కధా రచన : సాత్విక
## సత్తిబాబు (కుర్రోడి అసలు పేరు) వాళ్ళ పక్కింట్లో నత్తిపాప (ముద్దు పేరు ) ##
సత్తిబాబు మరియు వాళ్ళ పక్కింటి నత్తిపాప చూడటానికి అచ్చం 'షార్ట్ ఫిలిం' హీరో, హీరోయిన్ లాగ వుండే వీరిద్దరూ ప్రేమించుకున్నారు (నిన్నటి దాక) , ప్రేమించుకుంటున్నారు (నేడు), ప్రేమించుకోవచ్చు (రేపు కూడా)...
అయితే వాస్తవంలోకి వస్తే, మనోడి పేరుని సటైర్ల సత్తి బాబుగా గుర్తించారు అన్న దానితో క్యారెక్టర్ ఓపెన్ చేస్తే -
సత్తి బాబు ఒక నిరుద్యోగి, క్రియేటివ్ గా ఏదో చెయ్యాలనుకొని ఏమి చెయ్యలేక చివరకి సటైర్ల్ల సత్తిబాబు గా మిగిలిపోయాడు.
అంతే కాదండోయ్ "వాడా --పోడా అనే తమిళ తంబీలాగ -- సత్తిబాబు కొంచం తేడా".
"బ్లడ్ డొనేషన్ అయినా 100% చెయ్యాలి" అనుకునేంత సిన్సియరిటి సత్తిబాబుకున్న పంతం,
"మాస్ సినిమాకి -క్లాసు టికెట్టు వేస్ట్" అనుకునేంత కామన్ సెన్స్ నత్తిపాప సోంతం.
తొందరగా తన క్రియేటివిటీ ని ఋజువు చేసుకొని భవిష్యత్తులో బోలెడు డబ్బులు రాబట్టాలనే అజెండా తో ప్రస్తుతానికి పోగోడుతున్నాడు మన సత్తిబాబు, 100% లవ్ అని ఫీల్ అయి సహకరిస్తుంటుంది నత్తిపాప.
"తనకి ఉద్యోగం వచ్చేవరకు రోజు నత్తిపాప ఇంటి కొచ్చే డైలీ పేపర్ వీడి ఇంట్లోనే వేయించాలి అని కండిషన్ పెట్టి మరీ 'అన్-కండిషనల్' గా లవ్ చేస్తున్నాడు నత్తిపాపని. సత్తిబాబు పేపర్ చదివేసిన తరవాత వెంటనే తిరిగి మనింటికి పేపర్ పట్టుకురా అని నత్తిపాపకి
"వాళ్ళ డాడి రిక్వెస్ట్ --అందుకే ఉదయాన్నే ఆ పాప మనోడికి చీఫ్ గెస్ట్".
డైలీ పేపర్లో సత్తిబాబు క్లాసిఫైడ్స్ కాలమ్ లో బిజీ అయితే, నత్తి పాప ఫలహారాలు, వార ఫలాలలో గజి బిజీ.
"రండి -- 30 నిమిషాలలో రైటర్ కండి " అన్న జేఫ్ఫా కోచింగ్ సెంటర్ ప్రకటన దగ్గర లాక్ అయ్యాడు సత్తిబాబు,
"ఈ రోజు మీరు ఒక గండం నుంచి బయటపడతారు " అన్న రాశిఫలం చూసి షాక్ అయింది నత్తిపాప.
మనోడు ఎంతగా లాక్ అయ్యాడు అంటే, ఆ జేఫ్ఫా కోచింగ్ సెంటర్ లో నుండి బయటకు వచ్చిన మొట్టమొదటి జేఫ్ఫా రైటర్ తనే కావాలి ! అన్నంత.
సటైర్ల సత్తిబాబు కాస్త 'రైటర్ సత్తిబాబు'గా మారాలి అని హడావిడిగా ఫిక్స్ అయ్యి తాపీగా రెడీ అవ్వడం మొదలెట్టాడు. 'వేర్ ఎవర్' సత్తిబాబు గోస్, నత్తి పాప ఫాలోస్ ….. (కాదంటే చ. చచ్.. చచ్... చంపేస్తుంది)
సత్తి బాబు ల్యాండ్ అయ్యాడు జేఫ్ఫా కోచింగ్ సెంటర్ వున్న ఏరియా లోకి . "జంతర్ మంతర్ దగ్గర నిరసనకి పోగయిన జనం"లాగ ఉంది జన సమూహం. అందరూ 2013 slots ఖాళీలు లేక 2014 లో తమ 30 నిమిషాల సెషన్ ని (అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు) బుక్ చేసుకోవడానికి పోగయిన జనమని తెలుసుకొని నీరస పడిపోయాడు మన సత్తిబాబు.
ఇంతలో 30 అడుగుల దూరంలో ఒకతను అరుస్తున్నాడిలా
" కోక....కోకాకోల కోలాహలం
నాకిష్టమయింది హలీమ్,
మా బాబాయి పేరు సలీం "
అరిచినతని బెస్ట్ ఫ్రెండ్ చెబుతున్నాడు, ఆ కవిత్వం చెప్పినతను జేఫ్ఫా కోచింగ్ సెంటర్ లో ఒక నిమిషం సెషన్ ఇప్పుడే కంప్లీట్ చేసాడని, అతనికి రోజుకు ఒక్క నిమిషం స్లాట్ దొరికిందని.
ఇంతలో మరొకతను అరుస్తున్నాడిలా..
"ఓ కాంత, నే పెట్టా గిలిగింత, దూరం చేస్తా నీ కలవరింత, నీకు కలిగిస్తా పులకరింత,
నువ్వుండాలేప్పుడూ నా చెంత , మనకుంది సమయం బోలెడంత"
ఈ సారి ఏ బెస్ట్ ఫ్రెండ్ వివరణ అవసరం లేకుండానే ఆ అరిచినతను కనీసం 4 నిమిషాలు సెషన్ అటెండ్ అయ్యుంటాడని అని గ్రహించేశాడు సత్తిబాబు. ఎవరూ చెప్పకుండానే విషయాన్నీ గ్రహించేసిన సత్తిబాబు ని గొప్పగా చూసింది నత్తిపాప. ఆ పైన ఇద్దరి కవిత్వాన్ని వారిని అందరూ గొప్పగా చూసే చూపులు సత్తిబాబు లో "రైటర్ గానే రిటైర్" అవ్వాలన్నంత పట్టుదలని కసిని పెంచేసాయి..
ఈ రోజు సెషన్ టైం ఎలా సంపాదించాలా అని సత్తిబాబు మధన పడుతున్న సమయంలో,
సడన్ గా నత్తిపాప తన ఫ్రెండ్ మామయ్య (p.k. పాల్ గారి ) ద్వారా మొత్తానికి 30 నిమిషాలకి ఎటువంటి బ్రేక్ లేకుండా సెషన్ టైం బుక్ చేయించింది.
ఆ క్షణంలోనే డిసైడ్ అయ్యాడు సత్తిబాబు, 'నత్తిపాపకి కట్నంలో తప్పక డిస్కౌంట్ ఇవ్వాలని'....
*** సత్తిబాబు సెషన్ స్టార్ట్ ***
## 'జారిపడిన చారీ' -- జేఫ్ఫా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ . 'నాకు నారాయణ' -- జేఫ్ఫా కోచింగ్ సెంటర్ ప్యూన్. 'పాపారావు' -- చారీకి మేనేజర్ ##
(అందరినీ పూర్తీ పేరుతొ పిలవడం డైరెక్టర్ చారీ బలహీనత )
క్లాసు రూం లాంటి గదిలోకి ఎంటర్ అయిన సత్తిబాబు రైటర్స్ చైర్ అని రాసి వున్న చైర్ ని వెతికి మరీ కూర్చున్నాడు చాలా కూల్ గా, relaxed గా. ఆ 'గది' కాస్త 'ఇది' గా (ఇది అంటే దేవాలయం) కనిపించింది సత్తిబాబు కి. నత్తిపాప తనకి రాబోయే గండం ఎప్పుడొస్తుందో అన్న దిగులు, సత్తిబాబు ఎప్పుడు ? ఎలా ? రైటర్ గా మారబోతున్నాడో అన్న ఆసక్తిని కలగలిపి గడుపుతున్న క్షణాలవి ...
ఇంతలో సెషన్ స్టార్ట్ అన్నట్టు లైట్స్ ఆగి , 10 సెకండ్స్ లో మళ్ళీ వెలిగాయి ( ఆ 10 సెకండ్స్ లో). ఎదురుగా కుర్చీలో డైరెక్టర్ 'జారిపడిన చారీ' కుర్చీలో కూర్చొని వున్నారు .
"కవిత్వంతో మొదలెట్టి , కైలాసానికి తీసుకెళ్ళి , కాకరకాయ లోకి దింపి , కైమా కొట్టించి , నీ చేత కహాని రాయిస్తాను " హు హ హు హ హ .....అని అనర్గళంగా మొదలెట్టాడు చారీ.
"ఒకే ఒక్క వాక్యంలో 'క' గుణింతము పై మీరు చూపించిన వివక్ష ( వేరియేషన్స్ అని మనోడి భావం ) ఈ ప్రపంచంలో మరే జాతి మీద ఇంతవరకు ఇంతటి వివక్ష జరిగి ఉండదని నేను షర్టు చించుకొని మరీ చెప్పగలను" అన్నాడు సత్తిబాబు అంతే ఆవేశంగా.
అంతలోనే ఒక్క క్షణం తేరుకున్న సత్తిబాబు , తన చేత "వివక్ష" లాంటి పదాలు పలికించిన శక్తీ మరేదో కాదు, అంతా చారీ గారి ఆశీర్వాదం అని గ్రహించినట్టు చూశాడు నత్తి పాప వంక, అవును అన్నట్టు కన్ఫర్మ్ చేసింది నత్తి పాప. సత్తిబాబులో కాన్ఫిడెన్సు పెరిగి, తను ఇంకొక 27 నిమిషాలలో రైటర్ కాక తప్పదు అని ఫిక్స్ అయిపోయాడు . ఈ సంఘటన సత్తిబాబు లో కాన్ఫిడెన్సు ని నింపితే, నత్తిపాప మటుకు కహాని రాయిస్తాడా ? 'క' కి 'హాని' చేస్తాడా అన్న కలవరంతో చూస్తుండ్డి పోయింది.
వీరిద్దరి మూగ సంభాషణ గ్రహించిన చారీ ఒకింత ఉత్సాహంతో 'సో (ది) నేను చెబుతాను , నువ్వు నోట్స్ రాసుకో , రిఫరెన్స్ కి పనికొస్తుంది ' అంటూనే తన చేతిలోని పెన్ను సత్తిబాబు మీదకి విసిరేశాడు చారీ . ఆ నిమిషం ఎందుకో కాఫీ తాగాలని అనిపించింది చారీకి, వెంటనే తన రివోల్వింగ్ చైర్ ఒకింత పక్కకు తిప్పి 'నాకు నారాయణ' అన్నాడు పెద్దగా.
ప్యూన్ పేరు 'నాకు నారాయణ' అన్న విషయం తెలియదు సత్తిబాబుకి . "చారీ తన పేరుని 'నారాయణ' అని పొరబడ్డా డెమోనని తనకిచ్చిన పెన్నుని ఎందుకు నాకాలో అర్ధం కాక అలా చూస్తుండి పోయాడు సత్తిబాబు.
ఒక్క 20 సెకండ్ల వ్యవధిలో చారి మళ్ళి పిలిచాడిలా, అహా అరిచాడిలా 'నాకు నారాయణా..ణా..ణా ' అని
ఇంక లాభం లేదు గురువుగారు తనకిచ్చిన పెన్నుని నాకమంటున్నారు అని కన్ఫర్మ్ చేసినట్టు అనిపించి, ఆ కార్యక్రమానికి ఉపక్రమించాడు సత్తిబాబు. కాని అంతలోనే ఒక 20 ఏళ్ళ కుర్రాడు పరుగు పరుగునా వచ్చి " పిలిచారా సారూ " అన్నాడు .
వెంటనే అలర్ట్ అయిన సత్తిబాబు తను చేపట్టిన బృహత్తర (నాకుడు) కార్యక్రమానికి స్వస్తి చెప్పి బతుకు జీవుడా అని కవర్ చేసుకున్నాడు ' పెన్నుని తను దగ్గర నుంచి పరీక్షిస్తున్నట్టుగా'.
"ఏమండి కరణంగారు గొతిలో పడ్డారా? అంటే , లేదు లే కసరత్తు చేస్తున్నా అన్నాడట" అన్నట్టున్న సత్తిబాబు పరిస్టితికి నవ్వాలో సానుభూతి చూపాలో అర్ధం కాక గమ్మున ఉండిపోయింది నత్తిపాప.
'కాఫీ పట్టుకురా! నాకు నారాయణ " అన్నాడు చారీ (అందరికి కాఫీ అనేది చారీ ఉద్దేశ్యం).
(ఆ కుర్రాడు గదిలోనుంచి బయటపడ్డాడు, కాఫీ తేవడానికి…)
** సత్తిబాబు రైటర్ గా మారే ప్రక్రియ లో పది నిమిషాలు గడిచిపొయినాయి **
థియరీ మళ్లీ స్టార్ట్ చేశాడు చారీ. చూడు సత్తిబాబు మనం రాసేది పాఠకులు చదవరయ్యా, వాళ్ళు చదివేవే మనం రాయగలగాలి అన్నాడు చారి. బై గాడ్స్ గ్రేస్ పెద్దగా కష్టపడకుండానే క్వశ్చన్ మార్క్ ఫేస్ ని ఈజీ గా పెట్టగల సత్తిబాబు, అదే పని చేశాడు . డెమో యివ్వాల్సిన అవసరాన్ని గ్రహించిన చారి, వెంటనే యిలా అన్నాడు "సత్తి బాబు నీకు గుర్తున్న, బాగా పాపులర్ అయిన లేటెస్ట్ సినిమా డైలాగు ఒకటి చెప్పు".
(మనస్సులో అన్ని సినిమాల డైలాగులు vibrations గా మొదలై, అవి మెదడుని confusion కి గురి చేసి, మది లో ఒక్క డైలాగుగా conclude అయి నోట్లోనుంచి బయటకు రావడానికి పట్టిన సమయం సరిగ్గా 31 సెకండ్లు (అర్ధం అయిందా సత్తిబాబు ఎంత ఆతృతతో ఉన్నాడో రైటర్ గా మారడానికి)).
సరిగ్గా 31 సెకండ్లు వ్యవధిలో సత్తిబాబు ఆవేశంగా , టెంపో ఏ మాత్రం మిస్ కాకుండా తనకి బాగా గుర్తున్న డైలాగు చెప్పాడిలా "యుద్ధం చేతకాని వాడు మాత్రమే ధర్మం గురించి మాట్లాడుతాడు సార్ ".
ఇంతే పవర్ ఫుల్ డైలాగు ని మనం కూడా రాద్దామా ? అన్నాడు చారి, వూరిస్తున్నట్టు. నిజంగానా !! ? అన్నట్టు చూశాడు సత్తిబాబు.
నువ్వు చెప్పిన సినిమా డైలాగు లో నిజం లేదు , మనం నిజం చెబితే పోలా ? అన్నాడు చారి.
ఎలా ? అన్నట్టు చూసాడు సత్తిబాబు.
"ధర్మం తెలిసినవాడు చేసేదాన్నే యుద్ధం అంటారు మిస్..స్..స్..టర్" పెద్దగా అరిచేసాడు చారీ భగవద్గిత ని చూస్తూ (టెంపో మిస్ కాకుండా చారీ తిరగరాసిన డైలాగు ఇది ). అయితే అది చారీ తనని తిట్టాడో డైలాగు రాసాడో అర్ధం కాలేదు సత్తిబాబుకి..
భగవద్గిత ని చూస్తూ చెప్పడం వల్లనో లేక టెంపో మిస్ కాలేదన్న ఫీలింగ్ వల్లనో సత్తిబాబు కన్విన్సు అయ్యాడు చారి ఇచ్చిన రివర్స్ డైలాగుకి, ఎక్ష్ప్లనేషన్ కి . అందుకే అంతర్గతంగా మనోడి లో భక్తి కూడా మొదలయింది చారి మీద.
(ఇదే అదనుగా ఇంకో శాంపిల్ కూడా చూపాలి అనుకున్నాడు చారి, వెంటనే ఎదురుగా వున్న బుక్ షెల్ఫ్ లోనుంచి చేతికి అందుబాటులో ఉన్న పుస్తకాన్ని అందుకోమన్నాడు నత్తిపాపని)
'మేడ్ ఫర్ ఈచ్ అథర్'లాగా సత్తిబాబు శ్రద్దా ,భక్తీకి తగ్గట్టే నత్తిపాప అందుకున్న పుస్తకం కూడా "సూక్తి రత్నావళి ".
గాలివాటంగా ఒక పేజీని ఓపెన్ చేశాడు చారి. "వ్యక్తి కి బహువచనం శక్తి -- అన్నారు శ్రీశ్రీ", "శక్తికి ఏకవచనం వ్యక్తి" అని శ్రీశ్రీ సూక్తికి ప్రతిసూక్తి ని వదిలాడు చారీ.
అంతే "రిజర్వు బ్యాంకు తాళం దొరికిన దొంగ లాగా" ఒక్క ఉదాహరణ తో నే ఫార్ములాని వంటబట్టించుకున్న సత్తిబాబు, చెంగున దూకి చారీ చేతిలోని పుస్తకాన్ని దొరక పుచ్చుకొని ఇంకో పేజీని తిరగేసాడు.
"వందమంది చేయలేని పనిని , ఒక హేళన చేస్తుంది -- శ్రీశ్రీ" అని వుంది అక్కడ .
"ఒక్క హేళన చేసే పని నూటొక్క మంది చేయగలరు -- అని శ్రీశ్రీ సూక్తిని తిరగ రాసాడు సత్తిబాబు .
శిష్యుడి ప్రతిభ కి పొంగిన చారీ ఆనందంతో చప్పట్లు కొట్టాడు. చారీ చప్పట్లకి పొంగిపోయిన సత్తిబాబు ఆనంద అశ్రువులతో "మీరిక 'సూక్తి రత్నావళి' మర్చిపోండి" నేను తిరగ రాసి పారేస్తాను అంటూ ట్రాన్స్ లో (సత్తిబాబు-సన్మాన సభ దాకా) వెళ్ళాడు సత్తిబాబు.
(మనలో మాట ఎక్కడా లీక్ చేయద్దు -- సత్తిబాబు తన సూక్తుల పుస్తకాన్ని ప్రచురించి అది చారీ కి గురు దక్షిణ ఇవ్వాలని కూడా మనస్సులో ప్లాన్ చేస్తున్నాడు).
రైటర్ కుండవలసిన ప్రాధమిక సూత్రము రివర్స్ స్త్రాటజి గా నోట్ చేసుకున్నాడు సత్తిబాబు .
** సత్తిబాబు రైటర్ గా మారే ప్రక్రియ లో ఇరవయి నిమిషాలు గడిచిపొయినాయి **
(ఇంతలో కుర్రాడు ఒకే ఒక్క కప్పు కాఫీ తీసుకొని వచ్చాడు గదిలోకి )
ఒకే ఒక కప్పు చూడగానే తక్కినవారికి తీసుకరానందుకు 'చారీ, అయాడు కూసింత వర్రీ' .
కాఫీ ఏది 'నాకు నారాయణ' అన్నాడు కోపాన్ని అణచుకొంటూనే.
(బయటకు పరిగెడుతున్న స్టైల్ లో నడుస్తూ "అది మీకే సారూ" అంటూ వెళ్ళిపోయాడు 'నాకు నారాయణ ')
ఇంక "నాకు నారాయణ"ని భరించడం తన వల్ల కాదని 'పని లోనుంచి తీసేయమని' చెప్పటానికి డిసైడ్ అయిన చారీ, తన మేనేజర్ ని పిలవడానికి అరుస్తున్నడిలా 'పాపారావూ, పాపారావూ ' అంటూ..
ఇంతలో ఊహలలో (సత్తిబాబు-సన్మాన సభ అనే ట్రాన్స్ లో) నుంచి బయటపడ్డ సత్తిబాబు, 'చారీ' అరుస్తున్న 'పాపారావూ' అనే అరుపులని అపార్ధం చేసుకొని (ప్రస్తుత సమాజ పరిస్తితుల దృష్ట్యా) "పాప రాదు, ఈ పాప అలాంటిది కాదు" అని నత్తిపాపని గట్టిగా పట్టుకొని అరవడం మొదలెట్టాడు సత్తిబాబు.
(ఈ గందరగోళం తో బిత్తర పోయిన చారీ ఇంక మళ్లీ జీవితంలో ఎవరిని పూర్తిపేరు పెట్టి పిలవకుండా అర్ధవంతంగా ప్యూన్ ని 'నారాయణ' అని , మేనేజర్ ని 'mr.రావు'అని పిలవాలని నిర్ణయించుకొన్నాడు)
"బతుకు జీవుడా అని, మళ్లీ థియరీ స్టార్ట్ చేశాడు చారి "ద్వితీయ సూత్రాన్ని "అనువాదం " అని కూడా అంటారు అంటూ మొదలెట్టాడు చారి.
మొదటి ఫార్ములా ని (డైలాగు తిరగ రాసుడు ) ఈజీ గా గ్రహించడం వల్ల పెరిగిన కాన్ఫిడెన్సు మూలంగా, చారీ దగ్గర పెరిగిన చనువు వల్ల , గురువుగారికి ఒక ప్రశ్నని సంధించాలి అనుకున్నాడు సత్తిబాబు .
"ఆటో బయోగ్రఫి " అన్న పుస్తకాన్ని అనువాదం చేస్తే "ఆత్మఘోష " అని అనువదించాలా ? అన్న సత్తిబాబు విలువయిన ప్రశ్నకి "ఆత్మమాయాగ్రఫి" అని పెట్టమని తెలివైన సమాధానం ఇచ్చాడు, చారి.
"ఆత్మమాయాగ్రఫి" అనే కొత్త పద ప్రయోగం సత్తిబాబు కి చారీ మీద వున్నా కాన్ఫిడెన్సు ని మరొక మెట్టు ఎక్కించి అది కాస్తా పిచ్చిగా మారింది. దాంతో సత్తిబాబు ఇలా అరవడం మొదలెట్టాడు..
'సింపుల్ naturality'కి, 'complex నేటివిటీ'ని మిక్స్ చేసిన
మీ 'క్రియేటివిటీ 'తో మన తెలుగు మమ్మీ ని మీరు 'నాట్ జియో సిటీ ' దాక తప్పక తీసుకెళతారు అంటూ సంబంధం లేకుండా మాట్లాడుతూ, నాట్యం చేసాడు. నాట్యం చేస్తూ చేస్తూ చివరిలో "ఒరేయ్ చారీ , నే చేస్తా నీ జ్ఞాన చోరీ " అని అరుస్తూ మూర్చబోయాడు సత్తిబాబు.
(తెలుగు మమ్మీ అంటే 'తెలుగు తల్లి' అని అని మనోడి ఏడుపు , 'నాట్ జియో సిటీ' -- అంటే నేషనల్ జేఒగ్రఫిక్ ఛానల్ అని (పశు పక్ష్యాదులు కూడా తెలుగు మాట్లాడుకొనే రేంజ్ అని మనోడి రచ్చ .. ))
సత్తిబాబుకి మతి భ్రమించినదా అన్న సందేహము ఎక్కువ అయింది చారికి. ఇంకా రెండు మూడు సూత్రాలు బోదిన్చావలసి ఉండగానే , సత్తిబాబు ని చూస్తూ "వీడికేందుకీ ముసురు ,నాకు వస్తుందా అసలుకే ఎసరు " అనుకుంటూ ఇంతటితో స్వస్తి పలక దలచాడు చారి.
'మూర్చ'పోవడమే రచయిత గా మారే పరిణామ క్రమంలో ఆఖరి అంఖముగా పేర్కొని సత్తిబాబు ని తన వారసుడిగా 'రైటర్ సత్తిబాబు'గా డిక్లేర్ చేసేశాడు.
సత్తిబాబు కి ఒక 30 సెకండ్ల లో మెలకువ వచ్చింది. లేస్తూనే "బిన్ లాడెన్ కి , మా హాస్టల్ వార్డెన్ కి , నాకూ వున్నది ఒక్కటే " అని అరిచాడు పెద్దగా సత్తిబాబు.
ఏ ఏ ఏ ఏంటది ? అన్నది నత్తి పాప కంగారుగా (గుండె ఆగింది నత్తి పాపకి ).
"సమయం" అని సమాధానమిచ్చాడు సత్తిబాబు . 'సమయం వాడుకున్నోడికి వాడుకున్నంతా' అని వికారంగా నవ్వుకుంటూ జన సందోహంలోకి దూసుకుపోయాడు రైటర్ సత్తిబాబు.
సత్తిబాబు సమాధానానికి నత్తిపాప మళ్ళి ఊపిరి పీల్చడం మొదలెట్టింది (నత్తిపాపకి గండం గడిచింది ).
ఏమయితేనేమి చారి అందించిన జ్ఞాన వెలుగుతో మన సటైర్ల సత్తిబాబు --> రైటర్ సత్తిబాబు గా మారాడోచ్ చ్ చ్….. (ముప్పయి నిమిషాలు పూర్తవుతుండగా ).
* స * మా * ప్తం *
సత్తిబాబు నత్తిపాప |

nice try interesting way of intrepreting the characters
ReplyDeleteThanks Hrudaya for reading(bearing) the blog. Just thought of writing something, so started.. its fun.. ;-)
Deletehmm This is also good when i read it for second time!! I hope u can present the story in a better way, if u continue to write like this!!It's really funny and interesting.. keep it up Baava!! "Nuvvu raasedi memu thappakunda chaduvutham Baava"...:)
ReplyDeleteThanks Vidya !!
Delete