February 19, 2013

ఇలా అయితే ఎలా ?

కధా రచన : సాత్విక

సంకురాత్రి కోడి కూసింది, అబ్బిగాడు కెవ్వు మంటూ వచ్చాడు....
అదేంటి సంకురాత్రి మాత్రమే కోడి కూస్తుందా ? కోడి కూస్తే అబ్బిగాడు వస్తాడా ? అబ్బిగాడు వచ్చేటప్పుడు కెవ్వు మంటాడా ?  అని  హ్..హ్..హ్..హాస్చ్చర్యపోతున్నారా !! 

'రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే  అసమ్మతి' లాగా మన 'కోడి' కూడా ఎప్పుడు పడితే అప్పుడు కూస్తుంది దానికి సంకురాత్రి అవసరం లేదు. అసలు నిజం ఏమిటంటే కోడి కూయకపోయనా, అబ్బిగాడు వచ్చేవాడు. కాకపోతే  ఇప్పుడే పుట్టాడు, అందుకే కెవ్వు మన్నాడు  (అద్గది లెక్క..). 


ఓ.కే   ఇంక అబ్బిగాడి ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ..

" బాబీ , సోనీ , వాణీ "లది పవిత్ర బంధం. అవును మీరు చదివింది కరెక్టే.... ఎలా అంటారా ?
అదేనండి 'పోరి  పోరి మధ్యలో చారీ' ....
'నిరోషా శోభన మధ్యలో బాలకృష్ణ' అని...      ఇంకా అర్ధం కాలేదా ?  
'నారీ నారీ నడుమ మురారి' ఫ్యామిలీ అండి మన 'బాబీ గాడి'ది.

బాబీ -- మన అబ్బిగాడికి డాడీ (కన్ఫర్మ్
డు గా),   కాకపొతే  సోనీ , వాణీ లు మటుకు మన అబ్బిగాడికి మమ్మీ రిలేషన్ అవుతారు. 
అంతే మరి!   ఎందుకంటే ? 

బాబీ ఇంట్లో ఎప్పుడూ రెండు అంశాలు విపరీతంగా పోటి పడుతుంటాయి అవే  'పవిత్ర బంధం' మరియు 'అన్యోన్య దాంపత్యం'. ఈ రెండు అంశాల పోటికి బాబీ జస్టిఫికేషన్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది.

పవిత్ర బంధాన్ని కన్ఫర్మ్ చేస్తూ, ' కామన్ సెన్స్ పక్కకు నెట్టి, సివిక్ సెన్స్ కి పదును పెట్టి ' వంధ్యక్క సాయం తో  ' కోర్టు  కెక్కి , చట్టం గొంతు నొక్కి' మన అబ్బిగాడి బర్త్ సర్టిఫికేట్ లో 'మదర్' అన్న కాలమ్ లో  సోనీ , వాణీ ల ఇద్దరి పేర్లు ఎంటర్ చేయించేసాడు బాబీ.  

అన్యోన్య దాంపత్యానికి అన్యాయం జరగకుండా ' రైట్ ఫ్రం జీరో అవర్ ఆఫ్ అబ్బిగాడి బర్త్' వాడికి అసలు మమ్మీ ఎవరో చెప్పకుండానే పెంచసాగారు మన 'ఒక డాడీ ఇద్దరు మమ్మీసు'. అందుకే అబ్బిగాడికి సోనీ, వాణీలు మమ్మీ వరస అవుతారు మన అబ్బిగాడికి సంబంధించినంతవరకు.. అంతే !!


*****       *****       *****


"వేట రియాలిటీ షో యాంకర్, 
బాబీ వాళ్ళ పక్కింటి శంకర్ఒక్కరే ....


'చెట్టు ముందా ? విత్తనం ముందా ?' అనే ప్రశ్నకి కూడా ఠక్కున సమాధానం చెప్పే రాష్ట్ర ప్రజలకే  
'సీరియల్ మధ్యలో యాడ్ వస్తోందా ? లేక యాడ్ మధ్యలో సీరియల్ వస్తోందా ?' అని పజిల్ని విసిరేసిన శంకరం ఆంటే యావత్ రాష్త్రానికి చాలా డిసిప్లిన్. 


