June 12, 2013

విసుగు వేసారి

కవిత రచన : సాత్విక

ప్రియురాలి ప్రేమని పొందలేని ప్రతిసారి,
ప్రయత్నించే ప్రియుడితో 'విసుగు' వేసారి,
అడిగెను విడిచిపెట్టమని కొసరి కొసరి,
కానీ ఆ ప్రియుడు 'విసుగు'ని నెట్టేను కసరి,
'విసుగు' ముంగిట ఇక చీకటి ముసరి,
ఆ ప్రియుడు చూపెను తననే తనకి మరీమరి,
అలా తనని తను రుచి చూసిన ప్రతిసారి,
కక్ష బూని అనుకొనెను 'ఇది అవ్వాలి తనకి కడసారి',
కానీ, ప్రతి ప్రేమ జంట వరస తలచి తన ఉత్సాహం చేజారి,
ఆ పై తను సేద తీరెను, ప్రియుడే మొగుడైన ఆతని చెంత చేరి 

6 comments:

  1. మొగుళ్ళ విసుగు వెనక కారణం ఇది అన్నమాట... బాగుంది.

    ReplyDelete
    Replies
    1. తప్పించుకోడానికి చెప్పే కాకమ్మ కబుర్లు ... అంతే !!

      హ హ !! థాంక్స్ .

      Delete
  2. విసిగి వేసారి సేదతీరెనుగా....కధ సుఖఃఅంతమాయె :-)

    ReplyDelete
    Replies
    1. కదా మాత్రమే మన చేతుల్లో వుంటుంది కదా అన్ధుఎ సుఖాంతం చేసేసాం.... ;-)

      థాంక్స్ పద్మ గారు !!

      Delete
  3. Entha busy schedule lo entha bhaavukatha ela possible? Any special reason? ;)

    ReplyDelete
    Replies
    1. nothing special ... ఈ సారికి ఇలా కానిచ్చేసాం అంతే ....

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు