July 20, 2013

మై స్టార్ నైట్

సాత్విక     

నన్ను వేదించే తన తలపులన్నీ
అడిగెను నన్నే మేము ఎన్ననీ,
నేను ఎన్నలేను వాటినన్నిటినీ,
అందుకే ఆకసానుంచాను కొన్నిటిని,

చుక్కల్లోని కొన్ని చిలిపి చుక్కలు, 
వాటి  వెక్కిరింతకి తన బుగ్గ ఎరుపులు,
తలచిన నా మనసులో ఎన్నో మెరుపులు,
చూడలేని చందమామ మూతిముడుపులు

కవిత రాయాలని తపిస్తున్నా,
ప్రతి పదం నాకు ఎర వేస్తున్నా,
తన అందానికి తూగదని ఏరేస్తున్నా,
సరికొత్త నిఘంటువునే నే రాసేస్తున్నా...


July 13, 2013

సాత్విక

కవిత రచన : సాత్విక

"నీ చిరునువ్వు"
                          లోన హుందాగా  దాగుంది రాజసం,
    సొంతం చేసుకొమ్మని మారం చేసింది  నా మానసం,
' ఊహ కందని ఊసుతో ' మొదలెట్టాను నీతో సావాసం,
  నీ ఆలోచనలతోనే గడుపుతున్నాను , 
                                                 ' మా ' ఖసమ్ 
                                                   ( 'मा'  ख़सम )

"అనుక్షణం నా మనస్సు"
                  పరిబ్రమించును నీతో గడుపు క్షణాల కోసం,
నీ ప్రతి చూపులోని అర్ధం ఎప్పటికీ అంతేపట్టని అభ్యాసం,
నీవెదురైన ప్రతిక్షణం నాలో రేగిన అలజడి తాకేను ఆకాశం,
అది ఆస్వాదించడానికి నేను చేయలేదు, 
                                        ' ఒ ' ఘడియైనా ఆలస్యం 

"నీ చూపులోని చిలిపితనం"
                     నన్ను విడువదు కదా ఒక్క క్షణం.. కనీసం,
అలా ప్రతి క్షణమవుతోంది నామదిలో ఒక మధుర విలాసం,
ఆ మధుర క్షణాల దొంతరలు కలిగిస్తున్నవి నాకు పరవశం, 
ఈ ఘట్టం లేకుండా సంపూర్తి కాదు,  
                                              ' ఏ ' ప్రేమ ఇతిహాసం  

'నా కన్నులతో నిను జూడ' 
                              నాకు దక్కిన అద్భుత అవకాశం,
అది తలచిన ప్రతిసారీ మెరిసెను నా మదిలో దరహాసం,
స్పందించిన నా హృదయంలో పెల్లుబిక్కేను కవితారసం,
నిన్ను నా కన్నులతో నీకే చూపడానికి నాకు అవసరం, 
                                                ' ఈ ' పద విన్యాసం  

"నీ ప్రతి జ్ఞాపకం" 
            నా మదిలోన పదిలం, 
                   'చెరుప' చేయలేదు కాలమైన..  ' ఆ ' సాహసం  

June 12, 2013

విసుగు వేసారి

కవిత రచన : సాత్విక

ప్రియురాలి ప్రేమని పొందలేని ప్రతిసారి,
ప్రయత్నించే ప్రియుడితో 'విసుగు' వేసారి,
అడిగెను విడిచిపెట్టమని కొసరి కొసరి,
కానీ ఆ ప్రియుడు 'విసుగు'ని నెట్టేను కసరి,
'విసుగు' ముంగిట ఇక చీకటి ముసరి,
ఆ ప్రియుడు చూపెను తననే తనకి మరీమరి,
అలా తనని తను రుచి చూసిన ప్రతిసారి,
కక్ష బూని అనుకొనెను 'ఇది అవ్వాలి తనకి కడసారి',
కానీ, ప్రతి ప్రేమ జంట వరస తలచి తన ఉత్సాహం చేజారి,
ఆ పై తను సేద తీరెను, ప్రియుడే మొగుడైన ఆతని చెంత చేరి 

May 28, 2013

కొండ కొండా .. యాడున్నావు ??

కవిత రచన : సాత్విక

ఊరి చివర కొండొక టుంది,
కొండ ఎదురుగ ఇల్లోక టుంది,
ఇంటిలో ఉమ్మడి కుటుంబ ముంది,
ఆప్యాయతా అనురాగాలకిక లోటే ముంది ..

తోటికోడలి తుంటరి పలుకులు,
మేనకోడలి ముద్దు మకరందాలు,
బావగారి కొంటె చమత్కారాలు,
మామగారి ముచ్చటైన పలకరింపులు ..

ఇంటిలోని గదులేమో మరీ మరీ చిన్నవి,
కానీ వారి మనస్సులు చూడముచ్చట గున్నవి,
ఇంటిల్లిపాది ఒకరికొకరుగా జీవించే లే,
ఎదురుగున్న కొండే ఒక దిక్కుగా నిలచ లే ..

ఆశావాహం ఆధునికతతో సంకర మించెను,
అనవసరపు భూ విక్రయాలకి ఉపక్ర మించెను,
ఊరు పెరిగి పెరిగి విశాలంగా విస్త రించెను,
తావు తరిగి తరిగి కాడు కూడా తస్క రించెను ..

దందాల హోరు అర్ధ రహితము గుండ
భూ పాలకుల దాహానికి అది నిలువలే కుండ,
వ్యాపార విలువల విపరీత పోకడలు పెరగ కుండ,
ఆపలేకపోయింది ఆ కొండ కూడా ఇది జరగ కుండ ..

వాస్తవ అవసరాలు నలు దిక్కులా చేయి చా చెను,
ప్రతి ఇంట్లో ఎవరికివారే పెద్ద దిక్కుగా నిల చెను,
విడివడిన కుటుంబాలకి గదులు విశాలముగనిపిం చెను,
ఒక దిక్కుగా నిలచిన కొండే కనుమరుగుగనిపిం చెను ..

(పొంతనే లేదు కానీ ,  శ్యామలీయం గారి 'ఊరి కొలను' అనే కవిత దీనికి ప్రేరణ ..)

May 24, 2013

చేజారే ! ఆ పై గోదారే !!

కవిత రచన : సాత్విక

ఆమె, బుంగమూతిని పూర్తి స్థాయిలో ఉపయోగించెంత నేర్పరి,
కోరిన కోరిక తీరకపోతే తను అర్ధం చేసుకునే తీరు సరే సరి,  
నా ప్రియురాలి ముద్దు ముచ్చట తీర్చాలనుకున్న ప్రతిసారీ,
అడుగకనే అవరోధాలు సాయం అందిచే నాకు కొసరి కొసరి, 

ఎందుకో ? ఏమో !  వాస్తవాల వలయాన నా చెలి చిరునవ్వు చేజారే,
అందుకేనేమో!  జీవన నడిసముద్రములోన ఎండిపోయే నా గొంతు తడారి,
నా మస్తిష్కాన, ఆమే ఆలోచనలు నిర్మించే గమ్యం లేని రహదారి,
చివుక్కుమన్న నా మనస్సు తలపిస్తోంది గోనె సంచిలోన గోదారి