September 1, 2013

సంధిస్తున్నా! నీవు సమాధిలొనున్నా?

కవిత రచన : సాత్విక


'ఆటుపోటులే ఉనికిగనున్న అల'    ఎదురీతకై యోచించునా?
'నీ తలంపులోని  మైమరపే '   నా మదిని విడువకున్నా ,
'నీతో నే గడిపిన క్షణాలే'     కదలనీక కాలానికి కాపుకాస్తున్నా,
'కలగానైనా రెప్పపాటు కాలమైనా'     కునుకే తీయలేకున్నా,
'కలైనా కాకూడని కాలం'     పీడకలై వీడిపోదాయని యోచిస్తున్నా  

'వెలుగే తన నీడకై వెదకిన'     దరిచేర్చుకోని ఆ నీడదే గెలుపౌనా?
'వేదన రగిల్చిన జ్వాలలోని వెలుగే నేనైతే'       నా నీడగా నువ్వే మారెనా,
'వెలుగు-నీడల వెలయాట్టు'లో         ఎడబాటే రాసుకోని ఒప్పందమా,
'నా అశ్రువులొని ప్రతి బిందువు'లో    ప్రతిబింబిస్తున్నావని తెల్సుకున్నా,
'ఆ ప్రతిబింబమే వెలుగుకు నీడగా చూపి'    అనుక్షణం నిన్నే గెలిపిస్తున్నా   

'సమాధానం లేని ప్రశ్నకి జవాబే'      ప్రశ్నే లేని సమాధానమా ?
'నన్ను విడచి నీవెందుకు వెడలిపోయావని'        ఆవేదనతో నేనడిగితే ,
 ప్రశ్నతో 'నిన్ను-నన్ను'       వేరు చేయద్దని మౌనంగా నీవంటుంటే,
'ప్రశ్నించలేని నా  పరీస్థితికి'      ఏడ్వలేక వెక్కి వెక్కి నవ్వేస్తున్నా ,
'సమాధానం లేని ప్రశ్నవి నీవైతే'      ప్రశ్నించలేని నేనే  సమాధానమౌతున్నా   

4 comments:

  1. Anonymous9/02/2013

    "ఆటుపోటులే ఉనికి గా ఉన్న అల ఎదురీత కై యోచిన్చునా?"
    "నా అశ్రువు లోని "
    'వేదన రగిల్చిన జ్వాలలోని వెలుగే నేనైతే ,నా నీడగా నువ్వే మారేనా"

    These three are small corrections.. Coming to the topic...
    చాలా మంచి భావం. చాలా మంచి ఫీల్ ...good one...
    చాలా మంచి ఫీల్ ...
    (Vidya D)

    ReplyDelete
    Replies
    1. little hard to understand this....

      Thanks for the corrections ....

      థాంక్స్ విద్యా ....

      Delete
  2. 'సమాధానం లేని ప్రశ్నకి జవాబే' ప్రశ్నే లేని సమాధానమా ? పద ప్రయోగం బాగుంది .

    ReplyDelete
    Replies
    1. భావమే ప్రదానముగా ప్రయత్నించిన విభాగము లోని పదాలు అవి ....

      ధన్యవాదములు...

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు