September 24, 2013

లేటెస్ట్ ఫ్యాషన్...


కవిత రచన : సాత్విక

ప్రకృతి సమకూర్చిన ముగ్ధ మనోహర సింగారం
కావాలి తన మగడిని ఆకట్టుకొనే కొంగుబంగారం  

పరదా దాటిన ఆధునికత అనే క్రొత్త వ్యవహారము
చేసేస్తోంది ప్రతి చూపుకి తన అందాన్ని పందేరము  

ఆ అలంకరణే కోరుతోంది మగడి ఆదరణ ఆద్యంతము
వలదంటోంది మగాడి ప్రాకృతిక స్పందన అనునిత్యము  

కీచకుడే స్వయంభూవై ఆవహించే ప్రతి నరుని నరాన  
భీముడైనా భీష్మించే కలియుగ నర్తనశాలలో వాస్తవాన  

ఆహ్వానించి వధించిన గాధ మన పురాణ కీచక చరిత్ర
కవ్వించి కబళించబడిన వ్యధ ఈ ఆధునిక అతి(వ) చరిత్ర  

'అందానికి బలహీనత'కి  జరుగుతున్న ఆటలోని కుతూహలం
తెలిపెను కోటానుకోట్లలో నిగ్రహం విడువని మగవారి మనోబలం  

'అలంకరణలోని హద్దులు' కావు ఆడవారి స్వాతంత్రానికి అడ్డుగోడలు
అవే 'హద్దులు అవసరం' మగవారి ప్రాకృతిక ప్రేరణకి ప్రతిబంధకాలు  

పోటిపడి అందాలన్నీ ఎరవేసినట్టు ఆరబెట్టే  ఓ'సీ-త్రూ' సంస్కారం   
"ఆడదానికి శత్రువు ఆడదే'నన్న నిజమే చేస్తోంది నీకు నమస్కారం  

వెర్రి తలలతో ఊపిరి పోసుకుంటున్న "ఫ్యాషన్"ని  చేయండి ఖననం
లేక, కోల్పోతుంది ఆధునిక భారతములో భూమాతైనా తన సహనం        

13 comments:

  1. ఈ కవితని ఆలస్యంగా చూసినదుకు నన్ను నేను నిందించుకున్నాను.
    చాలా అర్దాన్ని, నిస్పక్షపాతంగా నిక్కచ్హిగా చెప్పిన మీ పదాల పొందికకూ,
    అక్షరాల ఆకృతికీ నా సలాం.
    ఆడవారి అలంకరణకే నిగ్రహాన్ని కోల్పోయె అంతటి బలహీనుడు మగవాడు అంటే అది సమంజసం కాదు, అత్యాచారాలూ,విక్రుత చర్యలూ ఆడవారి అలంకరణ వల్లా జరిగితే మరి అమాయక,
    కుటుంబ స్త్రీల మీద జరిగే అత్యాచారాల మాట ఏమిటి?
    దుర్బలులు, మానసిక రుగ్మతులూ ఉన్న మగవారే అలాంటి చర్య చేస్తారు. కానీ నాగరికత వెర్రితలలు వేస్తుంటే దాని ప్రభావం ముందు తరాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. సాగర్ గారూ, మీ కవితలు కేవలం ప్రేమే కాక సామాజిక పరిపక్వత కలిగి ఉంటాయి. మీ కవితల్లో "సాత్విక " చదివిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. అమాయక, కుటుంబ స్త్రీల మీద జరిగే అత్యాచారాల మాట ఏమిటి?
      ఆధునికత అనే పేరుతో కవ్వించిన వనిత స్క్రీన్ పై నుంచో పుస్తకములోనుంచో లేక పబ్లిక్ ప్రదేశములలో నుండో తప్పుకుంటే.... అందుబాటులో ఒంటరిగా చిక్కుకున్న అమాయక కుటుంబ స్త్రీలు బాలి అవుతున్నారు అని నా అభిప్రాయం. ఈ క్రింది వాక్యములలో అది వ్యక్త పరచాను

      "పోటిపడి అందాలన్నీ ఎరవేసినట్టు ఆరబెట్టే ఓ'సీ-త్రూ' సంస్కారం
      "ఆడదానికి శత్రువు ఆడదే'నన్న నిజమే చేస్తోంది నీకు నమస్కారం … "

      అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే మానసిక రుగ్మత కలిగినవారు ఇలా చేస్తారు అన్నదానితో నేను ఏకీభవిస్తాను.... కానీ దానిని కంట్రోల్ చేసే చర్యలు సమాజములో ఏదన్న మొదలవ్వాలి అంటే మొబైల్ కోర్టులు పెంచి సెక్యూరిటీ పెంచి ఇలా కాపలా పద్దతులు బాహాటముగా పెంచుకొనే బదులు మానసిక నియంత్రణ జరుగు విధముగా కూడా ఈ ఆదినాతన పోకడలకు స్వస్తి చెబితే కొంత ఇబ్బందులు తగ్గే అవకాశం వుంటుంది అని నా అభిప్రాయము.

      మీ ఆత్మీయ అభిమాన స్పందనకు నెనర్లు....

      Delete
    2. ఆడవారి అలంకరణకే నిగ్రహాన్ని కోల్పోయె అంతటి బలహీనుడు మగవాడు అంటే అది సమంజసం కాదు

      one more point here is ...
      హద్దులు దాటిన అలంకరణ గురించిన ప్రస్తావన కనుక .... నిగ్రహం కలిగి వుండాలి అని కోరుకోవడం కొంచం అత్యాసే. ఇంత హద్దులు మీరినా నిగ్రహం విడువలేదు కోటానుకోట్ల మగవారు. otherside of the coin ఆలోచిస్తే from men's point of viewలో అది నిజం అనిపించక పొదును.

      నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో పబ్స్ లో డిస్కో టెక్స్ లో నైట్ కల్చర్ అంటూ మసక చీకటిలో ....ఇలా అన్ని చోట్ల అర కోరగా వేసుకొని వేసుకోక ఫ్యాషన్ ముసుగులో (పేరుతో) నేటి(భావి)తరం ఆడదానికి నేటితరం ఆడదే శత్రువు అవుతోంది ....

      I strongly believe in

      'అలంకరణలోని హద్దులు' కావు ఆడవారి స్వాతంత్రానికి అడ్డుగోడలు
      అవే 'హద్దులు అవసరం' మగవారి ప్రాకృతిక ప్రేరణకి ప్రతిబంధకాలు …

      Delete
  2. ఆడవారికి ఆడవారే శత్రువులు అని నేను ముమ్మాటికీ నమ్ముతాను,
    ఇది నా సోదరీమణులకు కొంచం కోపం తెప్పించవచ్హు కానీ చాలా చోట్ల స్త్రీల వల్లే స్త్రీలు బాదపడిన సందర్బాలు లేకపోలేదు.
    ఇకపోతే మీ వాదన సమంజసమే రెచ్హగొట్టే వారి ముందు నిగ్ర్హంగా ఉండతం కస్టమే. నాగరికత వెర్రితలలు వేయటానికి స్త్రీలే కారణం. సాగర్ గారూ్ మీ అభిప్రాయాన్ని ఇంకో కవిత ద్వారా ఇంకా వి్శదపరచండి మీకా శక్తి ఉంది.

    ReplyDelete
    Replies
    1. మీ మీదే కోపగించుకుంటే మీ సోదరిమణులు నన్ను శపిస్తారేమో ? .... ;-)

      నేను ఈ కవితకి స్పందించి (open గా) ఒప్పుకొనేవారు ఉండరు అనుకున్నాను. శపించక పోయినా అనుకున్నట్టుగానే కొంచెం స్థబ్దుగా ఉండిపోయారు. మీరు మాత్రము అంచనాలు తారుమారు చేస్తూ స్పందించారు.

      ఇంకా వివరముగా వ్రాయమన్నారు కదా! .... ప్రయత్నిస్తాను భవిష్యత్తులో .....

      మీకు హృదయ పూర్వక ధన్యవాదములు...

      Delete


  3. సాగర్ గరు,

    పదునైన మాటలతొ ఆధునిక పొకడలపై యుద్దం ప్రకటించరు....మీకు నా అభినందనలు

    కాని పూర్తిగా మీతొ ఏకీభవించలేకున్నాను. మన సాటి ఆడవారిపై జరుగుతున్న దాడులకు అది అతి చిన్న కారణం. నేటి సమాజంలొ పరాయి స్త్రీ అందరి సొత్తు అని భావించే మన మగవారి భావజాలం మారనంతవరకు ఈ పొకడ మారదు, దాడులు ఆగవు....మగవాళ్ళమై వుండి సాటి మగవడి వల్ల అవమానం పొందుతున్నాం. మనలొ దగివున్న దురాలోచనలను మనకున్న దురలవాట్లు అంతకంత ప్రేరేపిస్తున్నయి...మనందరం ఎప్పుడొ ఒకప్పుడు ఇటువంటి వెకిలిచెస్తలు చెసినవాళ్ళమే...చదువు, అమ్మా నాన్న నేర్పిన సంస్కరం మనల్ని మారేలా చేస్తే అది దొరకనివాళ్ళు ఇంతింతై అన్నట్టుగా నేరాలు చెసే స్థితికి చేరుకుంటారు. ఒకరికి చెప్పెముందు మన మారాలి అనేది నా సిద్ధాంతం.

    నొప్పిస్తె మానించండి....

    ReplyDelete
    Replies
    1. హలో చైతన్య ... స్వాగతం ....

      మీ స్పందనకి ధన్యవాదములు.....

      మీ అభిప్రాయముతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను .....
      ఒక సమస్యకి ఒక్కటే కారణం ఎప్పుడూ వుండదు ..... జగమంతా కుటుంబంలో ఎన్నో రకాల ప్రాణులు సమస్యలు పోకడులు ఉదాహరణలు .....వెరసి మనం....

      కాకపోతే కవిత యొక్క పొడుగు , పాఠకుల సమయం, ఇలా దృష్టిలో వుంచుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క కోణముని చూపించ ప్రయత్నిస్తాము.... నా ఉద్దేశ్యములో ఆధునిక పోకడులు (ఫ్యాషన్) కూడా చాల ముఖ్య పాత్ర పోషిస్తున్న వాటిలో ఒకటి ....అని నొక్కి చెప్పే ఉద్దేశ్యమే నాది ...

      మీరు స్పందించిన విధానం చాల బాగా నచ్చింది .... మనస్పూర్తిగా ధన్యవాదములు .....

      Delete
  4. చైతన్య గారు ఒక మాట ని చాలా నిక్కచ్హిగా చెప్పారు,
    పరాయి స్త్రీ అందరి సొత్తు అనుకుంటారు ఇదీ ఇప్పటి మగవారి(కొందరి) ఆలొచన,ఇకపోతే వారన్నట్లు అమ్మా,నాన్నా నేర్పిన సంస్కారం చెడు ఆలోచనలకు కార్యరూపం ఇవ్వదు.
    అదే సంస్కారం స్త్రీకి కూడా అవసరం.
    నేను ఇలా ఉండాలని అనుకుంటున్నాను ఉంటే నా మీద దాడి చేస్తారా?
    అది ఎంతవరకూ సమంజసం అని అడిగారు మన స్త్రీలు. అది సమంజసం కాదు కానీ పురుష నైజం. ఇకపోతే స్త్రీలపై దాడులు జరగడానికి వెర్రితలల నాగరికత, తప్పు చేసిన వారిపై శిక్షలు అమలు లేకపోవటం వంటివి, అంతెందుకు కొన్ని దేశాలు పర్సనల్ చాటింగులను కూడా అనుమతించటం లేదు, అది విపరీతమే అనిపించినా.. కొంత వరకూ నియంత్రణమే.... ఏమంటారు తమ్ముడూ,

    ReplyDelete
    Replies
    1. In India, we are suffering with corruption which in turn causing all other problems. Best example is sensor board. We can get 'U' certificate for any movie and I am damn sure on that....

      can any minister challenge us that you can't get 'U' certificate for adult movies ?

      no one can challenge because they are not sure that "the money for their car petrol (luxury) is coming from where ? "

      I am really sad to see people quarreling each other for division, but not the anti social elements like corruption... which is spoiling future for everyone...pch pch.... సర్లెండి ...క్షమించాలి ... little lengthy responses...

      sometimes un avoidable ;-)

      Delete
  5. I agree to some extent definitely. But there r people who see ladies always with a different angle though they are traditional and in their own limits.. But ur kavitha is very very nice and appreciable.. B coz this is what happening now a days....

    ReplyDelete
    Replies
    1. hey you got the point. as I responded above, I too agree that for a problem there will be different reasons ... I want to stress here is that "limitless fashion roots" also one of the main reason out of all other whatever we think and visualize ....

      Delete
  6. ఇచటి ' సాగర ' తీరాన రుచి కరముగ
    ' వేడి వేడి సమోసాలు ' వేతు రనగ
    వచ్చి చేరితి - నిజమే - ఇవాళ దొరికె
    మాంచి ' లేటెస్టు ' టీ కూడ మాకు నాహా !

    ReplyDelete
    Replies
    1. రాజారావు గారికి ముందుగా స్వాగతం ఈ సాగర తీరానికి....

      మీ రాకతో మాకు కూడా మంచి కంపెని దొరికినది. సమోసాలు తిని చాయ్ తాగి మమ్మల్ని ఆనందపరచినందుకు ధన్యవాదములు....

      Thank you very much and re-visit every-time for snacks with us...

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు