February 26, 2013

ఔనంటారా ? కాదంటారా ?



కవిత రచన : సాత్విక
ఓ  జననమా !
ప్రసవ  వేదన   కలిగిస్తావు ,  సృష్టి రహస్యాన్ని  తెలియ  చేస్తావు  .. 
తోలి  అడుగుకు  ఆధ్యం  నీవేనంటావు,  ప్రాణం  ఖరీదుకు  సాధ్యం  కాదంటావు ...
  జననమా !!  నువ్వు  దేవుడిచ్చిన  వరమా ?

  మరణమా !!
ప్రతి  జీవికి  నువ్వు  రుణపడి  ఉంటావు,అడగకనే  భ్రమపడి  ఋణం  చెల్లిస్తావు ..
జీవరాసి  విషయంలో  నీ  షరా  మామూలే,మా    జీవితకాలానికి  పహారా నీవేలే ...
  మరణమా  !!  నువ్వూ  దేవుడిచ్చిన  వరమేనా ?

తొమ్మిది  నెలల   ప్రస్థానం  ''  జననం,  తొమ్మిది  ఘడియల  ప్రహసనం  ''  మరణం,
ఆహ్వానం  అంది  వచ్చే  అతిధే  ''  జననం,  తిరస్కారానికి  తలొగ్గక  తీసుకుపోయేదే  ''  మరణం,
ఇంతేకదా   మన   గీతాసారం !  అంతేలేనిది  ఈ  జీవన్మరణం   !!

కుల మత  తారతమ్యం  ఎరుగదు  ''  జననం,  తన-మన  కారుణ్యం   తలవదు  ''  మరణం,
సృష్టి  రహస్యమే  ''  జనన  అంతర్జాలం,  ఎవ్వరికి  అంతుబట్టదు  ''  మరణ  మాయాజాలం,
ఇంతేకదా   మన   గీతాసారం !  అంతేలేనిది  ఈ  జీవన్మరణం   !!

కాలాంకితమయినది  ''  జననం కలానికతీతమయినది  ''  మరణం,
జన్మించి  ''  జీవి  కుటుంబానికి   'హోస్ట్',  మరణించి  ''  జీవి  ప్రపంచానికిక  'ఘోస్ట్',
ఇంతేకదా   మన   గీతాసారం !  అంతేలేనిది  ఈ  జీవన్మరణం   !!

8 comments:

  1. Ahaa !! geetha lo krishnudu chepindi motham oka 10 lines lo short ga cheppesav!!

    ReplyDelete
    Replies
    1. గీత నాకు తెలుసంటూ కోత కోసాను అంతే...
      హ హ హ హ .....

      Delete
  2. హాయ్,

    చాలా , చాలా బాగుంది . గీతాసారం అంటే మన రాతల గీతల సారమే నని చాలా బాగా చెప్పావ్.

    శ్వాస ఉంటే హోష్ట్ , అదే లేకుంటే ఘోష్ట్ .
    9 మాసాల ప్రహసనం 9 ఘడియలలో ముగిస్తుంది.
    తొలి అడుగుకు ఆద్యం నీవే , ప్రాణం ఖరిదుకు సాధ్యం కాదు .
    ఇలాంటివి ఆ కవిత నిండా ఉన్నాయి .

    శర్మ జీ ఎస్

    ReplyDelete
    Replies
    1. నేను పది వాక్యాలలో వివరిస్తే మీరు నాలుగు ముక్కల్లో తేల్చేసారు .... ధన్యవాదములు !!

      Delete
  3. అద్భుతంగా చెప్పారు!
    ఇది చదువుతుంటే జాలాదిగారు "కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే మొయ్యాల" అన్న మాటలు గుర్తుకొచ్చాయి.

    ReplyDelete
    Replies
    1. స్వాగతం సుస్వాగతం ...
      సమయం కేటాయించి నా ఈ చిన్న ప్రయత్నాన్నికి మీరు ఊతమిచ్చేందుకు చేసిన ప్రయత్నం హర్షణీయం ..

      ఒక గొప్ప వ్యక్తిని అయన చెప్పిన సూక్తిని గుర్తు చేసుకున్నందుకు మరియు చేసినందుకు ధన్యవాదములు !!

      Delete
  4. Anonymous2/28/2013

    బాగా రాశావు సాగర్! కొన్ని కమ్మెంట్స్...

    జీవరాసి విషయంలో నీ షరా మామూలే,మా ఈ జీవితకాలానికి పహారా నీవేలే ... super!

    తొమ్మిది ఘడియల ప్రహసనం 'ఈ' మరణం....మరణం తొమ్మిది ఘడియలని ఎలా చెప్పావు?

    ఆహ్వానం అంది వచ్చే అతిధే 'ఆ' జననం.....ఆహ్వానం లేకున్నా వచ్చే...అని ఉంటే ఇంకా బాగుండేదేమో..

    కలానికతీతమయినది 'ఈ' మరణం...మరణం ఎలా కాలానికి అతీతం? కాలాతీతం చేయనిదే మరణం..అని ఉంటే బావుండేదేమో!

    - Kamal Kishore Suruguchi

    ReplyDelete
    Replies
    1. యువ కిషోరానికి స్వాగతం !!

      నీ కామెంట్స్ చాలా ప్రోత్సాహకంగా వున్నాయి. ప్రతి వాక్యాన్ని ఆద్యంతం పరిశీలించినందుకు మంగిడీలు , మంగిడీలు. ఇలానే ప్రోత్సహించాలి అని కోరుకుంటూ....
      నా భావాలు ... ఇవిగో

      "తొమ్మిది ఘడియల" --
      జననానికి తొమ్మిది నెలలు అందరికి నిజం కాదు కాని ఒక రమారమిన సూచించే ప్రక్రియ , అలాగే తొమ్మిది ఘడియలు అనేది ప్రాణం పోయే ఒక సులువుని రిప్రేసేంట్ చేయాలనీ నా ప్రయత్నం

      "ఆహ్వానం" --
      'ఆహ్వానాన్ని మన్నించి' వచ్చేది జననం అయితే కాంట్రవర్శియల్ స్వభావాన్ని వ్యక్తపరుస్తుంది మరణం అని నా అభిప్రాయం.
      "పిలిస్తే వచ్చేది" జననమయితే , నెట్టినా నిన్ను తనతో తీసుకు పోయేది మరణం అనే స్వభావాన్ని హై లైట్ చేయడం నా ఉద్దేశ్యం..

      "కలానికతీతమయినది" --
      మరణం అనేది జీవుని కాల,మాన పరిస్థితులకి అతీతముగా తన యొక్క రుణాన్ని తిరిగి చేల్లిన్చుకుంటుంది అందువల్ల కాలానికతీతం అని అన్నాను.
      నువ్వు చెప్పిన 'కాలాతీతము చేయనిది' కూడా మనం వినియొగించచ్చు డిఫరెంట్ కాంటెస్ట్ లో. గుడ్ థాట్.

      -- సాత్విక

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు