April 11, 2013

సైకో లవ్...

గీత రచన : గుంటూరి

ఇదొక కొత్త రకం లవ్ ,
నాదేలే ఇది,  అదేలే సైకో లవ్,

ప్రేమ ఎందుకని ఎవ్వరయిన అంటే,
నీకెందుకు అని గొంతు చించుకుంటా,
కౌగిలి ఎందుకని ప్రియురాలు అడిగితే,
నేనే, తనని గిచ్చి గిచ్చి గిల్లి పెడతా,
ముద్దు నీకు నేను పెట్టనంటే,
ముక్కే పిండి వసూలు చేసేస్తా,
కస్సు బస్సు లాడిందంటే,
జస్ట్ !! కారం చల్లేస్తా,


సరికొత్త  ట్రెండ్ అని వాదిస్తా
ప్పకుంటే నేను వారి బెండు తీస్తా,
కాదంటే కరుస్తా... ఔనన్నా నేను అరుస్తా ...
కంటపడ్డవారిని ఇష్టం లేకున్నా ప్రేమించేస్తా....

ఇదేలే సరి కొత్త లవ్ఇదేలే సైకో లవ్,
నాదేలే ఈ లవ్వు నర నరాలలోకి ఎక్కిందిలే ఈ కొవ్వు ..

భూతలమే ఉయ్యాలగా కట్నమడుగుతా,
ఆకసమే పందిరిమంచంగా పక్క సిద్దం చేయమంటా,
సాగరమే స్విమ్మింగ్ పూల్ గా రాసిమ్మంటా,
హిమపర్వతమే నా కాంపౌండ్ గేటుగా కావాలంటా,

ఇవన్నీ ఇస్తే నేను ప్రేమించటం మానేస్తా,
ఇవ్వకుంటే మరీ ఎక్కువగా ప్రేమించేస్తా,
ఎవ్వరయినా అంటే నువ్వే  సైకో రా,
అరిచేస్తా నేను కైకో..రే ....

సైకో రా ... సైకో రా .......
కైకో..రే ..... కైకో..రే...   హ హ హ హ .....
నాదేలే ఇదిఅదేలే  సైకో లవ్...

నా సరదాయే పైన చెప్పినదంతా,
అసలు నాకు  దురదే పుడితే ....
ఎలా ప్రేమిస్తాననేది...  నీ ఊహకే వదిలేస్తా,
అలా ఊహించుకో అని ఊరించడమే మహా సరదా...
ఊహు ఊహు అంటే ఉప్పు పాతరేస్తా ............

కొత్తరకపు కౌ బాయినిఅసలు సిసలు ప్లే బాయిని,
లౌ గురువులందరికీ  నేనే బాబాయిని ....

ఇదేలే సరి కొత్త లవ్ఇదేలే సైకో లవ్,
నాదేలే ఈ లవ్వు నర నరాలలోకి ఎక్కిందిలే ఈ కొవ్వు..

10 comments:

  1. LOL.... ఈ మధ్య చూసిన RGV సినిమా ట్రైలర్ గుర్తొచ్చింది..

    ReplyDelete
    Replies
    1. హ హ .....
      సరైన పర్సన్ గుర్తుకు వచ్చాడంటే సార్ధకత చేకూరినట్టే ....Thanks.

      Delete
  2. ఈ మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీద రాసావా? చాలా చాలా ఫన్నీ గా కుడా ఉంది. బావుంది...

    ReplyDelete
    Replies
    1. smile ...laugh ......and then stop......
      start again.....

      హ హ ..... ;-)

      Delete
  3. "ఇదేలే సరి కొత్త లవ్, ఇదేలే సైకో లవ్,
    నాదేలే ఈ లవ్వు , నర నరాలలోకి ఎక్కిందిలే ఈ కొవ్వు.."

    సూపర్బ్!

    ReplyDelete
    Replies
    1. రమణ గారికి స్వాగతం !!
      ఆస్వాదించి ఆనందించినందుకు ధన్యవాదములు !!

      Delete
  4. ఈ లవ్వేదో వెరైటీగా ఉంది :-)

    ReplyDelete
    Replies
    1. వెరైటీ అంటే తేడా అనాండి !!
      హ హ హ ..... థాంక్స్ అండి :-)

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు