కధారచన : సాత్విక
రామ చక్కని సీతకి అరచేత గోరింట..
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట... రామ చక్కని సీతకి......
అని రాజారత్నం గారి ఇంటి ముందున్న పందిట్లోని మైకు 'తెలుగులో గొంతు చించుకొని', 'టెక్నికల్ గా సౌండ్ పెంచబడి' పాడుతోంది...
రామ చక్కని సీత... ఇలాంటి 'బాణీ'లు అంటే ఈ మధ్యే 'వొణీ'లు వేసుకుంటున్న రాజారత్నం గారి పనిపిల్ల అయిన రామసీత కి ఎంతో మక్కువ...అసలు ఆ చరణాలు తనని చూసే రాసారు అన్నంత కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యేది రామసీత.
ఇక అసలు విషయానికి వస్తే 'అయన పేరు రాజారత్నం , రాహుల్ వారి పుత్రరత్నం'. అజ్ఞానం పారదోలేది 'ఆ'జ్ఞానమని రాజారత్నం గారి స్ట్రాంగ్ ఫీలింగ్. హా !! చెప్పడం మరిచెను 'ఆ'జ్ఞానం అంటే 'కాల'జ్ఞానంమండి బాబూ !!
'ప్రతిరోజూ కాలజ్ఞాన గ్రంధాన్ని ఎంతో పవిత్రంగా పూజించటం' రాజారత్నం దినచర్యలలో అతి ముఖ్యమయిన ఘట్టం. 'పూజ రోజు చేయి, 'గ్రంధ' పారాయణ మటుకు కొన్ని ముఖ్యమయిన రోజులలో మాత్రమె చేయ'మని ఊరి జ్యోతీష్యుడి చేత చెప్పించారు కొందరు పెద్దలు. ఎందుకంటే? 'గ్రంధ' పారాయణ లో ఏదో ఒక వాక్యం దగ్గర 'లాక్' అవడం, ఆ విషయాన్నీ తన జీవితానికి అన్వయించుకొనే పరిణామక్రమంలో ఏదో ఒక డెసిషన్ తీసుకొని అందరిని 'షాక్' కి గురి చేయడం కొన్ని సంవత్సరాలగా 'రాజారత్నం ఫాలో అవుతున్న స్టైల్, బట్ ఇట్స్ జస్ట్ ఫర్ ఏ వైల్' అని మొదట్లో సరిపెట్టుకున్నారు అందరూ, తరవాత కాదని ఇలా గురిపెట్టారు ఇంకొందరు..
***** ***** ***** *****
'కనుల ముందు లీలగా తెర మీద రాక్షసుల యుద్దాలు,తెర ముందు చిన్న పిల్లలు ఏడుపులు .. కడుపు పట్టుకొని మెలికలు తిరుగుతూ కింద పడి దొర్లుతున్న చిన్నారుల ఆక్రందనలు ...... 'నో..నో .... అంటూ కళ్ళు తెరిచారు రాజారత్నం గారు. తను చూసిన ఆ దృశ్యానికి రియాలిటీ అప్లై చేసి ... బుల్లితెర బూచి అంటే రియాలిటీ షో యాంకర్లని, వారి వికృత భావజాలానికి బలి అయ్యేది భావి పౌరుల జీవితమని వివరించేసాడు...
లాక్ అయిన వాక్యం ఓకే ! కాకపొతే షాక్ అయ్యే డెసిషన్ ఏంటంటే తన బాబు రాహుల్ ఈ బుల్లి తెర బూచికి బలి కాకూడదన్న సంకల్పంతో విదేశాలకి పంపాలని నిర్ణయించేసాడు రాజారత్నం.
రాజారత్నం వివరించిన కాలజ్ఞాన వాక్య తాత్పర్యానికి ,ఆయన తీసుకున్న డెసిషన్ కి పారాయణకి అటెండ్ అయిన చిన్నా-చితక ముసలి-ముతక అందరి కళ్ళు చెమర్చాయి. ఇంతలో కాలజ్ఞాన గ్రంధానికి అటెండ్ అయిన జూనియర్ భక్తుడు ఒకాయన తన యెగ్జ్యేట్మెంట్ ఆపుకోలేక అడిగేసాడిలా "కాలజ్ఞానం అంటే ఏమిటి గురూజీ? " అని. రాజారత్నం చిద్విలాసంగా నవ్వి కాలజ్ఞానం అంటే "కాలం చేసిన జ్ఞానం' అని సమాధానమిచ్చాడు.
కాస్తో కూస్తో చదువుకున్న సీతారత్నం మటుకు , ఎస్ ఇది ఖచ్చితంగా కాలం చేసిన జ్ఞానమే కాని .. కాలం గురించి వివరించే జ్ఞానం కానే కాదు, అందుకు అయన ఇచ్చిన తాత్పర్యమే ఉదాహరణ అని మనసులో అనుకోని, అసలు ''బుల్లి తెరల బూచి, భావి జీవత భాచి'' వాక్యం కాలజ్ఞానం లో ఉండి ఉండదని, రాజారత్నానికి సంస్కృతం చదవడం కూడా రాదు అని కన్ఫర్మ్ చేసుకొని మిన్నకుండి పోయాడు.
అందువల్ల 'రాహుల్ చిన్నప్పుడే వెళ్ళాల్సి వచ్చింది దుబాయికి, వీడికి కంపెనీ ఇవ్వక తప్పలేదు వాళ్ళ బాబాయికి '. బాబాయి పక్కింట్లో ఉండేవాడు షేక్ రషీద్, రాహుల్ ని ఆడించేవాడు. రాహుల్ బాబాయి కూడా మార్గదర్శి లో చేరాడు ఒక చిన్న పెట్రోల్ బావి కొనుక్కున్నాడు. బాబాయ్ ట్రైనింగ్ లో అబ్బాయి ఆ బావిని చిన్న చెరువు చేసేసాడు.
ఒంటరిగా బావి లో పెట్రోల్ 'తోడి-తోడి' విసుగు చెంది,
తన భావి జీవితానికి తోడు అవసరాన్ని గ్రహించి ,
తోడు తెచ్చుకుంటే జంటగా తోడుకోవచ్చు, అని భావించి ఇండియా బయలుదేరాడు రాహుల్.
***** ***** ***** *****
స్వాగత-బలాత్కార, సంకర-సత్కార, సాహిత్య-చీత్కారాల చివర రాహుల్ ఇండియా లోని తన ఇంటికి చేరాడు.
వివరంగా చెప్పాలంటే, రాజారత్నం బంధుగణం ఎయిర్-పోర్ట్ లో సెక్యూరిటీ ని బలాత్కరించి లోపలికి దూసుకెళ్ళి రాహుల్కిచ్చిన స్వాగత శుభాబినందనల ని 'స్వాగత-బలాత్కార'ముగా పరిగణించి, ఆ పైన వారు అందించిన బోకే గట్రా వాటిని 'సంకర-సత్కార'ములగ అందుకొని, అటు పిదప వాహనములో అసలే దుబాయి నుంచి వచ్చిన రాహుల్ (ఫారన్ రిటర్న్) ప్రక్కన తమకు దక్కని స్థానానికి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకున్న అచ్చ తెలుగు నిందలని 'సాహిత్య-చీత్కారాల'గా చివరకి ఇల్లు చేరాడు రాహుల్.
(ఇంతోద్దు అనుకుంటున్నారు కదూ, నిజమేనండి ! మనం మామూలు తెలుగు వాడదాము చాలు, నేను ఫిక్స్-- మీరు ఫిక్స్ అవ్వండి, ఇంక భారి తెలుగు వాడన్ !!)
దుబాయి లో పెరిగిన రాహుల్, తెలుగు బుల్లితెరకే కాకుండా తెలుగు నేటివిటీ కి కూడా కొంచం దూరమయ్యాడు. అందుకే చీరలు కట్టుకున్న ఆడవాళ్ళని, లుంగీలు కట్టుకున్న మగవాళ్ళని వింతగా చూస్తుండిపోయాడు రాహుల్. రాహుల్ కి అందరిని పరిచయం చేయసాగాడు వాళ్ళ బాబాయి. ఇంతలో అటుగా వచ్చిన రాజ్యలక్ష్మిని చూపిస్తూ అన్నాడు బాబాయి 'అదిగో ఆ హాఫ్-శారీ' కట్టుకుందే ఆ అమ్మాయే నీ మరదలు మాణిక్యం 'రాజ్యలక్ష్మి' అన్నాడు. ఈ పరిచయ వాక్యంలో తనకు ఎన్నో పరిచయంలేని పదాలని వాడిన బాబాయిని కోర-కోర చూసాడు రాహుల్.
ఏదోకటి మాట్లాడి తను మేనేజ్ చేయాలి అనే ఉద్దేశ్యంతో 'హాఫ్-శారీ' ఎందుకు బాబాయి వాళ్ళు 'పూరా' అన్నాడు. కాదు బావా నువ్వే తెలుగు సంస్కృతీ లో పూర్ 'హాఫ్-శారీ' అంటే వోణి అని తను కట్టుకున్న వోణి చూపిస్తూ సిగ్గు పడింది రాజ్యలక్ష్మి . గతుక్కుమన్నాడు రాహుల్!! అయినా మేనేజ్ చేయాల్సిందేనని మళ్ళి ఇందాక బాబాయి పరిచయ వాక్యాన్ని గుర్తుకి తెచుకుంటూ ఇంతకీ నీ పేరు మాణిక్యమా లేక రాజ్యలక్ష్మినా? అన్నాడు ఫోజు కొడుతూ. ఇప్పుడు గతుక్కుమనడం తక్కిన వారి వంతయ్యింది.
రషీద్ షేక్ |
అంతలోనే చటుక్కున లేచి నుంచొని "పరిచయాలు తరవాత", ముందు మనింట్లో బావి ఎక్కడుందో చూపించండి అంటూ ఇంటి వెనక వైపు కి పరుగు తీసాడు రాహుల్. బావకంటే ముందే బావి దగ్గరికి వెళ్లి నీళ్ళు తోడి బావకి అందించింది రాజ్యలక్ష్మి. బావిలోనుంచి అంత ఫాస్ట్గా నీళ్ళు తోడిన రాజ్యలక్ష్మిని చాలా క్లోజ్ గా వాచ్ చేయడం మొదెలెట్టాడు రాహుల్. సింపుల్ గా చెప్పాలంటే "దుబాయి లో చిన్నప్పుడు రషీద్ ' షేక్ ఆడించాడు రాహుల్ ని', ఇప్పుడు రాహుల్ 'షేక్ ఆడిస్తున్నాడు ఇండియాలో అందరిని'".
***** ***** ***** *****
ఒక నెల గడిచింది మొత్తానికి, రాజారత్నం అడిగాడు రాహుల్ ని రాజ్యలక్ష్మి నచ్చిందా ? అని. కాకపొతే కేవలం మరదలు అన్న ఒకే కారణానికి ఓ.కే చెప్పి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక 'అందరి అమ్మాయిలని పిలిపిస్తే? తను పరిక్ష పెట్టి సెలెక్ట్ చేసుకుంటాను' అన్నాడు తండ్రితో. చుట్టు ప్రక్కల పేరు మోసిన పెద్దవారి పిల్లలని అందరిని పిలిపించాడు రాజారత్నం.
పరిక్ష ఏమిటంటే అంటూ 'కాలజ్ఞాన గ్రంధాన్ని బావిలోకి జార విడి'చాడు రాహుల్. రాజారత్నం గుండె ఝల్లుమంది. అక్కడున్న వారందరూ ఒక్క క్షణం అవాక్కయ్యారు. ఇవేమీ పట్టించుకోకుండా కంటిన్యూ చేశాడు రాహుల్.
"ఎవరయితే కాలజ్ఞాన గ్రంధం కనపడేవరకు ఈ బావి లో నీళ్ళు తోడతారో, ఆ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను" అని ప్రకటించేశాడు. ఇలాంటి పరీక్ష ఇంతవరకు వినక పోవడం మూలాన సగం మంది మావల్ల కాదు అని వెళ్ళిపోయారు. మరి కొంతమంది చూస్తూ చూస్తూ దుబాయి సంబంధం వదులుకోలేక 'తోడ'టానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రయత్నించినవారందరి చేతులకి ఉచితంగా కట్లు కట్టించాడు రాహుల్. 'రాహుల్ బావ' బావి పోటికి అందరూ వోడిపోయిన రాజ్యలక్ష్మి మొక్కవోని ధైర్యంతో తోడసాగింది. రాజారత్నం తో సహా అందరూ ఎంకరేజు చేస్తున్నారు ఆమెను. రాజారత్నం చాలా ఆత్రంగా చూస్తున్నాడు 'కాలజ్ఞానం గ్రంధం ఎప్పుడు బయటపడుతుందా?' అని, మిగిలిన వారంతా ఎదురు చూస్తున్నారు 'రాహుల్ తో దుబాయ్ కి వెళ్ళే ఛాన్స్ రాజ్యలక్ష్మికీ దక్కుతుందా ?' అని. కొంతసేపటికి రాజ్యలక్ష్మి కూడా మూర్చబోయింది...
అంతే పోటి అంతటితో ముగిసింది అనుకున్నారు అందరూ, కాని రాజారత్నం మటుకు రామసీతకి పని పురమాయించాడు మొత్తం నీళ్ళు తోడమని, కాలజ్ఞానం బయటకు తీయమని. రాజరత్నం మీద ఉన్న భయంలాంటి భక్తితో, 'చివరాఖరికి మొత్తం నీళ్ళు తోడేసింది, కాలజ్ఞాన గ్రంధాన్ని వెలికి తీసేసింది' రామసీత. బావి అన్నా, తోడటం అన్నా మైమరచిపోయే రాహుల్ కి, సులువుగా నీళ్ళు తోడేసిన రామసీత పై బాగా ఇంప్రెస్స్ అయ్యాడు.
కాలజ్ఞానం మళ్ళి తన వశమయినందుకు హమ్మయ్య అన్నాడు రాజారత్నం , ఒక్క అమ్మాయి అయినా పోటిలో గెలిచినందుకు వావ్! అన్నాడు రాహుల్. కొడుకు తెలివితేటలకి మురిసిపోకుండా ఉండలేకపోయాడు రాజారత్నం, ధన్యవాదాలు తెలుపుకున్నాడు కాలజ్ఞాన గ్రంధానికి.
రాహుల్ కి తోడేసే తోడు (భా(బా)వి భార్య) దొరికింది, రాజారత్నానికి కాలం చేసిన జ్ఞానం మాత్రమే మిగిలింది
good one ;-)
ReplyDeleteThanks.
DeleteOMG .. kalagnananiki intha pedha definition aa .. ?
ReplyDeleteOntariga Petrol thodi thodi .. thodu kavalanipinchindhi :)
ela vasthunnai inni ideas ?
Swagatha - Balathkara , thats whole sentence is toooooooooooooo good :)
accidents happens sometimes, we can't avoid.
Deletethanks for your time and encouragement...
keep reading..
హై,
ReplyDeleteదుబాయి లోని పెట్రొల్ బావులని ఇండియా లోని ఆడపిల్లలే తోడగలరు , తోడుగా ఉండగలరు అని నిరూపించినందులకు , కాల ఙ్నానానికి ఓ కొత్త అర్ధం తెలియచేసినందులకు సంతోషం .
హాస్యంగా వుంది .
శర్మ జీ ఎస్
హైదరాబాద్
thanks for your encouragement.. ;-)
Deletehmmm!! hilarious story. Very nice!! After reading the story ,I can feel that even clarity is improved in the story. I really liked it!
ReplyDeleteThanks..!! continue reading.. ;-)
Delete