January 29, 2013

బ్రహ్మిగాడి బాగోతం



కధా రచన : సాత్విక


జలజాక్షి (ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్) నిద్రలోంచి ఉలిక్కిపడి అరిచింది    'ఏమండీ' అని ........


అప్పుడే బాస్ గుండెల్లో కత్తి  దించి తను వెద్దామనుకున్న పోలికేక తనకన్నా ముందే తన పెళ్ళాం వేసేసినందుకు హఠాత్తుగా నిద్రలేచిన బ్రహ్మానికీ (మరో సాఫ్ట్ వేర్ ఇంజినీర్) ఒక క్షణం చీకాకు కలిగించినా ఏమిటే ?? ….. అన్నాడు విసుగు బయటకి కనపడనీయకుండా.


పిల్లలకి exam date డిక్లేర్ చేసారండి . పోయిన ఏడాది లాగ వాళ్ళని పాస్ చేయించడానికి మీరు ప్రిన్సిపాల్ యింట్లో యింటెడు చాకిరి చేయడం నేను చూడలేనండి...(తన మీద ఆ మాత్రం సానుబూతి చూపినందుకు నిద్రలోంచి లేపిన విసుగు మాయమయింది మనవాడి ఫెసులో) ఈ సారి ఎలాగయినా మంచి మార్కులతో పాస్ అయ్యే మఱో మార్గమేదైనా బాగా ఆలోచించండి అన్నది జలజ.


లాంగ్ వీకెండ్ ముందు హఠాత్తుగా వూడిపడ్డ ప్రొడక్షన్ bug లాగ అనిపించింది తన పెళ్ళాం మాటలు విన్న బ్రహ్మానికి, ఏం చేద్దామంటావే జలం (పెళ్ళానికి మనోడు పెట్టుకున్న ముద్దు పేరండి బాబు) అని ఒక రాయి విసిరాడు బ్రహ్మం.


"మన సంపాదన తగ్గించైనా , పిల్లల మార్కులు పెంచుదామండి" అంటూనే నిద్రలోకి జారిపోయింది జలజ.


అంటే ఇప్పుడు తను బోర్డు మెంబెర్స్ ని పట్టుకొని లంచం గట్రాల తో పిల్లలకి మార్కులు వేయించాలంటోన్నదా ? లేక question పేపర్ లీక్ చెయించమంటోన్నదా ?  లేకపోతే .....   ఇలా తన పెళ్ళాం ఇచ్చిన statement లోని మల్టీ-dimension లోని అన్ని dimensionsని  పరిశీలించడం మొదలు పెట్టాడు బ్రహ్మం.


ఒక గంట గడచిన తరవాత, "అధిష్టానం మాటలని ఏ ప్రాంత నాయకులు వారికి తగ్గటు అన్వయించుకున్నట్లు" తనకి తానే  సర్ది చెప్పుకొన్నాడు.తన బాస్ ని మర్డర్ చేస్తున్నట్టు వచ్చిన కలను నెమరు వేసుకుంటూ నిద్రాదేవి ఒడిలో ఒరిగిపోయాడు.


అలా సమస్య గురించి ఆలోచిస్తూ నిద్రలోకి  జారుకోవడం వల్ల  'ఒక ఐడియా వచ్చింది' మనోడికి …


'ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది' అని రేడియో లోనుంచి వినిపిస్తున్న మాటలని,  తనకి దేవుడు పంపిన వార్నింగ్ లాగ భావించి బెడ్ మీదనుంచే laptop ఓపెన్ చేసి సీరియస్ గా చూసుకుంటున్నాడు తన insurance బాండ్ పేపర్స్ ని. ఇంతలో కమర్షియల్ సినిమాలో వచ్చే ఐటెం సాంగ్ లాగ   వంట గదిలోనుంచి వినిపిస్తున్న గిన్నెల శబ్దాన్ని తట్టుకోలేక  'అమ్మా కాస్త మెల్లిగా సర్దుకోవే' అని అరిచాడు.


