కవిత రచన : సాత్విక
"నీ చిరునువ్వు"
లోన హుందాగా దాగుంది రాజసం,
సొంతం చేసుకొమ్మని మారం చేసింది నా మానసం,
' ఊహ కందని ఊసుతో ' మొదలెట్టాను నీతో సావాసం,
నీ ఆలోచనలతోనే గడుపుతున్నాను ,
' మా ' ఖసమ్…
( 'मा' ख़सम )
"అనుక్షణం నా మనస్సు"
పరిబ్రమించును నీతో గడుపు క్షణాల కోసం,
నీ ప్రతి చూపులోని అర్ధం ఎప్పటికీ అంతేపట్టని అభ్యాసం,
నీవెదురైన ప్రతిక్షణం నాలో రేగిన అలజడి తాకేను ఆకాశం,
అది ఆస్వాదించడానికి నేను చేయలేదు,
' ఒ ' ఘడియైనా ఆలస్యం…
"నీ చూపులోని చిలిపితనం"
నన్ను విడువదు కదా ఒక్క క్షణం.. కనీసం,
అలా ప్రతి క్షణమవుతోంది నామదిలో ఒక మధుర విలాసం,
ఆ మధుర క్షణాల దొంతరలు కలిగిస్తున్నవి నాకు పరవశం,
ఈ ఘట్టం లేకుండా సంపూర్తి కాదు,
' ఏ ' ప్రేమ ఇతిహాసం …
'నా కన్నులతో నిను జూడ'
నాకు దక్కిన అద్భుత అవకాశం,
అది తలచిన ప్రతిసారీ మెరిసెను నా మదిలో దరహాసం,
స్పందించిన నా హృదయంలో పెల్లుబిక్కేను కవితారసం,
నిన్ను నా కన్నులతో నీకే చూపడానికి నాకు అవసరం,
' ఈ ' పద విన్యాసం …
"నీ ప్రతి జ్ఞాపకం"
నా మదిలోన పదిలం,
'చెరుప' చేయలేదు కాలమైన.. ' ఆ ' సాహసం …