కవిత రచన : సాత్విక
ఆలోచనకి నేనే ఆద్యం,
మీ మేధస్సే నాకు భోజ్యం,
నాతోటి, మీకు శ్రేయస్సు అసాధ్యం,
నన్ను ' ఏరకున్న' ఎడారే మీకిక తధ్యం,
అందరి అనాలోచిత చర్యకి నేనే ప్రేరణ,
'మారుతి'కి కుదురు కాలక్షేపం నేను కానా?
'గోటితోపోయే'దని చిన్నచూపులా నా పైనా,
ఇంకా-ఇంకా కావాలా నా గురించి వివరణ ?
కొందరికి బోడిగుండు నేత్రానందమాయెలే,
మరి కొందరికి అరగుండు బ్రహ్మానందమాయేలే,
ఏడుకొండలవాడా, నాకు నివాసమే కరువాయేలే,
వడ్డీ కాసులవాడా, నీ ఆవాసమే నాకు అరువాయేలే!
ఇలాగయితే పోను-పోను,
కనుమరుగవుతాను నేను,
నేనెవరంటే తల్లో పేను ....
ఇంతదాకా నేను ఆరిందా,
అయిందే నా పని గోవిందా! గోవిందా !!
ఇంతదాకా నేను ఆరిందా,
అయిందే నా పని గోవిందా! గోవిందా !!
:)
ReplyDeleteహ హ హ ;-)
Deletelol!! :)
ReplyDeletewhy not rofl !!! ?
Delete:) :)
రామ రామ!!
ReplyDeleteగోవిందా గోవిందా !! అంటే బెటర్ కదా ....
Deleteపేను మీద కూడానా!! అయినా బాగుంది సరదాగా
ReplyDelete'మారుతి'కి కుదురు కాలక్షేపం నేను కానా?
'గోటితోపోయే'దని చిన్నచూపులా నా పైనా, very nice.
చూసారా పేను మీద కూడానా అని చిన్న చూపు దేనికండి అది కూడా జీవే కదా ...ఒక 10 లైనులు రాస్తే సంతోషిస్తుంది కదా .... చిన్న జీవే కదా అల్ప సంతోషి కూడా అందుకే .....మరి ...
Deleteవీక్ యండ్ చాలా బిజీ గా ఉన్నట్టున్నారు....
నిజమేనండి, పేనుకి కూడా ఆ హక్కు(కవితా వస్తువయ్యే) ఉంది. చిన్న చూపుకి శిక్షగా పేల దండయాత్ర పంపరు కదా.
DeleteReally Amazed with your variety of Subjects and you carry them too good.
హ హ హ !!
Delete:-)
పల్లా కొండలరావు గారికి స్వాగతం ఈ బ్లాగ్ కి...
ReplyDeleteధన్యవాదములు ;-)