కవిత రచన : సాత్విక
(ప్రక్క చిత్రానికి నా భాష్యమే ఈ కవితారూపం)
కనిపించిది ఇలా
ఒక కన్ను ఆకాశం,
మరియొక కన్ను పర్వత/సాగరం చెంత ,
నాసికము సాగర మధ్యమున
పెదవులు సాగర గర్భమున
ఒక మగువ ఆకృతి
కనిపించిది ఇలా
ఒక కన్ను ఆకాశం,
మరియొక కన్ను పర్వత/సాగరం చెంత ,
నాసికము సాగర మధ్యమున
పెదవులు సాగర గర్భమున
ఒక మగువ ఆకృతి
**** **** ****
నాకు అనిపించింది ఇలా
స్వచ్చతకు సారూప్యతగా వెన్నెల పంచావు,
ఆ రెంటిని కలగలిపి అర్ధ నేత్రమయినావు..
మగువా ! ఇదేనా ప్రకృతి నీకిచ్చిన ఆకృతి.
అవుధుల్లెని ఆనందానికి ప్రతీక పర్వతమన్నావు,
ఉప్పొంగే దుఃఖానికి 'జత'ఇక కడలేనన్నావు,
ఈ రెంటిని జత చేసి మరో అర్ధ నేత్రమయినావు..
మగువా ! ఇదేనా ప్రకృతి నీకిచ్చిన ఆకృతి.
అర్ధ నేత్రాన్ని పర్వత సాగర సాక్షి అన్నావు,
మరొక భాగాన్ని సూర్య చంద్రుల పాలు చేసావు,
ఆ రెంటిని కలగలిపి నీవు వీక్షిస్తున్నావు..
మగువా ! ఇదేనా ప్రకృతి నీకిచ్చిన ఆకృతి.
నిశ్చల-నిర్మల సాగర మధ్యమునే స్వాశిస్తున్నావు,
సుఖ-దుఃఖ వర్ణసంకేతముగా చెంగావి నీ మోవినున్చావు,
కల్మష రహిత ప్రపంచ పావని గా నిలచావు..
మగువా ! ఇదేనా ప్రకృతి నీకిచ్చిన ఆకృతి.
;-)
ReplyDeleteThanks
DeleteQuality unna "Kavitha"!! Very good Start.. All The Best!!
ReplyDeleteధన్యవాదములు !!
DeleteWow..Nice
ReplyDeleteThanks for your expression, which makes me to write some more... ;-)
Delete