August 8, 2013

ఆలోచన నలుపు -- జీవితమే తెలుపు !!

కవిత రచన : సాత్విక



ఆనందానికి అవధి మైమరపు,
ఆలోచనకి ఆచరణ ఆటవిడుపు,
భ్రమకి  బ్రాంతి అన్నది కొసమెరుపు,
వ్యధ పంచన నిలుచున్నదే నిట్టూర్పు,
నిర్లిప్తతకే బలం చేకూర్చును ఆ ఓదార్పు,
తర్కానికి లొంగనిదే జీవితపు ప్రతి మలుపు,
శ్రద్ధ కొరవైన సమర్ధనకి మరపన్నదే మారురూపు,
అసహనం అనంతరం ఆవహించేదే అసలైన ఓర్పు,
భయానికి లొంగిపొక భరించడమే ధైర్యంతో జతకలుపు,
అవసరమే ఆయుధమైతే తప్పక తలవంచును '' గెలుపు,
విశ్వంలో ఏ స్థితికైనా ఎటువంటి పరిస్థితికైనా తప్పదు ముగింపు,
మౌనమే భాషగా 'మాట్లాడ' గలగడమే ప్రకృతిలోని  అసలైన సోంపు, 
కాలచక్ర దిగ్భందంలో 'సూర్య' 'చంద్రు'లకైనా దొరకలేదు  మినహాయింపు,
'ప్రతి పధం'లో పదును పెట్టి కలగలిపి అనుక్షణం 'ఆలోచనలన్నీ నలుపు',
అనుభవమే భాష్యంగా కాలగమనమే సాక్షిగా ఈ నిజాలన్నీ జీవితమే తెలుపు  

10 comments:

  1. Replies
    1. ;-) మీ అభిమానం అంతేనండీ

      Thanks madam..

      Delete
  2. చక్కగా చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. స్పందించిన మీకు ధన్యవాదములు...

      Delete
  3. Amazing..చాలా చాలా బాగుంది

    ReplyDelete
    Replies
    1. మీ సపోర్ట్ కొత్త ఉత్సాహం నింపుతోంది ... Thanks

      Delete
  4. yeppudu vachindannaiyya nee aaloochanalani ila raayagala neerpu :-)

    ReplyDelete
    Replies
    1. that's my sister.... good counter (nerpu)... ;-)

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు