October 23, 2013

బల (వంతపు) పరీక్ష ..

కవిత రచన : సాత్విక

'నా'  అనే  'నా ఈ మనస్సుకు' లేనే లేదు ఏ ఆకారము
దాన్ని గుర్తించటానికి నాది కాని ఈ 'శరీరమే' శ్రీకారము ..

'పైకపు' పట్టుబిగించి కావాలన్నారు ఆ శరీరపు  సహకారం 
సరదాల పరదాలో కానిచ్చేస్తునారు మనస్సుని కూడా 'అత్యాచారం '

' వృక్షో రక్షతి రక్షితః ' అన్నది అలనాటి అశోకుడి నానుడి 
అందులోని క్రావడి ఎత్తివేసినదే కాదా నా ఈ 'సోకపు అంగడి'

ఏర వేయడానికి చేసినాను, నా శరీరానికి ఈ  కల్పిత అలంకారము
ఎదురీతలో,  'మనస్సులోనే మూగబోయినది నా అసంకల్పిత ప్రతీకారము '

' గుండెలు పిండేసిన బాధ ' నా మనస్సులో దాగున్న మౌనానిది
' అవిసిన గుండెల గాధ ' మౌనమునే ఆశ్రయించిన ఆ మనస్సుది

దేహముని విడువక, నాకు ప్రాణముండి మాత్రము ఏమి ప్రయోజనము ?
నా మనస్సు నన్నే విడచి పరిగెడుతోంది  ప్రతి రోజు నూరుయోజనము

' మౌనము అర్దంగీకారం ' అన్నదే పెద్దలు చెప్పిన ఉపమానమా ?
అర్దాంగి ఆకారమే మౌనముగా రూపు దాల్చినదే  ' ఈ నా జీవితమా '

' స్వర్గాన్నే కోరుతున్నవారు అందరూ ', చవిచూపిస్తున్నారు నాకు నరకము
అవసరాల ఆత్మీయత సాక్ష్యముగా ప్రతి ఆడపడచు చెల్లిస్తోంది ఇదే సుంకము

' మానసిక వ్యబిచారమే నైతిక విలువల నజరానా ', అని వినవస్తోంది నవసమాజమున
తరచి చూడు, సాగిస్తున్నారు ప్రాణమున్న శవాలతో సంసారము అడుగడుగునా 

చిక్కదు  ఏ ఒక్కరికీ  ' దేహాన్ని విడచిన అనంతరం, ఆత్మ యొక్క చిరునామా '
అందుకే   బ్రతికుండగానే   చేసేస్తున్నా నిరంతరం నా  మనస్సుకీ  ' పంచనామా '

4 comments:

  1. "చిక్కదు ఏ ఒక్కరికీ ' దేహాన్ని విడచిన అనంతరం, ఆత్మ యొక్క చిరునామా '
    అందుకే బ్రతికుండగానే చేసేస్తున్నా నిరంతరం నా మనస్సుకీ ' పంచనామా "'....
    మీమంతా చేస్తున్నదే ఈ హంగామా....మీకు దొరికితే ఇవ్వండి మాకా చిరునామా.:-)) వేదాంత ధోరణి ఎక్కువవుతున్నట్లుంది కదా....

    ReplyDelete
    Replies
    1. వేదాల అంతం చూడడమే వేదాంతం అయితే నేను వేదాంతినే (మనలో మన మాట )..... ష్...ష్

      ;-)

      Delete
  2. కవిత బాగుంది సాగర్..
    ఇదిగో సాగరు గారు నా చెవిలో చెప్పెయండి మీరు వేదాంతాలు ఎక్కడ నెర్చుకున్నారొ(ఈ secret ఎవరికి చెప్పన్లెండి).. కొంచెం నేను కూడా నెర్చుకుంటాను:-):-):-) hha hha..

    ReplyDelete
    Replies
    1. బలవంత పెట్టకండి, ఎగిసే అలలతో మేము కొత్తుకుపొతాము ....

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు