September 7, 2013

వై దిస్ కొలవెరి ?

కవిత రచన : సాత్విక

నా ఆయువే లేకుండా ఉన్నట్టుందే తనేదూరమైతే
ప్రాణవాయువుతో పనే లేదంటోంది తనేప్రక్కనుంటే

దూరానున్న ఆ నీరే మేఘముతో  ఘర్షించకుంటే
'వాన చినుకై'  ఆ దివినుండి ఈ భువికే చేరకుంటే
తిరిగి ఆ జలమే  వేడితో రమించి ఆవిరే కాకుంటే

                    ఘర్షణా,గమనం,సంగమం 
             కలబోసిన జీవనచక్రం ఇదేనంటుంటే
తనే దూరమై ఈ ఎడబాటు నన్నే ఆణువణువూ దహించేస్తున్నా
ఘర్షణలోనిదే ఈ భాగమనుకొని ఆనందముగా అనుభవిస్తున్నా

'అమ్మతనం రుచే చూపించింది' తన తలంపుతో నేను కన్న ప్రతి కలా
అదే కలలో అద్భుతమే కనిపించే తనతో నా ఈ జీవితానికి ప్రతీకలా ... 




ఘర్షణ = జీవన పోరాటం, వొడి దొడుకులు, ఆలోచనా-ఆచరణ, అంతరాత్మ...
గమనం = ఉచ్వాస నిచ్వాసం, కాల ప్రవాహములో జీవన గమనం ... 
సంగమం = కంటి చూపు చిత్రముతో, బుద్ధి వాస్తవముతో, ఆలోచన పరిస్థితులతో ...  

16 comments:

  1. hmmm!! good one!! మళ్లీ మళ్లీ కాల్ చేసే పని లేకుండా మీనింగ్స్ కూడా పెట్టేసావా? ;) very nice...

    ReplyDelete
    Replies
    1. not for the call... just like that given meanings for my satisfaction....

      Delete
  2. " ప్రాణవాయువుతో పనే లేదంటోంది తనే ప్రక్కనుంటే " ఎంత చక్కటి పదపొందిక . ప్రేమ పరాకాష్టకు చక్కటి
    ఉపమానం .

    ReplyDelete
  3. Anonymous9/08/2013

    ముందిలాగే ఉంటుంది బాబూ. తరవాత తెలుస్తుంది :)

    ReplyDelete
    Replies
    1. మీ మాటని కాదని ఎలా అనగలం sir జీ ...
      ;-)

      Delete
  4. ముందే కాదు మాస్టారూ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది, ఎక్కడో తెలుసా భావుకతలో..జీవితములో కొంత లోపిస్తుంది, దాన్ని పూరించేదే ఈ అక్షర సహకారం. కవిత చాలా బాగుంది. అభినందనలు

    ReplyDelete
    Replies
    1. Thanks మేడం ... మీ అభినందనలు కొత్త స్పూర్తిని నింపుతున్నాయి.....

      Delete
  5. Anonymous9/09/2013

    నలుపు తెలుపు ఛాయాచిత్రం
    సముద్రతీరం
    విరహం ఇష్టం అకర్షణ అందం ఆనందం అన్నీ కలిసి తోడుగ రాగా.....
    (Ravindra Kumar Govinda)

    ReplyDelete
    Replies
    1. Thanks dear for your lines..... ;-)

      Delete
  6. Anonymous9/09/2013

    Sagar, nee fast updates choosthunte...College lo Tripura ki cheppinavi anni raasukuni ippudu okko bullet vaduluthunnatlu undi
    (Rajasekhar Cherukuri)

    ReplyDelete
    Replies
    1. hmmmm ...... past is past అంటే గతం గతః.....

      ;-)

      Delete
  7. Replies
    1. its been long time....... seems someone scared you not to encourage me......

      Delete
  8. చాల బాగుంది. కవిత, pic రెండూ too good.

    ReplyDelete
    Replies
    1. wonderful .... అండీ ... pic ని కూడా టచ్ చేసారు ...... ;-)

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు