February 25, 2013

చూడు .... నన్నిలా ...!!


కవిత రచన : సాత్విక

ఎగిసిపడుతున్నది  ఒక  అల,  
తీరం దరి చేరాలన్నది  దాని  కల ...

వువ్విళ్ళూరుతున్నది  నా మనసు, 
అది  నిన్ను  చేరటానికని  నీకు  తెలుసు ...

నిన్ను  కలుసుకోవాలని  తపించాను  అనుక్షణం, 
చేసాను  విశాల  ప్రపంచ  విహంగ  వీక్షణం ...

నీ  దరిచేరక  నాలో  ఆవహించింది  నిస్తేజం,
నీ  చిరునామా  తెలిసి  నాలో  ఎగిసింది  ఉత్తేజం ...

కడకు  చేరి   విశ్రమించాను  ఇక్కడ  చతికిల,
కడలి  తీరాన  చూడాలని   నీ  నవ్వుల  కిల కిల ...

నిన్ను  చూసి  చిన్నబోతుందా  చందమామ  వెన్నెల,
అందుకే  చాటేసావా ? నీ నగుమోము  ప్రక్కకు  ఆలా...

8 comments:

  1. కడలితీరాన్న కూర్చుని నెలవంకను చూస్తూ తనని చూడకపోతే ఏం చేస్తుంది...అందుకే ముఖం చాటేసింది:-)

    ReplyDelete
    Replies
    1. చాన్నాళ్ళకి , చాన్నాళ్ళకి ....... స్వాగతం ....

      మీరు ఎలాగయినా చెప్పగలరు... మీరు అలా అంటే ఇంక మేమేమంటాము ... ఓకే తప్ప

      ధన్యవాదములు !!

      Delete
  2. హాయ్,

    కొంతమంది దంపతులకు చాలా ఆలస్యంగా ప్రసవించే అవకాశం వస్తుంటుంది . అంతవఱకు ఆలస్యమైన ప్రసవాలు , ఆ తర్వాత వరుసగా వత్సరం వత్సరం వస్తూనే ఉంటాయి , అమిత ఆనందాన్ని అందిస్తుంటాయి .

    ఇప్పటి నీ పరిస్థితి అదే .

    ఇంకా నీవెన్నో ప్రసవాలకు అవకాశం యివ్వాలని ఆశిస్తున్నాను .

    "తనవంక చూడక నెలవంక చూస్తుంటే ముఖం దాచేసింది."


    శర్మ జీ ఎస్

    ReplyDelete
    Replies
    1. పిల్ల ప్రవాహం ..... మాత్రమె ఇది .... జస్ట్ ట్రై చేస్తున్న ... ;-)

      థాంక్స్...

      Delete
  3. Poetry ki enkemaina peru pettu!! Samosalu kaadu evi!!"Jilebi or Laddu":)

    ReplyDelete
    Replies
    1. నేను వీటికి టైం-పాస్ పల్లీలు అని పెడదామని అనుకున్నాను .... ఇంకొంచం సమయం కావాలి....

      నీ పరిశీలనకి ... ధన్యవాదములు ... ;-)

      Delete
  4. Replies
    1. ఇది నచ్చింది అని ధైర్యం చేసి చెప్పినందుకు ధన్యవాదములు !!
      మరి మిగతావి నచ్చలేదా ? ?
      హ హ హ హ .......

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు