September 13, 2013

ష్..ష్... బ్రేక్ ది సైలెన్స్

కవిత రచన : సాత్విక

ఎడబాటే అలవాటైనా
ఎదసవ్వడి భారమైనా

అందుబాటులో నీవున్నా
నేనే పలకరించలేకున్నా

పలకరింపే ప్రశ్నిస్తున్నా
పలుకే తట పటాయిస్తున్నా

నువ్వే నాకు ఎదురుగా లేకున్నా
నా ఎదురుచూపులు నీకోసమేనన్నా

మౌనంలో ఈకోణమే ఎంతో కొత్తగున్నా
నీ శబ్దం లేక నిశ్శబ్దం నాపై దాడిచేస్తున్నా

నా మది మౌనరాగం నీకు వినిపించకున్నా
నాపలుకే పెదవి పై నర్తించ తయారుగున్నా

నాదైన నీ మది నర్తనశాలలో నే నిలుచొని ఉన్నా
నీ అనురాగపు మువ్వల సవ్వడికై నే నిరీక్షిస్తున్నా...

14 comments:

  1. Anonymous9/13/2013

    Very Nice
    ( Mehdi Ali )

    ReplyDelete
  2. Prathap9/13/2013

    Awesome writing. Reminds me of the popular song 'Nuvve Nuvve' from Khadgam. :)

    ReplyDelete
    Replies
    1. Welcome Prathap ji....

      అనుకోలేదు మీరు వస్తారని
      ఆస్వాదించి సంతకం చేస్తారని

      మంచి పాటని గుర్తు చేసినందుకు ... Thanks..ji

      Delete
  3. Anonymous9/13/2013

    hala chala bavundi,,very nice
    ( Muralikrishna Muni )

    ReplyDelete
    Replies
    1. Welcome to the telugu script readers world....

      thanks for your signature

      Delete
  4. Replies
    1. Welcome Chaitanya...

      Thanks alot for your wonderful wishes...

      Delete
  5. నీ శబ్దం లేక నిశ్శబ్దం నాపై దాడిచేస్తున్నా పద ప్రయోగం బాగుంది .

    ReplyDelete
    Replies
    1. పాయింట్ పట్టేశారు మార్కులు కొట్టేసారు .... హ హ హ ....

      Thanks sir ji ....

      Delete
  6. అందమైన కవితే అయినా...
    ఒక్క మాటా చెప్పలేకున్నా.
    మళ్ళీ,మళ్ళీ చదవాలని ఉన్నా,
    ఇప్పటికి ముగించేస్తున్నా., సాగర్ గారూ, కవిత చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. మనసులో అందముంటే
      అది మనలోనే వుంటే
      ఇంకేమి కావాలంటా ?

      హ హ హ ..... మీ ప్రయత్నానికి నా సపోర్ట్ అంతే ..... హ హ హ .....

      కృతఙ్ఞతలు మేరాజ్ ఫాతిమా గారికి ....

      Delete
  7. నాదైన నీ మది నర్తనశాలలో నే నిలుచొని ఉన్నా
    నీ అనురాగపు మువ్వల సవ్వడికై నే నిరీక్షిస్తున్నా...
    నీ శబ్దం లేక నిశ్శబ్దం నాపై దాడిచేస్తున్నా
    "ఎద సవ్వడి భారమైనా" !! చాలా బావుంది.... I liked these 4 lines very much.....

    ReplyDelete
    Replies
    1. wonderful for dragging the lines ..... out....

      generally I used to enjoy the lines alone pulled out in the comment section more than in the poem... ;-)

      Thank you very much...

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు