October 19, 2013

కుడి ఎడమైతే ...

కవిత రచన : సాత్విక

చెడు త్రాసుతో మంచిని తూయకు,
చెడు పంచలోనే చెడుగుడు ఆడకు,
చెడు కాని దానిని మంచి అనుకోకు,
చెడు చేసిన మంచినైనా నమ్ముకోకు,
చెడు నెరుగక మంచినే అమ్ముకోకు 

చెంత లేనిదానిని మంచి అనుకోకు,
చేతకానిదానిని చెడు అని అనకు,
చెరకులో చేదుపాలు లేనే లేదనకు,
కాకరలోని తీపిరుచిని వదిలిపెట్టకు,
'మంచి-చెడు' పోలికతో ఎలుగెత్తకు 

మంచిలో చెడుని కలిపేసి వెతకకు,
మంచి చెడు మార్చి మార్చి పిలవకు,
మంచిని చెడుని వేరుచేసి చూడకు,
మంచి చెడు స్వభావాలకి బలవ్వకు,
మంచి చెడు మనలోనేనని మరువకు 

కంచి కధలన్నీ మంచివిగా నీవు మార్చకు, 
మంచి కధలన్నీ కంచి మార్గమే పట్టించకు,
జల్లెడలో మిగులు కొన్ని నూకలు వంటకు,
కిందకి జారినవి ఉపయోగపడు ఇంకొందుకు, 
మంచి-చెడు సృష్టిధర్మమని కదులు ముందుకు 

2 comments:

  1. "చెంత లేనిదానిని మంచి అనుకోకు,
    చేతకానిదానిని చెడు అని అనకు,"
    ఆలోచించాల్సిన వాఖ్యాలు. ఆచరించవలసిన పోస్ట్ .
    సాగర్ గారూ,

    ReplyDelete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు