కవిత రచన : సాత్విక
'ఆశ' -- 'ఆవేశం' వశమగునటువంటి పతాక సన్నివేశం,
'అర్ధం' -- 'యదార్ధం' నర్మగర్భమునుగ నున్న సందర్భం,
'బలమే' -- 'బలహీనత' వశమైనటువంటి బలీయమగు క్షణం,
'మౌనం' -- 'మాట' విడివడి ఆ పై రాజీపడి ఆలపించిన రాగమే సాక్ష్యం,
'తృప్తికీ' -- 'అసంతృప్తికీ' వాదోపవాదములు మిన్నంటిన తరుణం
'బలానికి' -- 'బలహీనతకి' ఓణుకు, చురుకు సమకూరు స్థితికి చేరువగా,
'చెమట ఉరవ'కు -- 'గాలి చొరవ' చల్లంగ చేజారి కనుమరుగవ్వంగా,
'అనాలోచన'కు -- 'యధాలాపం' ఎదురెళ్లి యధావిధిగా సహకరించ,
'సిరీ' -- 'సంపదా' పోటీగా పన్ను చెల్లింపుల ప్రక్రియ సాగించ,
'మనస్సు' హోరు -- 'వయస్సు' జోరు సరి సమతుల్యం సాధించ,
'నీవు' -- 'నేను' కనుమరుగై 'మనం' అనే భావం ఉద్భవించే అందముగా
అనేకానేక భావాల సంగమ మిళితమే 'నువ్వు' -- 'నేను' కలబోసిన మనం
Just Marvelous
ReplyDeleteThanks for the big applause ...
DeleteWow, no words... Life lo unna duality no chala and am ga cheppav.....
ReplyDeleteఅంతర్యాన్ని ఆస్వాదించి అభినందిస్తున్న నీకు పెద్ద THANKS ...
DeleteExcellent...Asalu matalu levu ......Pindesaru
ReplyDeleteమనం అనే "భావన" అది.
Deleteఅందుకే నేనేమంటానంటే మనల్ని మనం ఎక్కువ "నువ్వు చెప్పింది చేయకూడదు"
missing the identity.....(anyway Thanks)