కవిత రచన : సాత్విక
ఆనందానికి అవధి మైమరపు,
ఆలోచనకి ఆచరణ ఆటవిడుపు,
భ్రమకి బ్రాంతి అన్నది కొసమెరుపు,
వ్యధ పంచన నిలుచున్నదే నిట్టూర్పు,
నిర్లిప్తతకే బలం చేకూర్చును ఆ ఓదార్పు,
తర్కానికి లొంగనిదే జీవితపు ప్రతి మలుపు,
శ్రద్ధ కొరవైన సమర్ధనకి మరపన్నదే మారురూపు,
అసహనం అనంతరం ఆవహించేదే అసలైన ఓర్పు,
భయానికి లొంగిపొక భరించడమే ధైర్యంతో జతకలుపు,
అవసరమే ఆయుధమైతే తప్పక తలవంచును 'ఆ' గెలుపు,
విశ్వంలో ఏ స్థితికైనా ఎటువంటి పరిస్థితికైనా తప్పదు ముగింపు,
మౌనమే భాషగా 'మాట్లాడ' గలగడమే ప్రకృతిలోని అసలైన సోంపు,
కాలచక్ర దిగ్భందంలో 'సూర్య' 'చంద్రు'లకైనా దొరకలేదు మినహాయింపు,
'ప్రతి పధం'లో పదును పెట్టి కలగలిపి అనుక్షణం 'ఆలోచనలన్నీ నలుపు',
అనుభవమే భాష్యంగా కాలగమనమే సాక్షిగా ఈ నిజాలన్నీ జీవితమే తెలుపు …
wow....super!
ReplyDelete;-) మీ అభిమానం అంతేనండీ
DeleteThanks madam..
చక్కగా చెప్పారు.
ReplyDeleteస్పందించిన మీకు ధన్యవాదములు...
DeleteADBHUTANGAA UNDI
ReplyDelete;-)
DeleteAmazing..చాలా చాలా బాగుంది
ReplyDeleteమీ సపోర్ట్ కొత్త ఉత్సాహం నింపుతోంది ... Thanks
Deleteyeppudu vachindannaiyya nee aaloochanalani ila raayagala neerpu :-)
ReplyDeletethat's my sister.... good counter (nerpu)... ;-)
Delete