కవిత రచన : సాత్విక
వాళ్ళు వీళ్ళు,
అంటూ ఇంకెన్నాళ్ళు,
కాలకూటవిష దిగమింగుళ్ళు,
కరువాయెనే ధర్మానికి ఎక్కిళ్ళు,
తప్పకుందాయే న్యాయానికి వేవిళ్ళు,
ఇవేనా?, 'నా నవసమాజపు' పునాదిరాళ్ళు,
' మద్యం మదం కులం ' అనేవే తూనికరాళ్ళు,
ఆలసించక వేయండి చౌకబారు రాజకీయానికి సంకెళ్ళు,
ఎటు చూచినా స్వాతంత్రానికి లోబడిన స్వార్ధపు ఆనవాళ్ళు,
ఓటు అమ్ము(కొను)టే స్వార్ధానికి ఎరవేయబడిన సార్వతంత్ర నకల్లు,
తరచి చూచిన, భరతమాతకైనా తెలుయకున్నది ప్రజాస్వామ్యపు ఆనవాళ్ళు,
మూసపోసిన ఆటవిక రాజకీయ ఆగడాల స్వస్తికై వేయాలి నేటి యువ రక్తం పరవళ్ళు ...