కవిత రచన : సాత్విక
నా చుట్టూ ఉన్నవి కొన్నే
నాలో ఉన్నవి ఎన్నో, ఎన్నెన్నో,
నా చుట్టూ ఉన్నవన్నీ నాకే,
పరిచయం చేస్తున్నాయి… నన్నే!!
'నన్నే' నేను తెలుసుకోలేకున్నా,
'నేను కాని నన్ను' నేనేననుకున్నా,
'నేను' అంటే తెలిసిన మరుక్షణం,
'లేని నన్ను చూసి నవ్వుకున్నా'…నాకు నేనే!!
"అహం బ్రహ్మాస్మి"లోని గెలుపే శ్రీ రాముడు,
అందులో దాగున్న అలుపే దుర్యోధనుడు,
"అహం బ్రహ్మాస్మి"లోని ఓరిమి దాన కర్ణుడు,
అందులో దాగున్న ఓటమి రావణాసురుడు …
అన్ని భావాలని ఇముడ్చుకొనుటే కాల కర్తవ్యం,
వీక్షించు అంతరంగపు కోణం నిర్ణయించును భవితవ్యం,
గీత గోవిందుడు మనకు వినిపించిన పవిత్ర కావ్యం,
'ఇంట గెలిచి రచ్చ గెలువు' అన్నదే తాత్పర్యం …