September 2, 2013

ఎందుకో ఏమో? అందుకేనేమో!!

కవిత రచన : సాత్విక

'నిన్న' అనేదే చేయూత ,
'నేడు' అన్నది  తుళ్ళింత , 
'రేపు' అవ్వాలి కవ్వింత ,
సరైన ఆలోచనతొ ముడిపడినదే ఇదంతా,
'మనకంటి చూపైనా చేరగలిగే దూరం' కూసింత,
అయిననేమి దాని హద్దే అవతరించే 'ఆకాశమంత'  

'రాపిడి' నడవడిలోనే స్వచ్ఛమైన  'అగ్గి' దాగున్నది,
'రాపిడే రాజీబడితే'  అగ్గైనా బట్టబయలు కాకున్నది,
కష్టాల కొలిమిలోనే "ఆలోచన" సెగ రగులుతుంది ,
అందిపుచ్చుకుంటే అవరొధముల గని కరుగుతుంది 

'ఎత్తుకు  పై ఎత్తు',  కానే కాదు ఎవడో కట్టే తాయత్తు,
ఈ తత్త్వం తలకెక్క మనకవసరం "ఆలోచనా" కసరత్తు,
"ఆలోచనాతీరు" మార్చుకుంటే ఏదైనా అవుతుంది నీ సోత్తు,
అదే అర్ధమైతే ఈ జీవితమే నీ అడుగులకు మడుగులొత్తు 

ఓడిన ఆ ఒక్క క్షణం నీది కానేకాదని తెలుసుకో,
ఓటమే ఒప్పుకోక వేగిరముగా ముందుకు సాగిపో,
నువ్వే 'గెలిచే' క్షణాలు ముందున్నాయని మరువకు,
జాప్యం చేయక కాలంతో జతకూడి ఆలోచన మార్చుకో

'భూమి-ఆకాశం' కలిసే చోటే లక్ష్యంగా నిర్దేశించినా, నీకేల చింత, 
అనుకో, ఆ దూరమే నీవు పయనించ దొరికినట్టి అవకాశమంత,
ఆలోచనాసరళే మారితే,
నీ 'కన్నీళ్ళే' నీకే దాసోహమంటూ స్థితినే మార్చుకుంటాయి,
'ఆనందభాష్పాలు'గా గతి తప్పక అదే కంటినుండి ప్రవహిస్తాయి

8 comments:

  1. Super!!! Chaala chaala bavundi....Manchu message...

    ReplyDelete
    Replies
    1. చెప్పేటందుకే కదా నీతులు .... అందుకే ....ఇలా .....

      Thanks for sharing your opinion....

      Delete
  2. చాలా చాలా బాగుంది .

    ReplyDelete
    Replies
    1. నీతి చెప్పడం తేలిక ఆచరణే కొంచం కష్టం ....
      తేలికైన పని నేను చేసి మిగతావారిని ఇలా కస్తాపాడమని అంటున్నా అంతే....హ హ హ ....

      థాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్...

      Delete
  3. వావ్ భలే బాగుంది.

    ReplyDelete
    Replies
    1. మీరిచ్చిన విశేషణం చాలా విశేషం .....

      Thanks for sharing your opinion....and encouragement... :-)

      Delete
  4. Replies
    1. అమ్మేzing thing Goldspot కదండీ.... హ హ ... :-)


      Thanks for sharing your opinion....and encouragement... :-)

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు