September 17, 2013

'కృతి'వా … 'ప్రకృతి'వా

కవిత రచన : సాత్విక

'కృతి'వా  'ప్రకృతి'వా .... అసంకల్పిత 'ఆకృతి'వా... 
మాటలే కొరవడిన వయ్యారాల మౌన కావ్యరూపానివా,
అన్నీ నీవే అనిపించే కళ(ల)ల సామ్రాజ్య ప్రతినిధివా
విశ్వమునే ఆవహించిన జీవంలో(లే)ని మాయాజాలానివా,
స్పందించని ప్రతి'స్పందన'లో(లే)ని భావుకతకి భాష్యానివా,
'కదలని లోకమునే పాలించిచూ' కదిలే కాలానికి సాక్ష్యానివా,

ఈ జన్మకు అందిన అనురాగపు సంతకాల సారధివా,
మరు జన్మకై నిలచి ఉన్న మధుర జ్ఞాపకాల వారధివా,
గత జన్మలోని అనుభూతుల శిధిల సమీర వరూధినివా,
జన్మ జన్మలకి ఋజువుగా మిగిలున్న 'సంధి' కాలానివా,
'మోక్షమార్గముని చేకూర్చే స్వాంతన'కే మారు రూపానివా.. 
                                               అసంకల్పిత 'ఆకృతి'వా...

12 comments:

  1. అక్షరాల ఆకృతివా్....కవితా ఝరివా... :-) చాలా బాగుందండీ చక్కని కవిత.

    ReplyDelete
    Replies
    1. అతివ గురించి రాసినా
      ప్రకృతి కూడా అదే కదా అనిపించింది.... :-)

      ధన్యవాదములు మీకు నచ్చినందుకు....

      Delete
  2. Replies
    1. Thanks Aniket. Thanks for your signature...

      Delete
  3. Chaala baagumdi sagar gaari:-):-)

    ReplyDelete
    Replies
    1. How are you ? seems its been long time ....
      Thank you Karthik....

      Delete
  4. kruthiyo prakruthiyo asankalpitha akruthiyo i word chala bagundhi

    ReplyDelete
    Replies
    1. ఆస్వాదించి అభినందించిన మీకు నా నెనర్లు..

      Delete
  5. JAYANT9/23/2013

    Chala Bagaundi . Chadutune undali anipinchindi.

    ReplyDelete
    Replies
    1. nature గురించి కదా so its quite natural ..... హ హ హ హ ..... ;-)

      Delete
  6. This is really very nice!! chala manchi bhaavam enka meaning unna kavitha!! Keep it up and i am sure u will definitely excel in simple poetry oneday!!!

    ReplyDelete
    Replies
    1. started to identify the difference between nature and women and landed up like this .... not much difference in both (atleast in my thought)..... ;-)

      Thank you very much ....

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు