కవిత రచన : సాత్విక
ఊరి
చివర కొండొక టుంది,
కొండ
ఎదురుగ ఇల్లోక టుంది,
ఇంటిలో
ఉమ్మడి కుటుంబ ముంది,
ఆప్యాయతా
అనురాగాలకిక లోటే ముంది ..
తోటికోడలి
తుంటరి పలుకులు,
మేనకోడలి
ముద్దు మకరందాలు,
బావగారి
కొంటె చమత్కారాలు,
మామగారి
ముచ్చటైన పలకరింపులు ..
ఇంటిలోని
గదులేమో మరీ మరీ చిన్నవి,
కానీ
వారి మనస్సులు చూడముచ్చట
గున్నవి,
ఇంటిల్లిపాది
ఒకరికొకరుగా జీవించే లే,
ఎదురుగున్న
కొండే ఒక దిక్కుగా నిలచ లే
..
ఆశావాహం
ఆధునికతతో సంకర మించెను,
అనవసరపు
భూ విక్రయాలకి ఉపక్ర మించెను,
ఊరు
పెరిగి పెరిగి విశాలంగా విస్త
రించెను,
తావు
తరిగి తరిగి కాడు కూడా తస్క
రించెను ..
దందాల
హోరు అర్ధ రహితము గుండ
భూ
పాలకుల దాహానికి అది నిలువలే
కుండ,
వ్యాపార
విలువల విపరీత పోకడలు పెరగ
కుండ,
ఆపలేకపోయింది
ఆ కొండ కూడా ఇది జరగ కుండ ..
వాస్తవ
అవసరాలు నలు దిక్కులా చేయి
చా చెను,
ప్రతి
ఇంట్లో ఎవరికివారే పెద్ద
దిక్కుగా నిల చెను,
విడివడిన
కుటుంబాలకి గదులు విశాలముగనిపిం
చెను,
ఒక
దిక్కుగా నిలచిన కొండే
కనుమరుగుగనిపిం చెను ..
(పొంతనే లేదు కానీ , శ్యామలీయం గారి 'ఊరి కొలను' అనే కవిత దీనికి ప్రేరణ ..)