కవిత రచన : సాత్విక
నిద్రలో నిజమెంత అని నలుగురిని నేను ప్రశ్నిస్తున్నా,
కలలో కనిపించిన నిన్ను నిజమేనని ఇలలో వెతికేస్తున్నా,
అలై పరిణమించాక తీరం చేరుటే లక్ష్యముగా సాగునుగా,
కలై దర్శనమిచ్చాక సాగకుందునా నువ్వే నా ధ్యేయముగా,
మేఘమైన గుర్తుపట్టదే తన నీటిచుక్కని నడిసంద్రములోన,
నేను మాత్రం నిన్నే చేరుకుంటా ఎక్కడున్నా జనసంద్రములోన,
ఆకలి దప్పులు మరచానే జత కోరుతున్న 'నా ఈ మనస్సే' నీదిగా,
ఆలోచనే పొలమారుతున్నది తర్కానికి.. 'నీవంటే నేనే' అంటోందిగా,
నిను తలచి.. పాలపుంతలోని 'వేగుచుక్క వెలుగే' విలపించే.. నా చెంత,
అందుకే కొత్తపుంతలు తొక్కుతోంది నా మనస్సు నిన్ను తలచినంత,
'రాత్రీ-పగలు' తేడా లేదే నీకై పరితపిస్తున్న నాలోని ప్రతి ఆలోచనకి,
'జ్ఞాపకమే గతమంటే' 'ఊహలే భవిష్యత్తంటే' 'వాస్తవం నీవే'లే నిజానికీ,
ఎచ్చోట దాగున్నావో ? జతే చేర నీకింక జాగు ఏల ? అని అడుగుతున్నా ?
ఈ కవ్వింతల దాగుడుమూతలలో ఎప్పటికైనా గెలుపు నాదేనని పయనిస్తున్నా ...
మంచి భావుకత,ఆశాభావం ఉందీ కవితలో,
ReplyDelete"నిను తలచి.. పాలపుంతలోని 'వేగుచుక్క వెలుగే' విలపించే.. నా చెంత,
అందుకే కొత్తపుంతలు తొక్కుతోంది నా మనస్సు నిన్ను తలచినంత", ముఖ్యంగా ఈ పంక్తులు అద్భ్తంగా ఉన్నాయి. సాగరతీరాన సాత్విక మానసిక కెరటాలు ఎగసి పడుతున్నాయి.
ధన్యవాదములు ఫాతిమా మేరాజ్ గారు
Deleteఅద్భుతంగా అని నా అభిప్రాయం "అప్పుతచ్చు" కు మన్నించ ప్రార్దన.
ReplyDeleteReally touching. Super sir
ReplyDeleteThank you Jayant
Deleteచాలా బాగుంది...
ReplyDeleteThank you వెన్నెలా జీ
Delete