కవిత రచన : సాత్విక
నేనూ... పక్క మీదున్నపుడు ...
పక్షులు కిల-కిల మనగానే, తూరుపు తెల-తెల వారగనే,
రవి కిరణాలు తలుపు తట్టగా , నిదురమ్మ నన్ను విడనాడక,
ప్రకృతి పిలుపులు నాలో వారధి కట్టగా, వికృత భావం వాటికి సారధి అవ్వగా,
జనరల్ గా, అప్పుడు నేనూ ! భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా , మొదటిసారి !!
నేనూ... ఆఫీసు కి బయల్దేరేటప్పుడు ...
ట్రాఫిక్ జాము అని రేడియోలో పుకారు, నేను పొరపాటున చేసాను బేఖాతరు,
ఇటొక వాహనం అటొక వాహనం, ఇంక నేను కోల్పోయాను నా సహనం...
క్యాజువల్ గా, అప్పుడు నేనూ ! భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా , రెండవసారి !!
నేనూ... ఆఫీసు లో టీం మీటింగ్ ఉన్నప్పుడు ...
అయ్యాను నేను మీటింగు కి గైర్హాజరు, మా మేనేజర్ పెట్టేసాడు నా మీద నజరు,
కేఫు లో కలిసింది కొలీగు పావని, ఆశగా ఎదురు చూసాను ఏదో చెబుతుందని,
మీటింగ్ బయటికి వచ్చాడు మేనేజర్ మామ, చూసేసాడు మమ్మల్ని అయ్యో రామ,
టేర్రిఫిక్ గా, అప్పుడు నేనూ ! భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా , మూడవసారి !!
ఎదురింటి సంధ్య కాలికి అయ్యింది గాయం , అవకాశం దొరికింది చేయడానికి సాయం,
వేసేశాను ఆమె గాయానికి మలాం పట్టి , నడిపిస్తున్నాను - నా చేయి ఆమె కాలు కింద పెట్టి,
అప్పుడే వచ్చాడు మా డాడి అనకొండ, ఈ సీను చూసి ఆపేసాడు బండి శబ్దం కాకుండా,
సిల్లీ గా, అప్పుడు నేనూ ! భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా , నాలుగోసారి !!
నేనూ... రాత్రి పక్క మీదకేక్కినప్పుడు ...
రిలాక్స్డ్ గా చూడాలనిపించింది న్యూస్, కాని బుల్లిపెట్టేలో వస్తున్నాయి న్యూసెన్స్,
చేసారు హీరోకి రొటీన్ పొగడ్తల సందడి, పెట్టించేసారు ప్రేక్షకులందరికీ కంట తడి,
"Sandhy nuvvu undatam mee daddy chusthe parledu!! Tripura chusthe ......???????" What next?:)
ReplyDeleteme too looking forward to get the answer ....
Deleteహాయ్,
ReplyDeleteఇలా ఎన్నో మార్లు అందరూ బ్లాగాడిస్తూనే ఉంటారు , కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటుంటాయి.
నువ్వు చక్కగా చెప్పావు. మళ్ళీ గుర్తు చేసుకొనేటట్ట్లు చేశావు.
థాంక్ యు .
శర్మ జీ ఎస్
సో యు గాట్ ద పాయింట్ ..... ;-)
DeleteNice,సరదాగా చాలా బాగా రాస్తున్నారు Sagar గారు.
ReplyDeleteసరదాగా నవ్వించే ప్రయత్నం .....అంతే ....
Deleteనవ్వేసేయండి.....హ హ హ