September 12, 2013

బ్లా.బ్లా..బ్లా...

కవిత రచన : సాత్విక


మంచులో దాగున్నది  నీరేనన్న నిజాన్ని,
కరిగించిన అదే "క్షణం" నమ్మించేను మనల్ని,
'కాలం' మాటునున్నది 'విలువ' అన్న సత్యాన్ని, 
చూస్తున్నా...  'కాలమే కరిగినా తెలుసుకోని జనాల్ని'
మంచు కరిగితే నీరు -- కాలం కరిగితే చేజారు 

తెర చాటునున్నది సిగ్గని మనసే తెలిపెను,
తెర తీసి పలకరించ సిగ్గే మాయమయ్యెను,
ఈ ఆటలో గెలుపెప్పటికీ నాదేనని 'సిగ్గ'నెను,
నగ్నసత్యమిదేనని నేనే 'సిగ్గు'ల మొగ్గైనాను
తెలవక మాయం--తెలుసుకున్నంతట ఖాయం

మౌనమే మిన్నకున్నా అడిగాను నేను.. ఎందుకని?
మరచాను ఆ మాటే మౌనాన్ని మింగేస్తుందని,
సంబరపడ్డా... 'నా ద్వేషమే జయించే నా శత్రువులందరినీ',
మరచా నాలోనే కొలువైయున్నదని... విడువదు నన్నైనా అని.
మాటకు మౌనమే బలి -- ద్వేషముతొ తప్పదు ఘోరకలి

14 comments:

 1. సాగర్ గారూ, మవునం చాలా చెప్తుంది, దాన్ని పలకరించేందుకు మాట అవసరం లేదు, ఇక సిగ్గు తెరచాటే కాదు దించిన కనురెప్పలలో కూడా దాగి ఉంటుంది, కవితలోని మొదటి ఐదు లైన్లూ చాలా బాగున్నాయి, పదే,పదే చదివించాయి.

  ReplyDelete
  Replies
  1. మేరాజ్ ఫాతిమాగారికి ముందుగా కృతఙ్ఞతలు.

   మౌనం మనతో మాట్లాడేది ఆలోచనల రూపంతో ... అయితే ఒకొక్కసారి ఆఅలొచన కూడా నశించినంతట మన మదిలో కలవరం రగులుతుంది అయితే ఈ భావననే నేను ఇలా రాసాను
   "మౌనమే మిన్నకున్నా అడిగాను నేను.. ఎందుకని?"
   అయితే అప్రయత్నముగా మనమే మనతో మాట్లాడటం (ఆలోచన జనీకృతం చేసి గాని లేక మరే ఇతర పద్దతులలో నైనను ) ఆ వేదనకు కారణమైన మౌనం ఆ మాటకు బాలి అవుతుంది ....
   పోలికగా నేను చెప్పదలచినది ఏమిటంటే తన మాటకు తనే బలి అవుతుంది.... అలాగే నీ ద్వేషం నిన్నే హరిస్తుంది అని ....

   సిగ్గు గురించి మీరే అన్నారుగా వాల్చిన కనురేప్పాలో ఉంటుందని మరి కను రెప్ప తీస్తే ? కను రెప్ప కూడా తెర కదా అని నా అభిప్రాయం కాకపోతే నేను తీసుకున్న పోలిక ఏమిటంటే తెలుసోకోకుండా దానికోసం వెళితే అది దక్కలేదు దాని గురించి తెలుసుకొంగానే అదే వరించిందని ....

   Thanks alot for giving me an oppurtunity to explain my thought process

   Delete
 2. మంచులో దాగున్నది నీరేనన్న నిజాన్ని,
  కరిగించిన అదే "క్షణం" నమ్మించేను మనల్ని,
  'కాలం' మాటునున్నది 'విలువ' అన్న సత్యాన్ని,
  చూస్తున్నా... 'కాలమే కరిగినా తెలుసుకోని జనాల్ని'
  చాలా నచ్చింది

  ReplyDelete
  Replies
  1. ఆస్వాదించి అభినందినందుకు కృతఙ్ఞతలు ....

   Delete
 3. First 5 and Last 5 are excellent!! Super like :)

  ReplyDelete
  Replies
  1. seems you are busy in reading the middle lines ....

   just kidding .... :-)

   Delete
 4. Anonymous9/12/2013

  enti anaya parady chesi remix chesi kota pata invent chesava @vidyasagar
  (Maruthi)

  ReplyDelete
  Replies
  1. అమాయకత్వముతో కూడిన ఈ satire నే బెస్ట్ satire అని ప్రకటిస్తున్నాము ...
   హ హ హ .....

   Delete
 5. చక్కటి వివరణలతో కూడిన పోలికలు .

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు .... sir జీ ..

   Delete
 6. Nice thoughts penned perfectly. చాల బాగుంది

  ReplyDelete
  Replies
  1. నీతులు చెప్పడం తేలిక కదా అని అప్పుడప్పుడు ఇలా .... :-)

   Thanks

   Delete
 7. Chaala chaala baaga raasthunnaru.Keep writing more and more for us :)
  Like the way you respond to every comment.

  ReplyDelete
  Replies
  1. Often I feel certain things about "comments" and just thought to share by looking at your bold comment....

   Inspiration is required for any person to know something what he is capable of....
   Motivation is required for any person to achieve something what he is capable of....
   Good attitude is required to provide these two for others without any expectations ..... and there you are
   (all commenters in everywhere...)

   Thanks-a-lot for the encouragement and wishes.... I will try my best possible.... cheers..

   Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు