February 28, 2013

ఇదే విషయం అదే మేటర్.. కదా ?

కవిత రచన : సాత్విక

అబ్బిగాడి  స్నేహితుడు  సుబ్బిగాడు, సుబ్బిగాడికి ఫ్రెండ్ అబ్బిగాడు,

ఎలా.. ఎలా.. ఎలా చెప్పనూ ? 
ఈ చిన్న మేటరు .....(అదేనండి  విషయం)
ఎలాగోలాగా ప్రయత్నిస్తాను మరి  .....

మన అబ్బిగాడు ....

చిన్నప్పుడే వీధి బడికి పోయాడుతెలుగు మీడియం చేరాడు,
పంతులుగారు తెచ్చారు బాలశిక్షఆ పై తీర్చుకున్నారు ఆయన కక్ష,
ప్రక్రుతి వికృతి ఎలుగెత్తి చాటారుఇదే తేట తెలుగు అని నొక్కి వక్కాణించారు,
లంబ కోణ లెక్కలెన్నో మీకు విదితమేనన్నారు ఇదంతా మన గణితమేనన్నారు,
'అసామాన్య' విషయాలు భోదించారు , ఇదే సామాన్య శాస్త్రమంటూ వివరించారు,
'అసాంఘిక' చర్యలకు అద్దం పట్టారు అదే  చరిత్ర నేర్పిన సాంఘికమన్నారు ...

మరి సుబ్బిగాడో ..............


చిన్నప్పుడే కాన్వెంట్ లో చేరిపోయాడుఆంగ్ల మీడియం  లో దూరిపోయాడు,
పెట్టించారు అందరికి గుడ్డు మార్నింగుచేయించేసారు పొద్దున్నే వాకింగ్ 
జాతీయ భాష నేర్వమన్నారు తెలుగు ఎందుకంటూ జాతియం చేసారు,
… య్… యా... యాపిల్.. అని చేసేసారు ఫిక్స్ అత్యవసరంగా నేర్పించేసారు సీలబుల్ ఫోనిక్స్,
చదివేయమన్నారు మోరల్ సైన్స్అసలు అక్కరలేదు అన్నారు కామన్ సెన్స్ ,
వింత వింత విక్టరీలు వినిపించేసారుఇదే తర-తరాలుగా తెచ్చుకున్న హిస్టరీ గా తేల్చేసారు …


తెలుగు మీడియం అబ్బిగాడికి, సుబ్బిగాడు  ఒక మంచి స్నేహితుడు,
ఆంగ్ల మీడియం సుబ్బిగాడికి, అబ్బిగాడు  ఈస్  ఏ గుడ్ ఫ్రెండ్ యూ నో ...

2 comments:

  1. memu oka kavitha chadive lopala nuvvu 10 kavithalu raasthunnav? U r in full josh! What's the matter?

    ReplyDelete
    Replies
    1. ఏమిలేదు ఇదే విషయం అదే మేటర్ కదా అందుకని అంతే !

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు