గీత రచన : గుంటూరి
నీ కొంటెచూపే ఎదురుగ నిలుచుందిగా …
నన్ను చేరి నిలదీసినట్టుగా ….
నాకు నేనే కనిపిస్తున్నానే అదో ఇదిగా…
సిగ్గుపడుతున్నట్టుగా….
' ఏమిటో ఈ మాయ ' ఇలా తగులుకున్నది…
గుర్తు పట్టలేనట్టుగా ….
నన్ను నేనే గుర్తు పట్టలేనంతగా ….
కంటి చూపుదొక ప్రేమ ..
మూగ మాటదొక ప్రేమ ..
చేతి స్పర్శదొక ప్రేమ ..
ఆశలోని శ్వాసే ప్రేమ ..
నవ్వులోని స్వచ్చతే ప్రేమ ..
ఇంద్రియాల పరవశమే ప్రేమ …
నీ కొంటెచూపే నా కంటికెదురుగా నీవులా నిలుచుందిగా…
' ఏమిటో ఈ మాయ ' ' అసలేమిటో ఈ మాయ ' ….
వానజల్లు లోని చినుకేదో నను పిలచిందిగా …
తనతో నీవు చిందేయగా ….
ఆ చినుకు లోనే నేను తడిసి ముద్దయినట్టుగా …
అనిపిస్తోందిగా అలా అలా ….
' ఏమిటో ఈ మాయ ' ఇంత తీయగున్నది …
తేనే పూసినట్టుగా ….
తేనేతోనే స్నానం చేస్తున్నట్టుగా ….
పరవశించే భావమే ప్రేమ ..
పరిమళించే సువాసనే ప్రేమ ..
ఊహల సమ్మేళనమే ప్రేమ ..
ముచ్చటైన ముద్దే ప్రేమ ..
అందమైన ప్రకృతే ప్రేమ ..
జ్ఞానేంద్రియాల మైమరపే ప్రేమ
వానజల్లు లోని చినుకేదో నిన్ను నన్ను తనతోటి చిందేయమందిగా …
' ఏమిటో ఈ మాయ ' ' అసలేమిటో ఈ మాయ ' ….
Very nicely presented
ReplyDeleteTitle ki try చెయ్యాలని అనిపించింది ....అందుకే ఇలా ప్రయత్నించా
DeleteThank you...