August 19, 2013

వీడిపో ...

కవిత రచన : సాత్విక


'నా నీ అనుబంధం'  ప్రేమకీ, వంచనకీ నడుమ సంకీర్ణం,
మనోవ్యధ వర్షించిన ధారలో  ' నా ఆర్ధ్రతే ' ధవళ వర్ణం,
కన్నీటిధారలతో తడిసింది ఈ రోజు నా ప్రేమ చితి భస్మం,
మోయలేని భారమై హేళనగా నన్నే ప్రశ్నిస్తోంది ఆ చూర్ణం,
'ప్రేమే ద్వేషమై ఎదుట నిలచిన' కాకున్నది నా మనస్సుకి జీర్ణం,
'నమ్మకానికే' జరిగిన అమ్మకంలో ప్రేమపాళ్ళెంతన్నది అప్రస్తుతం

' హర్షించినా వర్షించినా కన్నీరే ' అన్నది  జీవనయానం,
నయవంచన జ్వాల నడయాడుతూ తెలిపెను నాకీ మర్మం, 
వంచన పంచన మిగిలి ఉన్న మనోవేదనే 'ఈ నా జీవన్మరణం',
ఎడారిలో తడారిన గొంతుకకు నేనేమాత్రం తీసిపోని తార్కాణం,
'పిలచినా అరిచినా ఆగకున్నది ఆక్రందన' అన్నదే అంతర్లీనం, 
మది అంచు దాటని వేదన దాల్చిన రూపమే ఈ అంతర్మధనం…

(జీవిత భాగస్వామి చే వంచించబడ్డ హృదయ .. మౌన రాగం)

6 comments:

  1. Replies
    1. Thanks for your expression ...

      I am very happy to see you again ... welcome back ... ;-)

      Delete
  2. Antharmadhanaaani kallaku kattinatlu chupinchaav... Marvelous.....

    ReplyDelete
    Replies
    1. భావాన్ని చూపింది నీ కళ్ళజోడు
      నే అందిస్తా అభినందనలు చూడు...

      థాంక్స్! థాంక్స్ !!

      Delete
  3. very touchy an yet straight from the heart

    ReplyDelete
    Replies
    1. బాదించడం తేలిక కానీ బాధని వెలిబుచ్చడం కొంచెం కష్టమే .... కలికాలం కదా

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు