December 11, 2014

బ్లా...బ్లా...బ్లా... 3

కవిత రచన : సాత్విక


ఆది-అంతం కలిపేస్తే ఆద్యంతం
అవే విడదీస్తే మిగిలేది అనంతం 

ఎదురు పడితే  వాట్స్ అప్ ?
ప్రక్కకి వెళితే వాట్స్ యాప్ ...
(whats up ?, whats app ) 

లక్ యొక్క లుక్కు లక్షలిచ్చు
లయ తప్పిన లైఫే బిక్క చచ్చు  
(luck, look)

అల్వేస్ ఆలోచించు ఫర్ ఆల్—వేస్
నౌ ఏ డేస్  అవుతాయి నవ్వే డేస్
(always, all ways, now-a-days)

మడతపెట్టి నొక్కి ఉంచితే ఇస్త్రీ
మేలికపెట్టి తొక్కి ఉంచితే అదే నీ-స్త్రీ

డబ్బుండి ముడి పెడితే అది పోనీ టైలు
డబ్బు లేక మడతెడితే ఛీ పో అది నీ టైలు
(pony tail, tail)

డబ్బు లేక నన్ను చూస్తే కలిగే అందరికీ కంపరం
అదోచ్చినాక నన్నడిగే అందరూ "యు కం ఫ్రొం ? " … 
(you come from ?)

నేడు గెలిచి రేపటికై చూస్తే దూరాలోచన
నేడు మరచి రేపటికై చూస్తే దురాలోచన

లైఫ్ లో ప్రతి ఘడియలోనున్నది మ్యాజిక్కు
తరచి చూస్తే తప్పక తెలియును ఈ లాజిక్  
(magic, logic)

నిన్ను నువ్వు నమ్ముకుంటే అది స్వశక్తి
నిన్నే నువ్వు నమ్మకుంటే చెప్పక తప్పదు దేనికైనా స్వస్తి

November 26, 2013

పరవళ్ళు ...

కవిత రచన : సాత్విక 
వాళ్ళు వీళ్ళు,
అంటూ ఇంకెన్నాళ్ళు,
కాలకూటవిష దిగమింగుళ్ళు,
కరువాయెనే ధర్మానికి ఎక్కిళ్ళు,
తప్పకుందాయే న్యాయానికి వేవిళ్ళు,
ఇవేనా?, 'నా నవసమాజపు' పునాదిరాళ్ళు,
' మద్యం మదం కులం ' అనేవే తూనికరాళ్ళు,
ఆలసించక వేయండి చౌకబారు రాజకీయానికి సంకెళ్ళు,
ఎటు చూచినా స్వాతంత్రానికి లోబడిన స్వార్ధపు ఆనవాళ్ళు,
ఓటు అమ్ము(కొను)టే స్వార్ధానికి ఎరవేయబడిన సార్వతంత్ర నకల్లు,
తరచి చూచిన, భరతమాతకైనా తెలుయకున్నది ప్రజాస్వామ్యపు ఆనవాళ్ళు,
మూసపోసిన ఆటవిక రాజకీయ ఆగడాల స్వస్తికై వేయాలి నేటి యువ రక్తం పరవళ్ళు ... 

October 23, 2013

బల (వంతపు) పరీక్ష ..

కవిత రచన : సాత్విక

'నా'  అనే  'నా ఈ మనస్సుకు' లేనే లేదు ఏ ఆకారము
దాన్ని గుర్తించటానికి నాది కాని ఈ 'శరీరమే' శ్రీకారము ..

'పైకపు' పట్టుబిగించి కావాలన్నారు ఆ శరీరపు  సహకారం 
సరదాల పరదాలో కానిచ్చేస్తునారు మనస్సుని కూడా 'అత్యాచారం '

' వృక్షో రక్షతి రక్షితః ' అన్నది అలనాటి అశోకుడి నానుడి 
అందులోని క్రావడి ఎత్తివేసినదే కాదా నా ఈ 'సోకపు అంగడి'

ఏర వేయడానికి చేసినాను, నా శరీరానికి ఈ  కల్పిత అలంకారము
ఎదురీతలో,  'మనస్సులోనే మూగబోయినది నా అసంకల్పిత ప్రతీకారము '

' గుండెలు పిండేసిన బాధ ' నా మనస్సులో దాగున్న మౌనానిది
' అవిసిన గుండెల గాధ ' మౌనమునే ఆశ్రయించిన ఆ మనస్సుది

దేహముని విడువక, నాకు ప్రాణముండి మాత్రము ఏమి ప్రయోజనము ?
నా మనస్సు నన్నే విడచి పరిగెడుతోంది  ప్రతి రోజు నూరుయోజనము

' మౌనము అర్దంగీకారం ' అన్నదే పెద్దలు చెప్పిన ఉపమానమా ?
అర్దాంగి ఆకారమే మౌనముగా రూపు దాల్చినదే  ' ఈ నా జీవితమా '

' స్వర్గాన్నే కోరుతున్నవారు అందరూ ', చవిచూపిస్తున్నారు నాకు నరకము
అవసరాల ఆత్మీయత సాక్ష్యముగా ప్రతి ఆడపడచు చెల్లిస్తోంది ఇదే సుంకము

' మానసిక వ్యబిచారమే నైతిక విలువల నజరానా ', అని వినవస్తోంది నవసమాజమున
తరచి చూడు, సాగిస్తున్నారు ప్రాణమున్న శవాలతో సంసారము అడుగడుగునా 

చిక్కదు  ఏ ఒక్కరికీ  ' దేహాన్ని విడచిన అనంతరం, ఆత్మ యొక్క చిరునామా '
అందుకే   బ్రతికుండగానే   చేసేస్తున్నా నిరంతరం నా  మనస్సుకీ  ' పంచనామా '

October 21, 2013

బ్లా...బ్లా...బ్లా... 2

కవిత రచన : సాత్విక


చేవ కలిగి త్యజిస్తే సన్యాసి
చేవ లేక వదిలేస్తే సన్నాసి  

కోరి తెచ్చుకుంటే ఏకాంతం 
అదే ఆవహిస్తే ఒంటరితనం  

నచ్చినట్టు చెబితే పెద్దరికం 
తోచినట్టు చెప్పబోతే చాదస్తం  

వలపులో చెమట తీయన
అలుపులో ఆదే చెమట ఉప్పన  

ఒక్కసారి ఓడితే అది ఆలస్యం
ప్రతిసారీ ఓడుతుంటే అది అలసత్వం ... 

అసలు నమ్మక అది అనుమానం 
పూర్తిగా నమ్మితే తప్పదు బహుమానం... 

కుదిరితే ఇద్దరికీ అది కెమిస్ట్రీ
కుదరకపోతే ఎందుకన్నది పెద్ద హిస్టరీ ... 

సంపాదించినది దాచుకొనుట 'ఆస్తి' తత్త్వం 
తన సహజత్వాన్ని నిలుపుకొనుటే అస్తిత్వం ... 

చల్లపోసి నిలువ ఉంచితే చద్ది మూట 
చల్లపెట్టేలో ఎట్టి  వేడి చేసుకోనుటే ఫ్యాషనట  

అన్నిటికీ ఆద్యుడు అయ్యాడు గణపతి 
అందుకు ఆయనా వాడాడు శివుడి దగ్గర తన పరపతి ... 

October 19, 2013

కుడి ఎడమైతే ...

కవిత రచన : సాత్విక

చెడు త్రాసుతో మంచిని తూయకు,
చెడు పంచలోనే చెడుగుడు ఆడకు,
చెడు కాని దానిని మంచి అనుకోకు,
చెడు చేసిన మంచినైనా నమ్ముకోకు,
చెడు నెరుగక మంచినే అమ్ముకోకు 

చెంత లేనిదానిని మంచి అనుకోకు,
చేతకానిదానిని చెడు అని అనకు,
చెరకులో చేదుపాలు లేనే లేదనకు,
కాకరలోని తీపిరుచిని వదిలిపెట్టకు,
'మంచి-చెడు' పోలికతో ఎలుగెత్తకు 

మంచిలో చెడుని కలిపేసి వెతకకు,
మంచి చెడు మార్చి మార్చి పిలవకు,
మంచిని చెడుని వేరుచేసి చూడకు,
మంచి చెడు స్వభావాలకి బలవ్వకు,
మంచి చెడు మనలోనేనని మరువకు 

కంచి కధలన్నీ మంచివిగా నీవు మార్చకు, 
మంచి కధలన్నీ కంచి మార్గమే పట్టించకు,
జల్లెడలో మిగులు కొన్ని నూకలు వంటకు,
కిందకి జారినవి ఉపయోగపడు ఇంకొందుకు, 
మంచి-చెడు సృష్టిధర్మమని కదులు ముందుకు