శంకర్ పోయినేడాది తీసిన రియాలిటీ షో చూసి జనాలు రోడ్ల మీదకు విసిరేసిన వస్తువులు కలక్ట్ చేసి వరల్డ్ బ్యాంకు అప్పుకి వడ్డీ చెల్లించిన ప్రభుత్వం, "ఈసారి మరింత జాగ్రత్తగా ప్లాన్ చేయాలనీ , వరల్డ్ బ్యాంకు దగ్గర మన రాష్ట్రం తరుపున చేసిన మొత్తం అప్పుని తీర్చే భాధ్యత శంకరం మీద పెట్టేసింది" రాష్ట్ర ప్రభుత్వం. 


రాష్ట్ర-వరల్డ్-బ్యాంకు అప్పు మొత్తాన్ని తన భుజాల మీద మోస్తున్న శంకరం కొంచం భారంగా ఫీల్ అయ్యాడు, అందుకే ఈ విషయంలో రాష్ట్ర ప్రజలని, 
ప్రభుత్వాన్ని కూడా ఇంతకింతా ఫీల్ అయ్యేట్టు చెయ్యాలి అని డిసైడ్ అయ్యాడు.  బాబీ గాడి ధోభి ద్వారా 'ఇద్దరు మమ్మీ' ల కాన్సెప్ట్, 'బర్త్ సర్టిఫికేట్' లో ఇద్దరి మమ్మీల పేర్ల గురించి రహస్యంగా తెలుసుకున్నాడు శంకరం.  అంగారక గ్రహం మీద తిరగాల్సిన 'క్యురియాసిటీ రోవర్' (అంతరిక్ష నౌక) సడన్ గా తన గతిని మార్చుకొని శంకరం మెదడు లో సెటిలయి బాబీ గాడి ఇంటి పరిణామాల మీద క్యురియాసిటీ పెంచేసింది.  

' ఇలా అంతమయింది ' అనే  టైటిల్ తో ('ఛీ-రియల్' అనే  కాప్షన్ తో) బాబీ ఫ్యామిలీ డ్రామాని బుల్లి  తెర కేక్కించడం మొదలెట్టాడు శంకరం. 

'వినుడు వినుడు రామాయణ' గాధ అన్నంత సోంపుగా 
టైటిల్ సాంగ్ రాసి మరీ బాబీ ఫ్యామిలీ డ్రామాని బుల్లి తెర కేక్కించే ప్రయత్నంలో పడ్డాడు. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసాడిలా...
ఆగదూ ...ఆగదూ ..
(ఆగదూ ఆగదూ ... సాంగ్ ఫ్రం ప్రేమాభిషేకం .. ట్యూన్ ని వాడేసాడిలా...)

ఆగదూ..ఆగదూ ... 
ట్యావ్....ట్యావ్ ...., ఆగదు ఏ ఎపిసోడ్ నీ కోసము,
ఆగితే ముందుకు సాగదు ఈ సీరియలు, ముందుకు సాగదు ఈ ఛీ-రియలు

ఈ స్టోరీ బాబీదని
.... ట్యావ్....ట్యావ్.., పరమ సోది అని...., 
తెలిసినా....ఆ ....ఆ....... రేపు రాక మానదు ,
నటీ నటులు బేవార్సని...... ట్యావ్...... ట్యావ్, డైరెక్షన్ దరిద్రమని..., 
తెలిసినా...ఆ....ఆ... మేము  తీయకా మానము...,
ప్రేక్షకులు పాపమని .... ట్యావ్, ఇన్సూరన్స్ ఉండదని......, 
తెలిసినా....ఆ....ఆ...  తెలిసినా  ఈ రిలే నిలువదు...
ఆగదూ .. ఆగదూ ... 

అని  వరల్డ్ బ్యాంకు అప్పు దృష్టిలో పెట్టుకొని రెచ్చిపోయాడు శంకర్...*****       *****       *****


'బర్త్ సర్టిఫికేటు' కి సంబంధించి కోర్టు గొడవల్లో పడి పది నెలలు గడిచినా అబ్బిగాడికి బారసాల చేయలేకపోయాడు బాబీ. బారసాల డిలే అయింది. పది నెలల వయసు పై బడి అబ్బిగాడు మెల్లి మెల్లిగా మాటలు పలకటానికి ప్రయత్నిస్తున్నాడు... ఉన్నట్టుంది ఒక రోజు ఇలా అన్నాడు        అ.. అ ..  అమ్మా అని...
అన్యోన్య దాంపత్యం ఎఫెక్ట్ తో అసలు తల్లి ఎవరో  సోనీ, వాణీ లు కూడా మర్చిపోయారు. అందువల్ల  అ.. అ... అమ్మా అని పిలిచినా ఎవరికీ వారే తమని కాదని మిన్నకుండిపోయారు.

అబ్బిగాడి పిలుపుకి సోనీ, వాణీ ఇద్దరు రియాక్ట్ అవ్వలేదని బాబీ ఆ రోజు ఎపిసోడ్ లోని తన బతుకు 
ఛీ-రియల్ చూసి తెలుసుకున్నాడు, భాదపడ్డాడు. కాకపొతే  ఈ 'రియల్'  సీనుని ఛి-రియల్ లో  శంకరం తన భావ దారిద్రాన్ని ఉపయోగించి బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఇచ్చాడిలా..   ' అమ్మా అని పిలచినా ఆ..ల..కించ..వేవమ్మ .... ' అంటూ.. శంకరం తీసిన ఆ సన్నివేశం బాబీని ఎంతగానో కదిలించి వేసింది .....
వెంటనే బాబీ  'కట్టేశాడు సీరియల్ , ఫోన్ లో నోక్కేసాడు రీ-డయల్'.

"ఫోన్ లైనులో కి వచ్చింది వాళ్ళ చెల్లి సులోచన, 
సులువుగా చెప్పేసింది ఒక చిన్న ఆలోచన". 

వెంటనే ఫోన్ కనెక్ట్ చేసాడు 'ఈ సారి వాళ్ళ బాసుకి,  టుడే తను లీవు అని చెప్పడానికి'. అబ్బిగాడికి అమ్మా అని ఎలా పిలవాలి అని ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసాడు బాబీ. 

ఈ నిజ సన్నివేశాన్ని శంకరం మళ్లీ తన భావ దరిద్రాన్ని లైట్ గా ఉపయోగించి 
ఛీ-రియల్ ప్రోమో చూపించాడిలా ...
"దెబ్బ తగిలిన బాబు అమ్మా అని ఒకలాగా పిలుస్తాడు, ఆకలితో ఉన్న బిడ్డ అమ్మా అని మరోలా అరుస్తాడు, 
అలాగే ఒక్క  తల్లి ఉన్న పిల్లలు అమ్మా అని ఒక లాగా పిలిస్తే , ఇద్దరు మమ్మీలు ఉన్న అబ్బిగాడు ఎలా పిలుస్తారో చూడండి రేపటి ఎపిసోడ్ లో ..... " చూస్తూనే ఉండండి  'ఇలా అంతమయింది'.. టాన్...టాన్...ట..న్...    అని  బ్యాక్-గ్రౌండ్ మ్యూజిక్ తో ఆదరగోట్టేసాడు ఆ రోజు 'ప్రోమో'ని. 

వరల్డ్ బ్యాంకు అప్పుని తీర్చటానికి  (తను చెయ్యాల్సిన కల్లెక్షన్), రేపటి అబ్బిగాడి పిలవబోయే 'అమ్మా' అన్న కొత్తరకం పిలుపుని 'లైవ్' ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు ఇంక ఆలస్యం చేయకుండా కెమెరా పెట్టేసాడు బాబీ ఇంట్లోనే ....

సంకురాత్రి కోడి కూయలేదు, కాని తెల్లారింది ...


యావత్ రాష్ట్ర ప్రజలు టీవి ల ముందు సెటిల్ అయ్యారు, 'లైవ్-
ప్రోగ్రాం' విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం హాలిడే డిక్లేర్ చేసేసింది ....
తమ బాబు కొత్త పిలుపు కోసం వొత్తులు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని మరీ వేసుకొని ఎదురుచూడసాగారు సోనీ, వాణీలు . 'అమ్మా' అని పిలవడాన్ని  శంకరాభరణం శంకర శాస్త్రి కంటే గొప్పగా ఇచ్చిన తన ట్రైనింగ్ మీద నమ్మకం తో బాబీ చాల కాన్ఫిడెంట్ గా కనిపించాడు. 

అబ్బిగాడు నిద్ర లేచాడు, రాష్ట్రం ఉలిక్కి పడింది....

చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న దాంట్లో ఎంత నిజం ఉన్నదో అబ్బిగాడు కూడా తన పాత్రకి న్యాయం చేస్తూ  పిలిచాడిలా ... 
('అమ్మా అనే పిలుపుకి ముందు తల్లి పేర్లు జోడించమని'  డాడీ చెప్పిన ఫార్ములా గుర్తుకి తెచ్చుకుంటూ ) 
సో..నీ..యమ్మ , వా..నీ..యమ్మ  
సో..నీయమ్మ , వా..నీయమ్మ  అని ఫార్ములా బాగా గుర్తు పెట్టుకున్నా పంక్చుయేషన్  మిస్ చేస్తూ రెండు సార్లు పిలిచేసి తన పని చేసుకోసాగాడు అబ్బిగాడు..

అబ్బిగాడి పిలుపులోని  'కమ్మ'దనానికంటే అందులో ఉట్టిపడుతున్న 'అమ్మ'దనానికి రాష్ట్రం
లో మొత్తం నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ చేతికి అందినవి-అందనివి కూడా వీధుల్లోకి విసిరేశారు..
లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యగా 144 సెక్షన్  విధించింది రాష్ట్ర ప్రభుత్వం.

పరిస్థితి చూసి భీతి చెందిన బాబీ, నిన్నటి 'టు'డే  లీవు ని 'టూ' డే
స్  లీవు గా మార్చుకొని, వెంటనే ఇంకొక ప్రయత్నంగా మళ్లీ కోచింగ్ ఇచ్చేశాడు అబ్బిగాడికి, మరో కొత్త ఆలోచనతో. 'ప్రజలంతా ఈవెనింగ్ ఎపిసోడ్ కి ఫిజికల్ గా రెడీ అవుతూ మెంటల్ గా ప్రిపేర్' అయ్యారు...
ఆ 'నాట్-ఫైన్' ఈవెనింగ్ అబ్బిగాడు మళ్లీ పిలిచాడిలా  సో..నీమమ్మీ...   వా..నీమమ్మీ... అంటూ ....
కాకపోతే శంకరం ఇచ్చిన క్లైమాక్స్ బ్యాక్-గ్రౌండ్ మ్యూజిక్ వల్ల 'ఇంగ్లీష్ మీడియం కుర్రాడు, తిడుతున్న తెలుగు బూతు లాగా వినపడసాగింది' ... అంతే మళ్లీ ప్రజలు రెచ్చిపోయారు....

ఇంకొక ఆఖరి ప్రయత్నంగా 'మమ్మీ' బదులు 'తల్లి' అని రీప్లేస్ చేసి ట్రైనింగ్ ఇద్దామా ? అన్న ఆలోచన తళుక్కున మెరిసింది బాబీ మెదడులో.  అంతలోనే (సో ..నీ ..తల్లి ,  వా...నీ..తల్లి)  తమ ఇంటి అన్యోన్య దాంపత్య జీవితం  టీవీ లో లైవ్ వస్తోందని గుర్తుకు వచ్చి 'ఇదేదో ఆంధ్రా బూతుకి  తెలంగాణా తర్జుమా లాగా' భావించి  'ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నాడనే' నెపంతో తనని ఎక్కడ తీవ్రవాదిగా ప్రకటించేస్తారో అని బయపడి ఆ ప్రయత్నాన్ని అంతటితో విరమించుకున్నాడు బాబీ . ఇంక పరిస్థితి మరీ అద్వాన్నం అయింది, ఏమి చెయ్యలో పాలుపోనీ బాబీ, అత్యవసర సమావేశం నిర్వహించి అబ్బిగాడి మమ్మీసుకి 'బారసాల' డిక్లేర్ చేసేసాడు.   పనిలో పనిగా అబ్బిగాడికి కూడా కానిచ్చెద్దాము అని డిసైడ్ అయ్యాడు బాబీ. శంకరం ప్రోమోల పుణ్యమా అని ఈ విషయం రాష్ట్రం మొత్తం మారుమోగిపోయింది.  "తల్లులకి, పిల్లవాడికి ఒకే పందిట్లో బారసాల"  అని తెలుసుకున్న జనం పెట్రేగిపోయారు ... రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ ప్రకటించేసింది....

'జనాలు వీధుల్లోకి విసిరేసిన వస్తువులు సేకరించడంలో ' రాష్ట్ర ప్రభుత్వ బలగాలు సరిపోక ప్రభుత్వం ఆర్మీ సహాయాన్ని అర్ధించింది . వీధుల్లోకి జనాలు విసిరేసిన కల్లెక్షన్స చూసి కళ్ళు తే
లేసింది ప్రభుత్వం. వరల్డ్ బ్యాంకు అప్పు  తీర్చటానికి సహాయం చెయ్యమని అడిగితే, వరల్డ్ బ్యాంకుకె అప్పిచ్చే రేంజ్ కి తీసుకెళ్ళిన శంకరాన్ని  రాష్ట్ర ప్రభుత్వం  పొగుడుతూ,  దేశ ప్రజల మానసిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 'భవిష్యత్తులో ఇంకెప్పుడు ఛీ-రియల్ తీయను' అని ప్రమాణం చేయించుకొని మరీ  'ఛీ-రియల్ -- సన్నాసి' అనే బిరుదు తో సత్కరించేసింది. అంతేకాకుండా, బాబీ ఫ్యామిలీ డ్రామా కి 'సీరియల్ అఫ్ ది మిలీనియం' అవార్డునిచ్చి  కేంద్ర ప్రభుత్వం సత్కరించింది శంకరాన్ని.*****       *****       *****

కథకు సంబంధం లేదు ఇది మనలో మన మాట :  
చదవండి  బాబీ గాడి 'క'హాని, 
మీకు ఖచ్చితంగా  'నో' హాని, 
దీని రుచి గుర్తుకు తెప్పిస్తుంది ఫ్రెష్ 'హని', 
చదివినవారంతా  అనాలి హ హ 'అని'
మనస్పూర్తిగా కోరుకుంటూ ... ముగించేస్తున్నాను ... 
బాబోయ్ .. ఇలా అయితే ఎలా ?  అనకండే మఱి


6 comments:

 1. హాయ్,

  ఇంతవఱకు వచ్చిన సమోసాలు చిన్న చిన్నవిగా వున్నాయి . ఇప్పుడు వచ్చిన ఈ సమోసాలొ , ఉల్లిపాయ , పచ్చిమిర్చి కలిసి రుచిగా ఉంది .
  ఇంకా కొత్త కొత్త ( క్యారెక్టర్లతో ) సమోసాలు ఇంకా రుచిగా వుండాలని ఆశిస్తున్నాను .

  శర్మ జీ ఎస్

  ReplyDelete
 2. haha!! Very nice.. could see lot of improvement than the older stories.. Keep it up!!

  ReplyDelete
  Replies
  1. Thanks Vidya !

   Thanks for your time and encouragement. ;-)

   Delete
 3. హ హా.....హాస్యంతో అలరించారు....భలే నచ్చిందిగా:-)

  ReplyDelete
  Replies
  1. మీ యొక్క అభినందనలకి ధన్యవాదములు పద్మగారు.

   కధలోని హాస్యాన్ని మీ కామెంట్ లోని క..క....కామెడీ.. తో కొట్టేసారు... ;-)
   Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు