August 27, 2013

అహం బ్రహ్మాస్మి ...

కవిత రచన : సాత్విక


నా చుట్టూ ఉన్నవి కొన్నే 
నాలో ఉన్నవి ఎన్నో, ఎన్నెన్నో,
నా చుట్టూ ఉన్నవన్నీ నాకే,
పరిచయం చేస్తున్నాయి నన్నే!!  

'నన్నే' నేను తెలుసుకోలేకున్నా,
'నేను కాని నన్ను' నేనేననుకున్నా,
'నేను' అంటే తెలిసిన మరుక్షణం,
'లేని నన్ను చూసి నవ్వుకున్నా'నాకు నేనే!! 

"అహం బ్రహ్మాస్మి"లోని గెలుపే శ్రీ రాముడు,
అందులో దాగున్న అలుపే దుర్యోధనుడు,
"అహం బ్రహ్మాస్మి"లోని ఓరిమి దాన కర్ణుడు,
అందులో దాగున్న ఓటమి రావణాసురుడు  

అన్ని భావాలని ఇముడ్చుకొనుటే కాల కర్తవ్యం,
వీక్షించు అంతరంగపు కోణం నిర్ణయించును భవితవ్యం,
గీత గోవిందుడు మనకు వినిపించిన పవిత్ర కావ్యం, 
'ఇంట గెలిచి రచ్చ గెలువు' అన్నదే తాత్పర్యం

16 comments:

  1. 'నేను' అంటే తెలిసిన మరుక్షణం,
    'లేని నన్ను చూసి నవ్వుకున్నా'…నాకు నేనే!
    చాలా నచ్చిన లైన్స్....

    ReplyDelete
    Replies
    1. బయటకు లాగి మరీ అబినందిన్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.....

      Delete
  2. Anonymous8/27/2013

    What happened to u!! Writing such fantastic and fabulous lines as poetry!!! super like...... Vidya

    ReplyDelete
    Replies
    1. its like nothing is in our control and everything is as is with the flow.... thats it..... ha ha ha

      Delete
  3. Anonymous8/27/2013

    Annaiyya nuvvu saathvika nunchi ruthvika ayyavu bhaavamlo ... Hrudaya

    ReplyDelete
    Replies
    1. ఇంకెన్ని phase లు ఉన్నాయో ఏమో ??

      ప్చ్ ప్చ్ .....

      Delete
  4. Anonymous8/27/2013

    Very meaningful (Sivaramakrishna Ramadugu)

    ReplyDelete
  5. Anonymous8/27/2013

    సాత్విక సాగరా...వినుర త్రిపురా !! (Rajasekhar Cherukuri)

    ReplyDelete
    Replies
    1. రాజా నీకు ఇంకా చిలిపితనం పోలేదు రాజా .... హ హ హ .....

      Thanks Rajasekhar...

      Delete
  6. Anonymous8/27/2013

    Emi septhiri... (Sudhakar Kattupalli )

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడుడా ఇలా సెప్పితిని ఎప్పుడూ కాదు ......

      Delete
  7. Anonymous8/27/2013

    సాగర్, బాగుంది! నువ్వు చెప్పదలుచుకున్న సారం బాగుంది. ఇంకా రాస్తూ ఉండు.
    కానీ, మధ్యలో ఎక్కడో ఏదో తెలియని చిన్న ఇబ్బంది. నువ్వు చెప్పదలుచుకున్న భావానికీ, నువ్వు వాడిన పదాలకీ కొంత వ్యత్యాసం ఉన్నట్టుగా అనిపించింది.
    ఒక చిన్న సవరణ. "అహం బ్రహ్మస్మి" కాదు. "అహం బ్రహ్మాస్మి". (Kamal Kishore Suruguchi)

    ReplyDelete
    Replies
    1. Thanks for the spelling correction ....

      As you know the limitation of the poem is 12 lines and sometimes the way writer narrates is different from the reader's flash at that moment ....

      sharing your frank opinion on the first thought is always appreciable and I like that....

      keep continue reading and throw your thoughts without miss ....

      Delete
  8. చాలా బాగుంది

    ReplyDelete
    Replies
    1. Thanks యోహాంత్ గారు...
      happy to see you here ..... ;-)

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు