కవిత రచన : సాత్విక
ఓరోరి సామాన్యుడా, పొద్దు పొద్దునే
లేస్తూనే ....
అవినీతి
అన్యాయం అక్రమం అని అరవడం ఆపవోయి ,
ఆలోచించి
నిజం గ్రహించి మార్పుకి నాంది పలకవోయి,
మనం
మారితే ,
రేపటి
తరం అదే మారుతుందోయి,
నీవే
మారకుంటే,
ఎప్పటికి
మార్పుండదు అంతేనోయి,
వేల
కోట్ల కోసం,
బడా-బడా
నాయకులు చేసారూ చోటాసా స్కాములు,
వంద
నోటు కోసం,
ఎడా-పెడా
సామాన్యులు వేస్తున్నారు
బ్యాక్-డోర్
స్కీములు,
వంద
నోటు కోసం నీవు నడిచిన రూటు
ముందు,
వేల
కోట్ల కోసం వారు పడిన పాట్లు
వెలవెల బోయెరా,
ఆశ ఉండీ అవకాశం రాని అదృష్టం నీదిరా,
అవకాసమొచ్చి ఆశ చావని దౌర్బాగ్యం వారిదిరా...
దోచుకున్న
సొమ్ములో ఎక్కువ-తక్కువలు,
అవినీతి
పాళ్ళలోని తక్కువ-ఎక్కువలు,
బలహీనతకివే నేరు కొలమానాలు...
వారి బలహీనత సమర్ధనీయం కాదోయి, ఏ మాత్రం,
వారి బలహీనత సమర్ధనీయం కాదోయి, ఏ మాత్రం,
నిజం
తెలుసుకొని బలపడవోయి,
నీవు
మాత్రం…
రసీదులొదలి నీవు చెల్లించిన పైకాలు లెక్క పెట్టుకో,
జీవిత క్రీడలో చేసిన అక్రమాల స్కోరెంతో చూసుకో,
కరప్షణ్ బ్యాంకులో, పొందిన ర్యాంక్ ఎంతో తెలుసుకో,
నీలోని అవినీతిని ఇకనైనా రూపు మాపుకో...
నీ భర్తో - నీ భార్య
నీ అక్కో - నీ చెల్లో,
నీ అన్నో - నీ తమ్ముడో,
నీ అన్నో - నీ తమ్ముడో,
తప్పు
చేస్తే నువ్వు వెన్నుతట్టకోయి,
ప్రశ్నించీ
నిలువరించి తెలియచేయవోయి,
వినకపోతే
బయటపెట్టు తప్పులేదులేవోయి,
న్యాయముగా పొందినది తగు రీతిన దాచుకొనుటే పొదుపురా,
అన్యాయముగా అందునది మనకొద్దన్న ఆలోచనే అదుపురా,
మనకెందుకు
!
మనకెందుకు
!
అన్న
పదం మరిచిపో,
పద
ముందుకు,
పద
ముందుకు అని నువ్వు మారిపో..
మనమీ
ఆలోచనకి బీజము నాటేద్దాము,
ఆలసించక
నిరసించక ఆచరించేద్దాము,
మన
నైజాన్ని మార్చుకొని
చూపిద్దాము,
సమాజాన్ని తరువాత బాగు చేసేద్దాము..
చిల్లరమార్గం
వదిలేద్దాము,
ఇదే
నిజాయితీ అని భావితరానికి చాటేద్దాము,
రాచమార్గం నిర్మిద్దాము,
అదే
ఆనవాయితీగా తరతరాలకి పాటిద్దాము...




