February 28, 2013

ఇదే విషయం అదే మేటర్.. కదా ?

కవిత రచన : సాత్విక

అబ్బిగాడి  స్నేహితుడు  సుబ్బిగాడు, సుబ్బిగాడికి ఫ్రెండ్ అబ్బిగాడు,

ఎలా.. ఎలా.. ఎలా చెప్పనూ ? 
ఈ చిన్న మేటరు .....(అదేనండి  విషయం)
ఎలాగోలాగా ప్రయత్నిస్తాను మరి  .....

మన అబ్బిగాడు ....

చిన్నప్పుడే వీధి బడికి పోయాడు, తెలుగు మీడియం చేరాడు,
పంతులుగారు తెచ్చారు బాలశిక్ష, ఆ పై తీర్చుకున్నారు ఆయన కక్ష,
ప్రక్రుతి వికృతి ఎలుగెత్తి చాటారు, ఇదే తేట తెలుగు అని నొక్కి వక్కాణించారు,
లంబ కోణ లెక్కలెన్నో మీకు విదితమేనన్నారు , ఇదంతా మన గణితమేనన్నారు,
'అసామాన్య' విషయాలు భోదించారు , ఇదే సామాన్య శాస్త్రమంటూ వివరించారు,
'అసాంఘిక' చర్యలకు అద్దం పట్టారు , అదే  చరిత్ర నేర్పిన సాంఘికమన్నారు ...

మరి సుబ్బిగాడో ..............


చిన్నప్పుడే కాన్వెంట్ లో చేరిపోయాడు, ఆంగ్ల మీడియం  లో దూరిపోయాడు,
పెట్టించారు అందరికి గుడ్డు మార్నింగు, చేయించేసారు పొద్దున్నే వాకింగ్ , 
జాతీయ భాష నేర్వమన్నారు , తెలుగు ఎందుకంటూ జాతియం చేసారు,
… య్… యా... యాపిల్.. అని చేసేసారు ఫిక్స్ , అత్యవసరంగా నేర్పించేసారు సీలబుల్ ఫోనిక్స్,
చదివేయమన్నారు మోరల్ సైన్స్, అసలు అక్కరలేదు అన్నారు కామన్ సెన్స్ ,
వింత వింత విక్టరీలు వినిపించేసారు, ఇదే తర-తరాలుగా తెచ్చుకున్న హిస్టరీ గా తేల్చేసారు …


తెలుగు మీడియం అబ్బిగాడికి, సుబ్బిగాడు  ఒక మంచి స్నేహితుడు,
ఆంగ్ల మీడియం సుబ్బిగాడికి, అబ్బిగాడు  ఈస్  ఏ గుడ్ ఫ్రెండ్ యూ నో ...

2 comments:

  1. memu oka kavitha chadive lopala nuvvu 10 kavithalu raasthunnav? U r in full josh! What's the matter?

    ReplyDelete
    Replies
    1. ఏమిలేదు ఇదే విషయం అదే మేటర్ కదా అందుకని అంతే !

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు