కవిత రచన : సాత్విక
నీవు,నేను' అనేవి మరచి మనం అనుకున్నా
నాలోని చెడుని తనకోసం వదులుకుంటున్నా
'నన్ను' నేను గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నా
సమన్వయంతో సమన్యాయం నే సంధిచేస్తున్నా
ఆటు పోటులు అన్నిటినీ నావని ఆనందించేస్తున్నా
బ్రతుకులోని అన్ని భాధ్యతలని నేనే కూడుకుంటున్నా
'నాకు-నేను' అన్న స్వార్దాన్ని నా నుండి తీసివేస్తున్నా
'తనవారుని నావారు'గా జీవిత బంధాలు హెచ్చవేస్తున్నా
భారమనిపించిన బాధలన్ని సంతృప్తి తో భాగించేస్తున్నా
జీవనసంగ్రామములో సోంత లెక్కలు మరచిపోయానంటున్నా
**** ***** ***** *****
స్వార్ధం ఏకాంతముగా 'తన'తో కళ్ళగంతల ఆట ఆడేస్తున్నా
తననే గెలిపిస్తూ 'తన సుఖమే' తనకి బహుమతిగా ఎరేస్తున్నా
'పుష్కర సమయం' పుసిక్కున తిరిగోచ్చేసానని నాతో అంటున్నా
'నీవొద్దు నీడబ్బు కావాల'న్న పతాక సన్నివేశం పరిచయం చేస్తున్నా
ఆహా! భళా! విధి విశ్వరూపముగ తననావహించిందా అనుకున్నా
'భవిష్యత్తు' 'పగ - ప్రతీకారం' అనూహ్యముగా నాతో పందెం కాస్తున్నా
బలహీనమైన క్షణాల ఆసరాగా స్వార్ధమే సరికొత్త ఆటకి ఆహ్వానిస్తున్నా
నిశ్చేష్టుడనై అచేతనమైన స్థితికి చేరువులోకి నా మనస్సు చేరుకున్నా
'పిల్లలు' అన్న బంధమే వివేకముగా నాలో మమైకమై బుజ్జగిస్తున్నా
స్వార్ధపు ఆహ్వానాన్ని కాలదన్ని 'విడాకుల'తో పనిలేదని సర్దుకుపోతున్నా
విడివడిన మనస్సులతోనున్న నా సొంతమైన మనస్సుని చంపేస్తున్నా
ఆధునిక తరానికి విన్నపము :
వీలుంటే సర్దుకు పోండి లేకుంటే 'మీ మనస్సుని చంపేసుకోండి ' ... పిల్లలు అనే భవిష్యత్తు మరచి విడాకుల జోలికి పోకండి. 'ఆధునికత' అనేది మన ఆలోచనలో వుండాలి, అంతే కానీ అనాగరికులలాగ ఎవరిదోవ వారు చూసుకొని పిల్లలకి న్యాయముగా అందాల్సిన 'పితృ మాత్రు' ప్రేమలలో ఒకదానికి మాత్రమే పరిమితం చేయవద్దు... వారి మానసాలతో ఆడుకోవలదు..
అక్షర సత్యం మీ మాట, బిడ్దల బవిషత్తు నాశనము చేసే హక్కు పెద్దలకు లేదు. వారిని భూమి మీదకు తేకముందే ఆలోచించుకోవాలి. చక్కటి కవిత కనువిప్పు కలగాలి అలాంటి వారికి.
ReplyDeleteకలహాన్ని భరించే శక్తీ కలిగిన
Deleteవిరహాన్ని దరిచేరనీయ ఆలోచన
చేస్తే మంచిది ....
ఆడదాని ఉద్యోగం భరోసా కావాలి కానీ బలుపు కాకూడదు
మగవాడి అహం ఆత్మగౌరవం పెంచుకోటానికి వాడాలి కాని తనవారిని అణిచి పెట్టటానికి కాదు .....
ప్రస్తుత సమాజములో సమతుల్యత లోపించి ఆలోచనా ధోరణి విపరీత పోకడలు పోతోంది... అని నా అభిప్రాయం అందుకే ఇలా చెప్పాలి అనిపించింది ....
Thank alot mam for the supporting words and inspiration with your vision ...
చంపేద్దాం అవసరమైతే అంటే హడలి చచ్చాను.....ఇంత చక్కని ఉపయుక్తమైన పోస్ట్ అనుకోలేదు. చప్పట్లు మీకు
ReplyDeleteహా హా ..... ఏదైనా హింసాత్మక ధోరణితో మొదలు పెట్టకపోతే చదివేవారు కరువయ్యారు ... కలికాలం అందుకే ఇలా మొదలెట్టాల్సి వచ్చింది ......
Deleteనా కవితని బలపరుస్తూ మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచినందుకు ధన్యవాదములు ....
మీరు చెప్పింది అక్షరాల నిజం. చక్కగా చెప్పారు. చిన్న చిన్న విషయాలకి విడిపోవటం తప్పే
ReplyDeleteఅలాగని విడాకులకి దారితీసే ప్రతి విషయం చిన్నది కాకపోవచ్చు, విడాకుల విషయంలో అందరి పరిస్తితులు ఒకేలాగ ఉండవు, పరిస్తితులను బట్టీ నడచుకోవాలి.
పై తరానికి ఇప్పటి తరానికి అంతరాన్ని పోల్చుకుంటే ...." బాధని భరించాలి అంతిమం వరకు అన్న ఆలోచనే కొరవడింది" అన్నది నగ్న సత్యం.
Deleteబాధని భరించడం (తప్పనిసరి పరిస్థితులలో) అంటే ఉత్తమమైన/ ఉన్నతమైన దృక్పధం అన్నది ఈ తరానికి బొత్తిగా అర్ధం కాకుండా పోయిన అంశం ..
ప్రాణాంతకమైన పరిస్థితి కానంతవరకు (పిల్లలు కలిగి వున్నా యెడల ) బాధని తొలగించుకోవడం లోని ఉన్నతమైన విధానమే భాదని భరించడం అన్నది నా ఆలోచన ...
అందరి పరిస్థుతులు ఒకేలా వుండవు అన్నది వాస్తవమే ... కాకపోతే మనస్సు చంపుకునేవరకు విడాకుల జోలికి పోక .... పిల్లల భవిష్యత్తు దృష్టిలో వుంచుకొని మెలగండి ...స్వార్దాన్ని విడనాడి అన్నది నేను చెప్పాలి అనుకున్న అంశం ...
ఏమైనా నా ఆలోచన విసదీకరించడానికి మీరు ఇచ్చిన అవకాసమునకి కృతఙ్ఞతలు ...
మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదములు.. ;-)
Very very good msg!! U have expressed each and every point in a right way..... Hats off.........
ReplyDeleteThank you Vidya.
DeleteNice message Sir.
ReplyDeleteThank you Jayant.
Delete