కవిత రచన : సాత్విక
చప్పట్లకు కొరతేముంది
జీవితమే నాటకమైనప్పుడు !
నా ప్రాణమే నిలువలేనంది
నేను నీవాడని కాలేకున్నప్పుడు !!
మాటే సరిపోకున్నది
మౌనముతో తూచినప్పుడు !
రణమే (వ్రణమే) మానకున్నది
మనస్సే గాయపడినప్పుడు !!
నిజాలకి కొదవేముంది
అబద్ధమే నిజమైనప్పుడు !
ప్రశ్నలతో పనేలేకుంది,
నువ్వే ( బ్రతుకే ) ప్రశ్నార్ధకమైనప్పుడు !!వేణువుతో పని ఏముంది
మనసే మూగబోయినపుడు !
మాటకి మౌనానికి తేడా ఏముంది
ఇరువురి మనస్సులు విడివడినప్పుడు !!
చినుకు సవ్వడికి విలువేముంది
బ్రతుకే ఎడారిపాలు అయినప్పుడు !
అణాకి అర్ధణాకి పొంతన లేకున్నది
ఒకరితోఓకరు జీవితాన్ని పంచుకోనప్పుడు !!
రణం = వ్రణం = రాచపుండు
రణం = వ్రణం = రాచపుండు
చాలా బాగుంది .
ReplyDeleteధన్యవాదములు
Delete'chinuku savvadi ki viluvEmundi............ bratuku pongE godaarinappdu' ani vunte baavuntumdEmO.... 'edaarilO chinukuku chaalaa viluva vuntundi kadaa.....
ReplyDeleteగోపరాజు గారికి స్వాగతం నా బ్లాగ్ కి .....
Deleteచినుకుల సవ్వడికి విలువేముంది
బ్రతుకే పొంగే గోదారైనప్పుడు
వావ్ ...చాలా బాగుంది మీ suggestion....
కాకపొతే నా ఉద్దేశం ఏమిటంటే ....
చినుకుల సవ్వడి అంటే వాన చినుకు చేసే ఒక అందమైన శబ్ధం
ఆ శబ్ధం జీవన స్రవంతిలో మనసున్న ప్రతి మనిషి ఆనందించే ఒక ప్రకృతి పలకరింపు ....
అంత అందమైన భావన పలకరింపు ఎడారిలో వృధా .....
అందుకని ఎడారిపాలు అని వాడవలసి వచ్చింది .....
పైగా బ్రతుకే కష్టాలలో (ఎడారిపాలు) ఉన్నప్పుడు ఆ సవ్వడి ని ఆనందించేంత మానసిక ప్రశాంతత వుండదు ....
ఈ రెంటినీ వివరిస్తూ ఆ లైన్స్ ని అలా రాసాను ....
Liked 3rd and 7th a lot....very good feel...
ReplyDeleteమాటే సరిపోకున్నది
Deleteమౌనముతో తూచినప్పుడు !
వేణువుతో పని ఏముంది
మనసే మూగబోయినపుడు !
బయటకు లాగా .... ఊరికే....
Thanks for enjoying the feel....which makes me feel ...little more....
హ హ హ హ ..... :-)
చాలా బాగా రాశారండి. ప్రతి లైన్ చక్కగా కుదిరింది.
ReplyDeleteమీ అభినందనలు మిక్కిలి సంతోషకరం.....
DeleteThanks పద్మగారు...
చాలా బాగుంది. Each and every word perfectly put in place.
ReplyDeleteThanks a lot for your encouraging comments.అభివందనాలు.
DeleteSuperb ga raasaru.Very beautiful :)
ReplyDeleteకామెంట్స్ కి కొదవేముంది
మీరు అద్భుతంగా రాసినప్పుడు !
ఇంకొక్క రెండు లైన్స్ మిస్ అయ్యాయి
Deleteలేకపోతే ఇంకొక stanza జత చేసేవాడిని
Thank you so much for the encouragement...
Chaala Chakkaga Chepparu Saa(twika)(gar)u
ReplyDeleteSridhar Bukya
http://kaavyaanjali.blogspot.in/
welcome sir ji....
Deleteవిడదీసి కలగలిపారు .... వావ్ వా .....
Thank you so much for your signature.... ;-)