September 16, 2013

నా శ్వాస... నా ఆశ...

కవిత రచన : సాత్విక

ఊపిరి ఊహల ఊసులే.. విన్నా 
ఊహల ఊసుల వూపిరి నీవెనా

ఆశల  ఆ కలే  అలలై పొంగెనా ?
వేలుపే నిను పంపెనా?  దీవెనగా..

నాకే  ఏమిటో ? అసలేమిటో ?  ఎందుకో ? ఈ వరాల వెల్లువా 
ఉప్పెనో !  ఊహాతీతమో !  కళ్ళెదురుగా నిలచనే నీవుగా !!

నా శ్వాసలో చెలరేగిన ఈ ఆశల సవ్వడే నీలా రూపు దాల్చెనో ?
నా ఆశలో పెనవేసిన ఆ శ్వాసల నిట్టూర్పులా.. ప్రతి రూపానివో !!

ఏమనుకోను ?  ఏమి మానుకోను ?  నా ఆశనా  లేక  నా శ్వాసనా  
ఆశించి శ్వాసించనా ? శ్వాసించి ఆశించనా ? 
నా ఆశ ... నా శ్వాసా ... రెండూ  నీవే ప్రియతమా 

6 comments:

  1. శ్వాసలో దాగిన ఆశ ప్రేమ :-)

    ReplyDelete
    Replies
    1. కాదు అనేది ఏదీ మీరు చెప్పారుగా... :-)

      Delete
  2. నా ఆశ ... నా శ్వాసా ... నా ధ్యాసా , ఈ మూడూ నీవే ప్రియతమా !

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు...

      Delete
  3. Ok!! నీ ఆశ మరియు శ్వాస ఎవరో తెలుసుకోవచ్చా? :) ఇలాంటి గీతాలు ఎన్ని పాడుకున్నావు collage days లో? very nice.... can't believe that u have such sensitive feelings..... ;)

    ReplyDelete
    Replies
    1. నా ఆశే నా శ్వాస నా శ్వాసే నా ఆశ ... అంతే....
      the word "sensitive feeling" in your comment gave me an immense pleasure... because the poem's sensitivity gets highlighted with that word.....

      anyway thank you very much...

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు