September 20, 2013

మోక్షము అంటే ?

వ్యాస రచన : హృది

"మనస్సు" అనేది విచిత్రాతి విచిత్రమైన ఒక యదార్ధము. యదార్ధము అని ఎందుకన్నాను ? అంటే,  పదార్ధము అనడానికి దానికి రూపం లేదు అని నా అభిప్రాయము.

అయితే ఈ మనస్సుకి మరియొక్క నామధేయము 'చిత్తం' అని కూడా అనెదరు. కాకపోతే చిత్తం అనిన మరియొక అర్ధము 'అంతరంగమున నిమిడీక్రుతమైన ఆలోచన '. ఈ రెండవ అర్ధము 'మనస్సు యొక్క స్థితిని' తెలియజేయు క్రియాపద తాత్పర్యముగా కూడా మనకు అనిపించును. మనిషిగా రూపు దాల్చినంతనే శరీరము కనిపించు ఆకృతిగాను,  మనస్సు అనేది ఈ శరీరముని నడిపించు అశరీర శక్తీగాను,  చెలామణి అవ్వడం ప్రారంబించును.

మనస్సు యొక్క ప్రధానమైన లక్షణం ఆచరణ( ఆచరణ ఎందుకనగా దానికి కాలమే కారణం ). ఆచరణకై తనకి అందుబాటులోనున్న అన్ని వనరులని  ఉపయోగించుకోనుటే దీని యొక్క మరియొక ముఖ్య లక్షణం. మనస్సుకి  అందుబాటులోనున్న వనరులలో మెదడు అనేది అత్యంత ముఖ్యమైనదిగా అనుకోవచ్చు. మెదడులో నిక్షిప్తమైన విషయాలలోని ఒక అంశముని ఎన్నుకొని మనస్సు చేపట్టిన ఆచరణ యొక్క విశేషణమే మనము 'బుద్ధి 'గా గుర్తించెదము. సేకరించిన ఎన్నో విషయాలని నిక్షిప్తము చేసుకొనే స్థానమునే మెదడుగా గుర్తించిన మరో అంశము. మనస్సు కేంద్రీకరించిన ప్రస్తుత అంశము/విషయమునే మనము ఆలోచనగా పిలుస్తాము. ఇవి అన్నియూ  ఒక చక్ర ఆధారభూతమైనటువంటి   విషయాలు (cyclic dependant). 'మనస్సు'  'ఆలోచన'  'బుద్ధి'   'స్థిర చిత్తం' ఇలా కొన్ని ముఖ్యమైన విభాగాములతో ఒక చక్ర సంబంధిత (cyclic) ప్రమాణాల పై పట్టు సాదించుట కొరకే ఏర్పడిన విధానాలు పలు రకములు వాటినే మనము (అ)ధర్మముగా / (అ)నైతికము / ఆచారము / కట్టుబాట్లు వగైరా వగైరా ....

అయితే ఈ మోక్షమునకి మనస్సుకి సంబంధము ఏమిటి ? అంటే "మోక్షము" అనిన  నా మాటలలో ::
మోక్షము అనబడేది ఒక 'స్థితి'గా నేను గుర్తిస్తాను (బహుశా ఆ స్థితిలో ఈ మనస్సు అనే శక్తీ నిర్వీర్యమగును (saturation) అని నా ఊహ / కల్పితము).

అయితే ఈ స్థితిని ప్రతి యొక్క కోణములో వర్ణించుట/వివరించుట చాలా కష్టమని నా అభిప్రాయము. లోతుగా పరిశీలించుట అనునది అంత మంచిది కాదు (should not start analyzing just like that , because it may lead to end in crazy feel). కాకపోతే ఈ 'మోక్షము' వివరించుట ఐహికమైన వాక్యములలో బహు తేలిక అని కూడా అనుకొంటూ ఉంటాను. ఒక్క పదములో వివరించాలంటే మోక్ష స్థితి అనిన 'స్వాంతన' స్థితి (  రాగాతీతముగనున్న\నిశ్చల స్థితియే మోక్షము).

మనస్సుకి ఏమిటి సంబంధము ? అంటే, ఈ నిశ్చల స్థితి సంక్రమించవలసినది నీవు అని గుర్తించబడుతున్న 'నీ' అనుకుంటున్న ఆ 'మనస్సు'కే .  మరి బుద్ధి, మెదడు ....ఇవన్నీ ఏమిటి? అంటే ఇవి అన్నియూ  మనస్సుకి అందుబాటులోనున్న సాధనాలు. 

మరి దేవుడు/పుణ్యము/పాపము/ఇతిహాసములు/ వగైరా వగైరా ... ఏమిటి ?

ఇంతవరకు మనము అనుకున్న ఆ 'స్వాంతన' అనే స్థితి యొక్క మూలాధారము రాగాబద్దత/రాగాతీతము. "స్వాంతన అనేటువంటి స్థితి" చేరుకొనుటకు మనస్సు పయనించిన మార్గమునకి అతీతముగా నుండును. 'ఎందుకు?' అనే ప్రశ్న తల ఎత్తిన యెడల " రాగ బద్ధము కాని స్థితి" అదియే కదా అందును.

కాకపోతే మరి ధర్మ బోధనలు, పుణ్యం ,పాపం, మంచి,చెడు, ధర్మమూ, అధర్మము వగైరా వగైరా అన్నియునూ ఈ 'మనస్సనే' ప(య)దార్ధమునకు వికట భావములు కలిగి ఇతర మనస్సులకి ఆటంకం కలిగించకుండుటకై అసంకల్పితముగా 'స్వీయచింతన/ స్వీయనియంత్రణ'  జరుగుటకు ఏర్పరచిన 'విధానములు/సాధనములు' అనునది నా యొక్క భావము. 

ఆధ్యాత్మికత, ధ్యానం, భజన , ఆరాధన ఇలాంటి ప్రక్రియలు 'స్థిర చిత్తం' అనేటువంటి స్థితిని చేరుటకు ఉపయోగించు సాధనములు. 'స్థిర చిత్తం' తదుపరి ఘట్టమే 'స్వాంతం' అని నా అభిప్రాయము (may discuss later).

రాగాతీతము/స్వాంతం అంటే ఏమిటి ?
సత్త్వరజస్తమో గుణాలనే వికారాల నుంచి విముక్తి చెందిన (మనస్సు) అని నేను అర్ధం చేసుకొన్న విధానము. ఐతే రాగబద్దము/రాగాతీతము అనే స్థితికి నైరాస్యము లేక నిర్వేదము లేక అచేతనము అనేటువంటి వాటితో ఎటువంటి సంబంధము లేదు వాటి ప్రస్తావన వేరొక మారు చేయ ప్రయత్నించెదను.

రాగాతీతము కలిగినటువంటి కొన్ని ఉదాహరణలు నాకు అనిపించినవి ప్రకృతి, దేవునిగా మనం కొలుచుకునే శక్తీ , కాల ప్రవాహం (మరణము అను ఒక క్రియ , పుట్టుక అనే ప్రక్రియ) ....ఇలా అందుకే మనము అనే ఈ మనస్సు కూడా ఆ స్థాయిని చేరుకోనుటే మోక్షమని నా అభిప్రాయము.... నాకు అనిపించునది ఏమనగా మోక్షం సాదించలేము అది కేవలం సిద్దించవలెను ... 

"చేయువాడు ఎవరు? చేయించు వాడు ఎవరు ? నీవు కేవలం నిమిత్తమాత్రుడివి" -- ఈ వాక్యముని అర్ధం చేసుకొని ఆ భావాన్ని మమైకం చేసుకోన్నంతనే మోక్షము సంప్రాప్తించును అని నా strong feel.

అందుకే నాకనిపించును దైవ/నాస్తిక వాదన ప్రతివాదనలు సమస్తమూ రాగయుక్తమని. దైవ సంబంధమైన భావన కొంతవరకు మేలు ఎందుకంటే ఇతరులకి కీడు తలపెట్టే ఆలోచనని స్వీయనియంత్రణ గావించును. నాస్తికత లో పరిపక్వత లోపించినచో ఇతరేతర మనస్సులకి నష్టం వాటిల్లే ప్రమాదము ఎక్కువే. 


మరిన్ని భావములు పంచుకోనవలెను అని ఉన్ననూ (Thanks for bearing me until this point) ఈ వ్యాసము సుదీర్ఘతని దృష్టిలోనుంచుకొని  పైన  పలు సందర్భములలో లోతుగా కాక పై పైన మాత్రమే కొన్ని భావాలు వ్యక్తపరచాను (I know some of my friends are happy about it). వీలు కుదిరినప్పుడు వ్యక్తీకరణ చేయుటకు ప్రయత్నిస్తాను (sorry for this). నా భావమును పంచుకొనుటకు నేను చేసిన ప్రయత్నమే ఇది. నాకు అవగాహన లోపము ఉండి ఉండవచ్చు క్షంతవ్యుడను , విజ్ఞులు మన్నించగలరు (Thanks alot for this).

6 comments:

 1. Anonymous9/20/2013

  Nice point of view. Enjoyed reading it.

  ReplyDelete
 2. " దైవ సంబంధమైన భావన కొంతవరకు మేలు ఎందుకంటే ఇతరులకి కీడు తలపెట్టే ఆలోచనని స్వీయనియంత్రణ గావించును. నాస్తికత లో పరిపక్వత లోపించినచో ఇతరేతర మనస్సులకి నష్టం వాటిల్లే ప్రమాదము ఎక్కువే. "

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు

   Delete
 3. దైవభక్తి మనిషిని తప్పుచేయకుండా ఆపుతుంది.(కొంతవరకూ) మీ పోస్ట్ చాలా ఉన్నతముగా ఉంది.

  ReplyDelete
  Replies
  1. (మోక్షము) రాగాతీతము అనునది ఎంతో ఉత్తమమైన స్థితి. ఆ స్థితిని చేరుకోన పలు మార్గములలో పయనం ప్రారంబించి, తమ తమ మార్గములని ప్రేమించ ప్రారంబించి రాగబద్దమై తమ ఉనికి చాటుకొనే ప్రయత్నమునందు అహం అనే గిరి గీసుకొని ఒంటరి వారై పయనించుట ఆరంబించిన తత్త్వం (భక్తి లో ) సమాజములో ప్రతి మూల కనపడుతున్న సత్యమని నాకు అనునిత్యము అనిపిస్తూ వుంటుంది.

   మీ యొక్క స్పందనకు ధన్యవాదములు.

   Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు