కవిత రచన : సాత్విక
భావమే జీవంగా భాష్యమే వర్ణముగా కుంచెకు చేకూరే అధ్వేషణ,
చిత్రపఠముగా నిలచినంతట మనస్సుకైనా తప్పని అనుసారణ,
ఉద్వేగభరితమైన ఆ మనస్సుకి కలిగెను భావోద్వేగానికి ప్రేరణ,
పెల్లుబిక్కిన భావ సంగ్రామము ప్రారంబించే సంధికై అన్వేషణ …
తన మనసులో నిమిడీకృతమైన భావాల సంఘర్షణ,
భావానికీ భావానికీ నడుమ జరిగిన ప్రతి "సంభాషణ",
సంతసించే పదాలుగా నిలపి తను చేకూర్చిన సంరక్షణ,
'మనిషి'లో ప్రతి భావనకి నిలచె తన మనస్సే ఓ ఆకర్షణ …
భావవ్యక్తీకరణకై ప్రతి "పదం" తన పిలుపుకై చేసేను నిరీక్షణ
పదము పదము అనిపించెను వర్ణమాల అక్షరాల అనుసరణ
సేదతీరే ఆ పదమునే మురిపించే పద పొందికలోని అలంకరణ
'బంధన భాగ్యమే దొరకని ప్రతి పదం' కోరుకొనెను తన ఆదరణ…
అందంగా అక్షరాలని పేర్చారు
ReplyDeleteమరి పద్మార్పితగారి గురించి రాస్తే ఉండదా మరి .... ఆమె కవితలా దానిలోని భావములా ఆపై ఆ చిత్రములా .....
DeleteThanks అండీ
Good One
ReplyDeleteఅక్షరాల పొందికా,భావ పరిపక్వతా చాలా బాగుంది. మీరు చాలా అద్భుతంగా రాయగలరు అందుకు ప్రేరణ సాటి కవయత్రి కావటం హర్షదాయకం
ReplyDeleteప్రోత్సాహం అనేది ఎప్పటికీ కొత్త ఊపునిస్తుంది. ధన్యవాదములు..
DeleteNice kavitha for a beautiful image!! Knowing in depth meanings of Telugu words with ur poetry... :)
ReplyDeletelearning always gives pleasure.....
ReplyDeleteThanks for enjoying the content....