కవిత రచన : సాత్విక
ఆది-అంతం కలిపేస్తే ఆద్యంతం
అవే విడదీస్తే మిగిలేది అనంతం…
ఎదురు పడితే వాట్స్ అప్ ?
ప్రక్కకి వెళితే వాట్స్ యాప్ ...
(whats up ?, whats app )
లక్ యొక్క లుక్కు లక్షలిచ్చు
లయ తప్పిన లైఫే బిక్క చచ్చు …
(luck, look)
అల్వేస్ ఆలోచించు ఫర్ ఆల్—వేస్
నౌ ఏ డేస్ అవుతాయి నవ్వే డేస్
(always, all ways, now-a-days)
మడతపెట్టి నొక్కి ఉంచితే ఇస్త్రీ
మేలికపెట్టి తొక్కి ఉంచితే అదే నీ-స్త్రీ
డబ్బుండి ముడి పెడితే అది పోనీ టైలు
డబ్బు లేక మడతెడితే ఛీ పో అది నీ టైలు …
(pony tail, tail)
డబ్బు లేక నన్ను చూస్తే కలిగే అందరికీ కంపరం
అదోచ్చినాక నన్నడిగే అందరూ "యు కం ఫ్రొం ? " …
(you come from ?)
నేడు గెలిచి రేపటికై చూస్తే దూరాలోచన
నేడు మరచి రేపటికై చూస్తే దురాలోచన
లైఫ్ లో ప్రతి ఘడియలోనున్నది మ్యాజిక్కు
తరచి చూస్తే తప్పక తెలియును ఈ లాజిక్ …
(magic, logic)
నిన్ను నువ్వు నమ్ముకుంటే అది స్వశక్తి
నిన్నే నువ్వు నమ్మకుంటే చెప్పక తప్పదు దేనికైనా స్వస్తి…
చివరి రెండులైన్స్ చాలానచ్చేసాయి.
ReplyDelete