం శంకర శాస్త్రి కంటే గొప్పగా ఇచ్చిన తన ట్రైనింగ్ మీద నమ్మకం తో బాబీ చాల కాన్ఫిడెంట్ గా కనిపించాడు. 

అబ్బిగాడు నిద్ర లేచాడు, రాష్ట్రం ఉలిక్కి పడింది....

చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న దాంట్లో ఎంత నిజం ఉన్నదో అబ్బిగాడు కూడా తన పాత్రకి న్యాయం చేస్తూ  పిలిచాడిలా ... 
('అమ్మా అనే పిలుపుకి ముందు తల్లి పేర్లు జోడించమని'  డాడీ చెప్పిన ఫార్ములా గుర్తుకి తెచ్చుకుంటూ ) 
సో..నీ..యమ్మ , వా..నీ..యమ్మ  
సో..నీయమ్మ , వా..నీయమ్మ  అని ఫార్ములా బాగా గుర్తు పెట్టుకున్నా పంక్చుయేషన్  మిస్ చేస్తూ రెండు సార్లు పిలిచేసి తన పని చేసుకోసాగాడు అబ్బిగాడు..

అబ్బిగాడి పిలుపులోని  'కమ్మ'దనానికంటే అందులో ఉట్టిపడుతున్న 'అమ్మ'దనానికి రాష్ట్రం
లో మొత్తం నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ చేతికి అందినవి-అందనివి కూడా వీధుల్లోకి విసిరేశారు..
లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యగా 144 సెక్షన్  విధించింది రాష్ట్ర ప్రభుత్వం.

పరిస్థితి చూసి భీతి చెందిన బాబీ, నిన్నటి 'టు'డే  లీవు ని 'టూ' డే
స్  లీవు గా మార్చుకొని, వెంటనే ఇంకొక ప్రయత్నంగా మళ్లీ కోచింగ్ ఇచ్చేశాడు అబ్బిగాడికి, మరో కొత్త ఆలోచనతో. 'ప్రజలంతా ఈవెనింగ్ ఎపిసోడ్ కి ఫిజికల్ గా రెడీ అవుతూ మెంటల్ గా ప్రిపేర్' అయ్యారు...
ఆ 'నాట్-ఫైన్' ఈవెనింగ్ అబ్బిగాడు మళ్లీ పిలిచాడిలా  సో..నీమమ్మీ...   వా..నీమమ్మీ... అంటూ ....
కాకపోతే శంకరం ఇచ్చిన క్లైమాక్స్ బ్యాక్-గ్రౌండ్ మ్యూజిక్ వల్ల 'ఇంగ్లీష్ మీడియం కుర్రాడు, తిడుతున్న తెలుగు బూతు లాగా వినపడసాగింది' ... అంతే మళ్లీ ప్రజలు రెచ్చిపోయారు....

ఇంకొక ఆఖరి ప్రయత్నంగా 'మమ్మీ' బదులు 'తల్లి' అని రీప్లేస్ చేసి ట్రైనింగ్ ఇద్దామా ? అన్న ఆలోచన తళుక్కున మెరిసింది బాబీ మెదడులో.  అంతలోనే (సో ..నీ ..తల్లి ,  వా...నీ..తల్లి)  తమ ఇంటి అన్యోన్య దాంపత్య జీవితం  టీవీ లో లైవ్ వస్తోందని గుర్తుకు వచ్చి 'ఇదేదో ఆంధ్రా బూతుకి  తెలంగాణా తర్జుమా లాగా' భావించి  'ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నాడనే' నెపంతో తనని ఎక్కడ తీవ్రవాదిగా ప్రకటించేస్తారో అని బయపడి ఆ ప్రయత్నాన్ని అంతటితో విరమించుకున్నాడు బాబీ . ఇంక పరిస్థితి మరీ అద్వాన్నం అయింది, ఏమి చెయ్యలో పాలుపోనీ బాబీ, అత్యవసర సమావేశం నిర్వహించి అబ్బిగాడి మమ్మీసుకి 'బారసాల' డిక్లేర్ చేసేసాడు.   పనిలో పనిగా అబ్బిగాడికి కూడా కానిచ్చెద్దాము అని డిసైడ్ అయ్యాడు బాబీ. శంకరం ప్రోమోల పుణ్యమా అని ఈ విషయం రాష్ట్రం మొత్తం మారుమోగిపోయింది.  "తల్లులకి, పిల్లవాడికి ఒకే పందిట్లో బారసాల"  అని తెలుసుకున్న జనం పెట్రేగిపోయారు ... రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ ప్రకటించేసింది....

'జనాలు వీధుల్లోకి విసిరేసిన వస్తువులు సేకరించడంలో ' రాష్ట్ర ప్రభుత్వ బలగాలు సరిపోక ప్రభుత్వం ఆర్మీ సహాయాన్ని అర్ధించింది . వీధుల్లోకి జనాలు విసిరేసిన కల్లెక్షన్స చూసి కళ్ళు తే
లేసింది ప్రభుత్వం. వరల్డ్ బ్యాంకు అప్పు  తీర్చటానికి సహాయం చెయ్యమని అడిగితే, వరల్డ్ బ్యాంకుకె అప్పిచ్చే రేంజ్ కి తీసుకెళ్ళిన శంకరాన్ని  రాష్ట్ర ప్రభుత్వం  పొగుడుతూ,  దేశ ప్రజల మానసిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 'భవిష్యత్తులో ఇంకెప్పుడు ఛీ-రియల్ తీయను' అని ప్రమాణం చేయించుకొని మరీ  'ఛీ-రియల్ -- సన్నాసి' అనే బిరుదు తో సత్కరించేసింది. అంతేకాకుండా, బాబీ ఫ్యామిలీ డ్రామా కి 'సీరియల్ అఫ్ ది మిలీనియం' అవార్డునిచ్చి  కేంద్ర ప్రభుత్వం సత్కరించింది శంకరాన్ని.



*****       *****       *****

కథకు సంబంధం లేదు ఇది మనలో మన మాట :  
చదవండి  బాబీ గాడి 'క'హాని, 
మీకు ఖచ్చితంగా  'నో' హాని, 
దీని రుచి గుర్తుకు తెప్పిస్తుంది ఫ్రెష్ 'హని', 
చదివినవారంతా  అనాలి హ హ 'అని'
మనస్పూర్తిగా కోరుకుంటూ ... ముగించేస్తున్నాను ... 
బాబోయ్ .. ఇలా అయితే ఎలా ?  అనకండే మఱి


February 7, 2013

ఛీ కొడతారా? చికాకు పడతారా ?



కధా రచన : సాత్విక


వానోచ్చిందంటే వయసోస్తాది, వయస్సోచ్చిందంటే వలపొస్తాది ...డుం డుం డిగా డిగా ....

గవర్రాజు
గవర్రాజ ! మజాకా !!

ఆ కాలనీ లో అందరి జీవితాలలోకి  'టీనేజ్' అనేది వానోచ్చినట్టే వచ్చింది.. ఒక్కడకి తప్ప !!   ఆ ఒక్కడే గవర్రాజు. గవర్రాజుకి మటుకు 'టీనేజ్' సునామి వచ్చినట్టు వచ్చింది.

'టీనేజ్' అనే సునామీ ఎఫెక్ట్ గవర్రాజు లో ఎన్నో రసాయనిక చర్యలకి కారణమయింది. వాటిలో కొన్ని సాంపిల్స్ ..  మీ కోసం ....

రోజుకు మూడుసార్లు తన వింటేజ్ సీడీ ప్లేయర్ లో 'భారతీయుడు'సినిమా  సీడీ ని  పెర్మేనంట్ గా ఇరికించేసి మరీ చూడటం మొదలెట్టాడు గవర్రాజు. రోజూ 'భారతీయుడు' సినిమా చూస్తున్న తన కొడుకు దేశభక్తికి పొంగిపోయాడు గవర్రాజు తండ్రి  'వీర్రాజు'. కొడుకు సినిమాలో ఏమి చూస్తున్నాడు అని తెలుసుకోవల్లన్న వెర్రి కుతూహులం కలిగింది వీర్రాజు కి.


వీర్రాజు అడిగాడు గవర్రాజు ని 'భారతీయుడు సినిమా హీరోయిన్ మనీషా ?' అని

'ఆమె మనిషి కాదు డాడీ దేవత' అని నాలిక్కరుచుకున్నాడు గవర్రాజు.

ఇంతలో టీవీ ఛానల్ మార్చాడు వీర్రాజు. టీవీలో  నటి 'భంజిత' ఇంటర్వ్యూ  సాగుతోంది  ఇలా ..


'always-ఆనంద' అనే ఆధ్యాత్మిక గురువు గారి దీవెనలతో నటి 'భంజిత' చాలా ఎత్తుకు ఎదిగింది ఈ మధ్యే.

(ఎంత ఎత్తు అని టేప్ పట్టుకు రాకండి, ఇంకా చాలా మంది కోలుస్తూనే ఉన్నారు. లెక్కలు తేలలేదు ఇంకా..)

యాంకర్  :   'భంజిత' గారు మీకు జీవితంలో బాగా తృప్తి కలిగించిన అంశం ఏదన్న ఉన్నదా ?

భంజిత :    మా గురువు గారు 'always-ఆనంద' పండిట్-జివితానుభావం  నాకు ఎంతో తృప్తి కలిగించింది.

గవర్రాజుకి మటుకు 'పండిట్-జివితానుభావం' అనే మాట  కాస్తా " పండిట్-జీ-విత్-అనుభవం" గా వినిపించింది. ఒక్కసారిగా ప్రక్కన కూర్చొని ఉన్న వాళ్ళ  డాడీ జబ్బ చరిచి మరీ  నవ్వాడు గవర్రాజు. గవర్రాజు తండ్రి  'వీర్రాజు' మటుకు  ఈ  'రచ్చ' తట్టుకోలేక అక్కడినుంచి లేచి-వెళ్ళిపోయాడు ప్రక్క గదిలోకి


ఇలా ప్రతి మాటలోనూ గవర్రాజుకి తత్త్వం  భోదపడసాగింది. ఈ ఎఫెక్ట్ లోనుంచి బయటపడడానికి, గవర్రాజు మటుకు సిన్సియర్ గా కష్టపడడం మొదలెట్టాడు.


ఎడ్యుకేషన్ కి కొంచం డిస్టెన్స్ మెయిన్ టైన్ చెయ్యాలి అని సింబాలిక్ గా త్వరలో క్లోజ్ చేయబోతున్న ఒక ఓపెన్ యూనివర్సిటీ లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్స్ లో  చేరాడు గవర్రాజు. అంతే కాక , ఆ వీధిచివర  ఉన్న'పత్రీజీ పాన్ షాప్' దగ్గర గాలి బ్యాచ్ మైంటైన్ చేస్తున్న బంగార్రాజు తో స్నేహం మొదలెట్టాడు గవర్రాజు. గాలి బ్యాచ్ లో అడుగు పెట్టిన మొదటిరోజే గవర్రాజు సాల్వ్ చేసిన కొన్ని గాలి పజిల్స్ ఇవి.



       **** గాలి పజిల్స్  ****

గాలి పజిల్ : 'సీనియర్'ని ఏడిపిస్తూ ప్రిన్సిపాల్ కి దొరికి పోయాడు సాల్మన్ రాజు. నువ్వు ప్రిన్సిపాల్ దగ్గర  సాల్మన్ రాజుని ఎలా కాపడతావు ?

గవర్రాజు రెస్పాన్స్: ఇది చాల సింపుల్. సీనియర్  అంటే 'సీ-థెం-వేరి-నియర్ ' అన్న ఊహతో సాల్మన్ రాజు కాస్త దగ్గరకు వెళ్ళాడని చెప్పి వాదిస్తాను అన్నాడు.

గాలి పజిల్ : '144 సెక్షన్' గురించి  నీ  ఒపీనియన్ ?

గవర్రాజు రెస్పాన్స్: 143 (ఐ లవ్ యు ) అని చెప్పుకున్నవారికి  'కలిసి తిరుగుతూ కనపడద్దు' అన్న హెచ్చరిక గా  ఉంటుందని  ఇమ్మిడియేట్  నెంబర్ (144)ఇచ్చారు.    

గాలి పజిల్ : మాస్టర్ కి లెక్చరర్ కి తేడ ఏమిటి ?

గవర్రాజు రెస్పాన్స్: లాంగ్  స్టోరీని షార్ట్ గా చెప్పేవాడు మాస్టర్ ,  షార్ట్  స్టోరీని లాంగ్ గా చెప్పేవాడే లెక్చరర్ అని చుట్టూ చూసాడు.

ఆఖరి పజిల్ : 100 రోజులు ఆడిన 'ఒక్క మొగాడు' సినిమాని  200 రోజులు ఆడించాలంటే ఏమి చెయ్యాలి ?

గవర్రాజు ఆఖరి రెస్పాన్స్:  ఒక్క మొగాడు అని  కన్ఫర్మ  చేయకుండా 'వీడు మగాడా ?' అన్న క్వశ్చన్ వేసుంటే సమాధానం దొరకక  ప్రేక్షకులు '200' రోజులు ఆడించేవాళ్ళు అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు.

'ఒన్స్ మోర్' అంటూ చాల మంది వీలలు వేయడం మొదలెట్టారు


పైన గవర్రాజు సాల్వ్ చేసిన గాలి పజిల్స్ ని ఇంచుమించు మొత్తం ముఖ్య సభ్యులు సంతృప్తి వ్యక్తపరిచి అతనిని తమ గాలి బ్యాచ్ లోకి అనుమతించారు. అలా గాలి బ్యాచ్ లో మెరిట్ తో స్థానం సంపాదించుకున్న గవర్రాజుకి 'గర్ల్ ఫ్రెండ్' వుంటే బాగుంటుంది అనిపించింది, కాకోపోతే ఈ మధ్యే కాన్సర్ అవగాహన సభకి హాజరయిన మనిషా కొయిరాల ని చూసి మనస్సు చలించి మనీషా అన్న పేరున్న ఒక అమ్మాయికి తన వంతుగా జీవితాన్ని ప్రసాదించాలి అన్న అంకిత భావంతో  'అష్ట-చెమ్మ' సినిమాలో  లావణ్య ఫిక్స్ అయినట్టు అయ్యాడు గవర్రాజు.


'గాలి పజిల్స్' లో గవర్రాజు ఇచ్చిన సలహాతో తన మీద వున్న కంప్లైంట్ నుంచి తేలికగా బయటపడ్డ   'సాల్మన్ రాజు' గవర్రాజు ని 'గాడ్-ఫాదర్' లాగా  ఆరాధించడం మొదలెట్టాడు. అదే ఆరాధనా భావం తో గవర్రాజు యొక్క 'మనీషా' మేటర్ని  సీక్రెట్ గా  తెలుసుకొని రిస్క్ చేసి ఒక రహస్యాన్ని గవర్రాజు  'మెయిలు బాక్స్'కి చేర వేసాడు  సాల్మన్ రాజు.


(ర-హ-స్య-o : ఉల్ఫా డిపార్టుమెంటు హెడ్ జేఫ్ఫా కూతురు  'మనీషా'  (మనిషేనండి బాబూ, కాకపోతే 'మనీషా' అనేది ఆ అమ్మాయి పేరు ) )


మెయిల్ ద్వారా విషయం తెలుసుకున్న గవర్రాజు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా గెంతులు వేస్తూ   'మనీషా'నే తన జీవిత భాగస్వామి అని డిసైడ్ అయి డైరెక్ట్ గా ఓపెన్ చేసేసాడు తండ్రి దగ్గర మేటర్ నిలా...



  ****   వీర్రాజు   వెర్సెస్    గవర్రాజు (తండ్రి కొడుకుల  సంభాషణ )  ****

గవర్రాజు  : పడ్డానండి ప్రేమలో మరీ, విడ్డురంగా ఉందిలే ఇది

వీర్రాజు  : చండాలంగా ఉందిరా ఇది!! నిజంగా ! నిజంగా!    ఇంతలో సీరియస్ నెస్ గుర్తొచ్చి , ఛీ నీకేమన్నా పిచ్చా ?  అన్నాడు.
గవర్రాజు : కాదు కాకపోతే   నేక్స్ట  స్టేజ్ , అదే  'ప్రేమ' అని కన్ఫర్మ  చేసాడు (పిచ్చి ముదిరితే ప్రేమ అని మనోడి స్ట్రాంగ్ ఫీలింగ్).
వీర్రాజు: ఫామిలీ డీటెయిల్స్ ఏమిటి అన్నాడు ?
గవర్రాజు :   'అమ్మ మలయాళీ' , 'నాన్న బెంగాలి' , 'మనీషా వాళ్ళ అమ్మాయి అవునో  కాదో తెలియాలి'  అన్నాడు.
వీర్రాజు : 'దాన్ని  చేసుకుంటే నువ్వు అడుక్కు తినాలి' అంటూ వెళ్లి పోయాడు అక్కడి నుంచి.

(గవర్రాజు ఇంట్లో జరిగిన విషయం తెలుసుకున్నాడు బంగార్రాజు, స్నేహితుడికి  ధైర్యం చెప్పే పనిలో భాగంగా ఇలా మొదలెట్టాడు బంగార్రాజు  )


'నే వెళ్ళా   కోల్ కత్తా',

'అక్కడ ఎప్పటి నుంచో వుంది మా అత్త'.

వాళ్ళ పక్కింటి  పదహారేళ్ళ  అమ్మాయి  'సునంద',    పిలిచేది నన్ను  రాజు'దా'

('దా'  అని పేరు చివర జోడిస్తే 'అన్నా'అని అర్ధం అని గవర్రాజు కి తెలియదు మరి)

అంటూ  'బెంగాలీ వాళ్ళు సున్నిత మనస్కులని ' క్రికెటర్ గంగూలీని కూడా సౌరవ్'దా' అని పిలిచి ఆదరించారని, మనీషా కూడా నిన్ను ఖచ్చితంగా గవర్రాజు'దా' అని పిలుస్తుందని స్నేహితుడికి ధైర్యం చెప్పాడు బంగార్రాజు.


'పాకిస్తాన్లో పని అవ్వకపోతే, ఆఫ్గనిస్తాన్ లో ప్రయత్నించాలి' అని గవర్రాజుకి 'లెంప కాయ ' కొట్టి మరీ ప్రోత్చహించ్చాడు బంగార్రాజు .


ఎప్పుడూ లాజికల్ గా  మాత్రమే ఆలోచించే గవర్రాజు , బంగార్రాజు చెప్పిన మేటర్ లోని రాంగ్ సెన్స్ కన్నా రైమింగుకి  విలువిచ్చి   చాలా కన్విన్సింగ్గా ఫీల్ అయ్యాడు గవర్రాజు.



     **** ఉల్ఫా డిపార్టుమెంటు స్టాఫ్ రూం  ****

యూనివర్సిటీ కె మొదటిసారి వచ్చిన గవర్రాజుని , అతని వెనక ఉన్న గ్యాంగ్ ఫాలోయింగ్ చూసి  దగ్గరలోని 'కరువు ప్రాంతానికి అరువు నుంచున్న MLA' అని అనుకున్నారు స్టాఫ్ అంతా.


ఇంతలో అటుగా వచ్చిన జేఫ్ఫా చూసాడు గవర్రాజు ని  ఏమిటన్నట్టు ?


డైరెక్ట్ గా మేటర్ లోకి వచ్చాడు గవర్రాజు 'నేనూ మీ అమ్మాయి మనీషా ... ' అంటూ తట పటాయించాడు ఒక్కరవ్వ ..

కుర్రాడి ఇబ్బంది గ్రహించిన జేఫ్ఫా 'క్లాస్ మేట్స్ ' అంటూ కంగారుగా  కన్ఫర్మ చేయబోయాడు  జేఫ్ఫా. అంతే గవర్రాజుకి 'పెన్ డ్రైవ్ లోని వైరస్ హార్డ్  డ్రైవ్ లోకి  పాకినట్టు' పాకింది కోపం.
ఇంత చిన్న గ్యాప్ ని కరెక్ట్ గా ఫిల్ చేయలేకపోయారు, నువ్వు అసలు మనిషివా? మా డాడివా? అన్నాడు ఆయాసంతో. అతని ఆవేశాన్ని చూసిన జేఫ్ఫా బిత్తరపోయి చూడసాగాడు.


'ఒక ఆడ పిల్లని ప్రేమిస్తావా నువ్వు ?' అంటూ అసిస్టెంట్ HOD కలగచేసుకున్నాడు

'మీరు మగాళ్ళని ప్రేమిస్తారా ?' అని ఆశగా అడిగాడు బంగార్రాజు..

మనీషాని 'ప్రేమిస్తున్నాను' అని తను చెప్పలేకపోయిన క్లోస్డ్ మేటర్ ని ఓపెన్ చేసేసిన అసిస్టెంట్ HODకి థాంక్స్ చెప్పుకున్నాడు  గవర్రాజు, మనస్సులోనె.


ఈ గజి బిజీ సంఘటనల మధ్య 'డాడీ' అంటూ ఎంట్రీ ఇచ్చింది అక్కడే లెక్చరర్ గా పని చేస్తున్న 'మనీషా' మేడం....

(తరవాత ఏమి జరిగింది ? మనీషా గవర్రాజు ని గోవా లో ఎందుకు కలిసింది ?...)
 చదవగాలరా ? రాయమంటారా ? ఇంక చాలు అంటారా ?

ఇప్పుడు మీ టర్న్ .. గవర్రాజు లోవ్వు స్టోరీ కి 

ఛీ కొడతారా ? చికాకు పడతారా ?

(ఎటువంటి పరిస్థితుల్లో కూడా  రైటర్ 'హింస రాజు' అడ్రస్ ఇవ్వబడదు, ఛీ కొట్టినా చికాకు పడదలచినా  క్రమశిక్షణ తో ఈ క్రింది కామెంట్స్ సెక్షన్ వాడుకోండి )