September 10, 2013

ప్రశ్నలోని సమాధానం ....

కవిత రచన : సాత్విక


చప్పట్లకు కొరతేముంది
జీవితమే నాటకమైనప్పుడు !
నా ప్రాణమే నిలువలేనంది
నేను నీవాడని కాలేకున్నప్పుడు !!

మాటే సరిపోకున్నది
మౌనముతో తూచినప్పుడు !
రణమే (వ్రణమే) మానకున్నది
మనస్సే గాయపడినప్పుడు !!

నిజాలకి కొదవేముంది 
అబద్ధమే నిజమైనప్పుడు !
ప్రశ్నలతో పనేలేకుంది, 
నువ్వే ( బ్రతుకే ) ప్రశ్నార్ధకమైనప్పుడు !!

వేణువుతో పని ఏముంది
మనసే మూగబోయినపుడు !
మాటకి మౌనానికి తేడా ఏముంది
ఇరువురి మనస్సులు విడివడినప్పుడు !!

చినుకు సవ్వడికి విలువేముంది
బ్రతుకే ఎడారిపాలు అయినప్పుడు !
అణాకి అర్ధణాకి పొంతన లేకున్నది
ఒకరితోఓకరు జీవితాన్ని పంచుకోనప్పుడు !!

రణం = వ్రణం = రాచపుండు

14 comments:

  1. చాలా బాగుంది .

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు

      Delete
  2. 'chinuku savvadi ki viluvEmundi............ bratuku pongE godaarinappdu' ani vunte baavuntumdEmO.... 'edaarilO chinukuku chaalaa viluva vuntundi kadaa.....

    ReplyDelete
    Replies
    1. గోపరాజు గారికి స్వాగతం నా బ్లాగ్ కి .....

      చినుకుల సవ్వడికి విలువేముంది
      బ్రతుకే పొంగే గోదారైనప్పుడు

      వావ్ ...చాలా బాగుంది మీ suggestion....

      కాకపొతే నా ఉద్దేశం ఏమిటంటే ....
      చినుకుల సవ్వడి అంటే వాన చినుకు చేసే ఒక అందమైన శబ్ధం
      ఆ శబ్ధం జీవన స్రవంతిలో మనసున్న ప్రతి మనిషి ఆనందించే ఒక ప్రకృతి పలకరింపు ....
      అంత అందమైన భావన పలకరింపు ఎడారిలో వృధా .....
      అందుకని ఎడారిపాలు అని వాడవలసి వచ్చింది .....
      పైగా బ్రతుకే కష్టాలలో (ఎడారిపాలు) ఉన్నప్పుడు ఆ సవ్వడి ని ఆనందించేంత మానసిక ప్రశాంతత వుండదు ....

      ఈ రెంటినీ వివరిస్తూ ఆ లైన్స్ ని అలా రాసాను ....

      Delete
  3. Liked 3rd and 7th a lot....very good feel...

    ReplyDelete
    Replies
    1. మాటే సరిపోకున్నది
      మౌనముతో తూచినప్పుడు !

      వేణువుతో పని ఏముంది
      మనసే మూగబోయినపుడు !

      బయటకు లాగా .... ఊరికే....
      Thanks for enjoying the feel....which makes me feel ...little more....
      హ హ హ హ ..... :-)

      Delete
  4. చాలా బాగా రాశారండి. ప్రతి లైన్ చక్కగా కుదిరింది.

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనలు మిక్కిలి సంతోషకరం.....
      Thanks పద్మగారు...

      Delete
  5. చాలా బాగుంది. Each and every word perfectly put in place.

    ReplyDelete
    Replies
    1. Thanks a lot for your encouraging comments.అభివందనాలు.

      Delete
  6. Superb ga raasaru.Very beautiful :)

    కామెంట్స్ కి కొదవేముంది
    మీరు అద్భుతంగా రాసినప్పుడు !

    ReplyDelete
    Replies
    1. ఇంకొక్క రెండు లైన్స్ మిస్ అయ్యాయి
      లేకపోతే ఇంకొక stanza జత చేసేవాడిని

      Thank you so much for the encouragement...

      Delete
  7. Chaala Chakkaga Chepparu Saa(twika)(gar)u

    Sridhar Bukya
    http://kaavyaanjali.blogspot.in/

    ReplyDelete
    Replies
    1. welcome sir ji....

      విడదీసి కలగలిపారు .... వావ్ వా .....

      Thank you so much for your signature.... ;-)

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు