కవిత రచన : సాత్విక
ప్రియురాలి ప్రేమని పొందలేని ప్రతిసారి,
ప్రయత్నించే ప్రియుడితో 'విసుగు' వేసారి,
అడిగెను విడిచిపెట్టమని కొసరి కొసరి,
కానీ ఆ ప్రియుడు 'విసుగు'ని నెట్టేను కసరి,
'విసుగు' ముంగిట ఇక చీకటి ముసరి,
ఆ ప్రియుడు చూపెను తననే తనకి మరీమరి,
అలా తనని తను రుచి చూసిన ప్రతిసారి,
కక్ష బూని అనుకొనెను 'ఇది అవ్వాలి తనకి కడసారి',
కానీ, ప్రతి ప్రేమ జంట వరస తలచి తన ఉత్సాహం చేజారి,
ఆ పై తను సేద తీరెను, ప్రియుడే మొగుడైన ఆతని చెంత చేరి …