"మీ లాగా డిగ్రీలు చదువుకొలేదుగా మేము, మెల్లిగా గిన్నెలు సర్దటానికి" అని తన తల్లి అన్న మాటలకి ఎలా react అవ్వాలో అర్ధం కాక తనకి అంట్లు గట్టిగా సర్దడం నేర్పించకుండానే డిగ్రీని అంట కట్టిన ఆ యూనివర్సిటీ మీద మానవ హక్కుల సంఘానికి కంప్లైంట్ చేయాలన్న కసి తో దబదబ హాలువైపుగా నడక సాగించాడు బ్రహ్మి. అడుగులు వేస్తున్న బ్రహ్మం మెదడుని ఒక ప్రశ్న తొలచివేసింది -- సంబంధం లేని టీవీ scrolling లాగా!!  అదేంటంటే,  పూజ గదిలోని తన తండ్రిని ఈ శబ్దాలు ఎందుకు బాదించలేదా అని ? తొంగి చూసిన బ్రహ్మికి ప్రవరాన్విత నమస్కారం ( రెండు చేతులతో రెండు చెవులు తమంతట తామే మూసుకొని చేసుకొనే ఓ క్రియ సంధ్యావందనం లో) చేసుకొంటున్న తండ్రిని చూసి ఓ రవంత అసూయ కలిగింది బ్రహ్మి మనసులో తను ఎందుకు ఆ క్రియకి వుపక్రమించాలేదా అని.


ఇంక అసలు విషయానికి వచ్చి తన ఐడియాని తన పెళ్ళాం తో చెప్పబోయిన బ్రహ్మానికి, బై డాడి , బై మమ్మీ అన్న కేకలు  వినిపించాయి. తన ఐడియా కి తనే బలి అవ్వబోయే సాహసం చేయబోతున్న తనకి ఆ  కేకలు జాతర లో మేళం లాగా అనిపించింది. తన insurance అంతా పక్కాగా ఉందనే ధీమాని గొంతులో నింపుకొని "జలం ..  నా దగ్గర ఒక ఐడియా వుంది మన పిల్లల marksని పెంచడానికి" అన్నాడు బేలగా.


ఏమిటన్నట్టు ?  చూసింది జలజ.


ఆ మాత్రం చనువు చాలు మనోడికి ఆడియో ఫంక్షన్ లో యాంకర్ లాగా పేలి పోతాడు.. "జలం  నీ జాబుకి వదలగలవా జలం" అన్నాడు. అయితే మనోడు ఊహించుకున్నంత నెగటివ్ రియాక్షన్ కనిపించలేదు జలం ముఖ కవళికలలో.


2 సెకండ్లు దీర్ఘంగా ఆలోచించి " ఆ పనెదో మీరే చేయొచ్చు కదా (LOP)" అన్నది కూల్ గా  జలజ…...నేను ఆల్రెడీ మెటర్నిటీ లీవ్ పెట్టానుగా. ఇప్పుడు మీరు పెట్టండి అన్నది లాజికల్ గా .... ( మెటర్నిటీ లీవ్  నేను పెట్టనంటుంటే , మీరే నా చేత బలవంతంగా పెట్టించారన్నట్లు -- పైపెచ్చు వాళ్ళావిడ తింగరి తనాన్ని లాజికల్ అనటంలో ఆంతర్యం ఏమిటంటే "దాని తింగరి తనాన్ని నువ్వు కప్పెట్టు -- లేకపోతే అది నీ కొంపకి నిప్పెడతాది" అని మనోడ్డిచ్చిన పావలా చనువుని రుపాయీ పావలా వాడేసే బావమరిది కాసి యాత్రలో తన చెవిలో చెప్పిన గుసగుసలవి)...


ఇంక ఎక్కువ మాట్లాడి మెడికల్ insurance ఉపయోగించే పరిస్తితి ఎందుకని situation నుంచి escape అవ్వడానికి

అన్నట్టు తెచ్చి పెట్టుకున్న ప్రేమని నవ్వు తో జోడించి "జలజ తూ ఆఫీసు కో జా జా " అన్నాడు  బ్రహ్మం/బ్రహ్మి. 'జలజ తూ ఆఫీసు' అన్న పదం ok కాని ఆ తరవాత వాడిన పదాలలోని ఆంతర్యంకై వెతుకుతూ బాత్రూం వైపు పరుగులు తీసింది టైం చూస్తూ. హిందీని ఉపయోగిస్తున్నట్టు నటిస్తూ బ్రహ్మం తనని తిడుతున్నాడా అన్న అనుమానం కలిగింది జలజకి.

బ్రహ్మి మనస్తాపాన్ని పసిగట్టిన వాళ్ళ అమ్మ "ఒరేయ్ బ్రహ్మం, నీ చిన్నప్పుడు నీకు కూడా గవర్నమెంటు కుళాయి లో నీళ్ళు వచినట్టు మార్కులు తక్కువ వస్తుంటే, మన శివాలయం పూజారి ఇచ్చిన తాయత్తు కట్టానురా . అంతే ఇక చూస్కో ఆ తరవాత పరీక్షల్లో జపాన్ కి సునామి వచ్చినట్టు వచ్చాయి రా నీకు మార్కులు" ఏమంటావు అని శాస్త్రాన్ని సైన్స్ తో మిక్స్ చేసినట్టు, తన అనుభవానికి పేపర్ చదివిన knowledgeని mix చేసిన అమ్మ మాటల ప్రవాహం పూర్తి కాక ముందే..


అదేదో సినిమాలో చెప్పినట్టు (రివర్సులో) బ్రహ్మం చెవులు పని చేయడం ఆగిపోయాయి , కళ్ళు మాత్రమే పని చేస్తున్నాయి… black & వైట్ లాగా కనపడడం మొదలయింది …. పాత జ్ఞాపకాలు, సమాధి లోనుంచి బయటపడ్డ ప్రేతాత్మలాగా కళ్ళ ముందు కదలాడాయి ...  తాయత్తు తాయత్తు  .... మాటలు తడబడుతున్నాయి ( తను ఎప్పటికి మర్చి పోలేడు,  ఆ  నల్లటి జిగురు పదార్థాన్ని ఒక సత్తు రేకులో వుంచి చుట్టూ సైకిల్ గేరులాగా పొడుచుకొచ్చిన  ఆ spikes) అతనకి తెలియకుండానే అతని చేతులు మొలతాడుని తడుముతున్నాయి ఆ తాయత్తు కోసం .... రాత్రి పూట ఆ తాయత్తు గుచ్చుకొని నిద్ర లేకుండాగడిపిన రాత్రులు, తాయత్తు తీయకుండా వుండేందుకు అమ్మ చెప్పిన ఆ అరుంధతి స్టోరీలు ...లీలగా కంట్లో తడి ....  నిద్ర లేని కారణంగా తను పుస్తకాలు ముందేసుకుని కూర్చున్న క్షణాలు…  వెరసి అమ్మ చెప్పిన ఆ సునామి మార్కులు ...... "నేను నరకం చూసిన క్షణమదే... మా అమ్మ గుళ్ళో

పూజారిగారి కూతురు జలజతో నా వివాహం నిశ్చయించిన క్షణమూ అదే" .....trans లో నుంచి బయటపడడానికి బ్రహ్మి నోరు యాధాలాపంగా నో నో అని అరిచింది, తల పక్కకి వాలింది.

సంధ్యావందనం కూడా మధ్యలో ఆపి, అక్కడ నుంచి బయటకు రాకుండా , అక్కడే ఉండి  సైలెన్స్ పాటిస్తూ సైగలతో తనకి సలహా ఇవ్వాలని ప్రయత్నిస్తున్న తన తండ్రిని దిగాలుగా చూస్తూ ఆఫీసుకి బయల్దేరాడు బ్రహ్మం.


"ఆఫీసు కి చేరాడు బ్రహ్మి --ఇంతలో ఫోన్ చేసింది వాళ వైఫ్ మమ్మీ"  (అదేనండి మనోడి అత్తగారు)…

అర్జెంటు గా ఫ్రంట్ డెస్క్ రిసెప్షనిస్ట్ దగ్గర నూరు గ్రాముల వినయాన్ని అరువు తీసుకొని "హలో ఆంటీ బాగున్నారా ? " అని గబా గబా అనేసి  ear-phones ని చెవి కి తగిలించుకొని ఫోన్ పక్కన పెట్టేసి రిలాక్స్ అయిపోతున్నాడు మనోడు….(అదేమిటోగాని అత్తగారు ఫోన్ చేసినప్పుడల్లా మనోడికి ఇదో ఫెసిలిటీ ఎందుకంటే ఆమె తను చెప్పేది చెబుతుంది కాని మనోడి దగ్గర నుంచి ఏదీ వినాలనుకోదు, పాపం ఏమి ఆశించదు) రక్త చరిత్ర సినిమాలో వర్మ వాయిస్ ఓవర్ లాగా మనోడికి ఫోనులో స్టార్ట్ అయింది …

"అల్లుడు గారు అమ్మాయి చెప్పింది మీకు వచ్చిన ఈ సమస్యని, నేను ఎప్పటినుంచో చెబుతూనే వున్నాను . పిల్లల జాతకం చూపించినంత మాత్రాన సరిపోదు కాస్త వాళ్లకి చదువు చెప్పే టీచర్ల జాతకాలు కూడా చూపించాలని, నా మాట ఎవరూ లెక్క చేయలేదు. ఇప్పటికయినా మించి పోయింది ఏమీ లేదు , వెంటనే మీరు సెలవు పెట్టి స్కూల్ కి వెళ్లి మన పిల్లలకి చదువు చెప్పే టీచర్ల వివరాలు , వెంటనే నాకు SMS చేయండి  మిగతా కధంతా నేను నడిపిస్తాగా అన్నది".


ఈ సారి నిజంగానే వణికి పోయాడు బ్రహ్మం  వాళ్ళ ఆంటీ ఐడియా కి . అంతే మళ్ళి trans లోకి వెళ్ళాడు…(రాష్ట్రపతి ఫారన్ టూర్ కి వెళ్ళినంత ఈజీగా  వెళతాడు మనోడు trans..లోకి) క్లైమాక్స్ లో పోలీస్ లొచ్చినట్టు బ్రహ్మానికి చలి జ్వరం వచ్చింది,  స్నేహితుల సాయంతో ఇల్లు చేరాడు.  జాతకం అన్న మాట  బ్రహ్మం గుండె లోతుల్లో పర్మనెంట్ గా వుండిపోవడంతో   బ్రహ్మానికి "జాతకం" అనే మాటని "బియాండు బర్త్ --బిఫోర్ డెత్" .. "బియాండు బర్త్ --బిఫోర్ డెత్" అంటూ కలవరించసాగాడు చలి జ్వరం ప్రభావంతో.


మొగుడు జ్వరం బాధ కన్నా కలవరింత లోని రైమింగ్ ని, జాతకం అనేదానికి ఇంగ్లీష్  లో బ్రహ్మి ఇచ్చిన కొటేషన్ని ఎక్కువగా ఎంజాయ్ చేసింది జలజ.

       
            *       *       *

"తెల్లరిందోయి సుబ్బులు మామ" అనే సాంగ్ రేడియో లో నుంచి ఆకాశవాణి పిలిచినట్టు గా అనిపించి నిద్రలో నుంచి లేచి కూర్చున్నాడు బ్రహ్మం. టైం 7 AM మాత్రమే అయింది. "నిన్నటి విషయంతో మనసులో అలజడి , ఇంట్లో వినపడలేదు పిల్లల అలికిడి" . క్యాట్ వాక్ చేస్తూ బెడ్ రూమ్ లోకి వచ్చిన జలజ ని ధైర్యం చేసి అడిగాడు పిల్లలు లు లు  ??? లాగుతున్నాడు  బ్రహ్మం....(ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయినా ఇంకా పిల్లలు అని లాగుతున్న బ్రహ్మాన్ని ) ఒక మొట్టికాయ మొట్టి  "వాళ్ళని మంచి tution లో చేర్పించాను" అని తన మల్టీ-డైమెన్షనల్ స్టేట్ మెంట్ లోని అసలు dimension ని డీకోడ్ చేసింది జలజ ఒక వాలు చూపు విసురుతూ...


ప్రాబ్లెం సాల్వ్ అయింది అన్న ఉత్సాహమో లేక స్వతహాగా ఉన్న కవి రసికతతొనో  బ్రహ్మం, "జలం వూరించకే  అలా లాలాజలం " అంటూ .......అరవ ఏక్షన్ సినిమాలో 'ఈ భూగొళ్ళాన్ని రక్షించిన' ఒక ము/మొద్దు మనిషిని (అదేనండి, వాళ్ళు హీరో అని కూడా అంటారు) అబినంధించే ఒక సగటు ప్రేక్షకుడి లాగ అభినందించాడు పెళ్ళాం తెలివితేటలకి అబ్బుర పడుతూ.


సినిమాలో చూపిన విషయాలకి చివరకి డైరెక్టర్ కోట్ కి  సంబందం లేనట్టుగా ఈ బ్రహ్మి ఎపిసోడ్ కంప్లీట్ చేయడానికి వాళ్ళ నాన్నగారు కోట్ చేసారిలా "ఇష్టపడి కన్నా ,పిల్లల్ని కష్టపడి పెంచేవాళ్ళు కొందరైతే , కష్టపడి కన్నా, పిల్లల్ని యిష్టపడి పెంచేవాళ్ళు మరి కొందరు"


(మీనింగ్ అడగకండి.బాగుంది అని రైమింగ్ వదిలారు, అయినా మన బ్రహ్మిగాడి రైమింగ్ మాటలకి ఈయన  భావుకతే  బేసు మఱి)


             *      *       *

5 comments:

  1. To be frank, though it is unintentional, I felt most of the incidents and satires are triggered on our family members!! It's really funny.. I enjoyed the story.Very good start!!

    ReplyDelete
    Replies
    1. Disclaimer: resemblance is merely accidental

      ;-)

      Thanks Vidya !!

      Delete
  2. మీ Blogకి కొన్ని రోజులక్రితమే పరిచయమయ్యాను.సరదగా బాగుంది మీ టపా.మీ రచనాశైలి చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. మీ ప్రోత్సాహానికి ధన్యవాదములండి...
      నేను కూడా ఈ మధ్యే మొదలెట్టాను...సరదాగా..

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు