April 17, 2013

మనసేమో ఒక మొబైలు ...

గీత రచన : గుంటూరి
నా మనసేమో ఒక మొబైలు ,  దాని వరసేమో కలిగించేను గుండె గుబేలు,
సెల్లు ఫోనులోని రింగు టోనులు,  నా మనస్సే చేసే కలవరింతలు,
అందులోని సిమ్ము కార్డులు,  నా  మదిలో రేగు లవ్వు యార్డులు
కాదంటే  కన్ఫ్యూజన్, అవునంటే ఇల్యుజన్,  నేనిస్తా దీనికి సోల్యుషన్.

న్యూ జేనరేషన్లోని వైర్లెస్ వైబ్రెషన్స్,
మనస్సుల సంభాషణే  కదా వాటికి ఇన్స్ పిరేషన్, 
నీ మనస్సుకి పెంచేయి ఈ విషయాల మీద కాన్సంట్రేషన్,
ఇక అనునిత్యం ప్రతి విషయం నీకు అనిపిస్తుంది కొత్త సెన్సేషన్....

ప్రియురాలి నోటి మాటే కంటి చూపుగా మారిపొయేను,
నా చెవులకి వినపడని ఆ మాటే నా మనసుకు మాత్రమే అర్ధమయ్యేను,
ఆలోచిస్తే అతి గొప్ప వైర్లెస్ కమ్యూనికేషన్ ఇదే కదా అనిపించేను..

*** *** ***

నా మనసేమో ఒక మొబైలు ,  దాని వరసేమో కలిగించేను గుండె గుబేలు,
కాదంటే  కన్ఫ్యూజన్, అవునంటే ఇల్యుజన్,  నేనిస్తా దీనికి సోల్యుషన్.

*** *** ***

సెల్లుఫోను కుండును అమితమయిన రేడియేషన్,
మనస్సుకేమో తప్పదు కదా ఎపుడోకపుడు కొంత డిప్రెషన్,
ఎప్పటికప్పుడు సెల్లు లోని సిం-కార్డు రీ-ఛార్జ్ చేసుకో,
ప్రియురాలితో మాటాడుకో నీ మనస్సులోనే మళ్ళి మళ్ళి రీవైండ్ చేసుకో,

ప్రతి జంటకి తప్పవు కదా చిన్నపాటి  సైక్లోన్స్,
మనస్సుని అపోహ ఆక్రమించినప్పుడు అందవులే దానికి రైట్ సిగ్నల్స్,
కవరేజి ఏరియాలో లేదని అపుడు నీవు భావించేస్తే వుండవు కదా ఎ ట్రబుల్స్,

నా మనసేమో ఒక మొబైలు ,  దాని వరసేమో కలిగించేను గుండె గుబేలు,
సెల్లు ఫోనులోని రింగు టోనులు,  నా మనస్సే చేసే కలవరింతలు,
అందులోని సిమ్ము కార్డులు,  నా  మదిలో రేగు లవ్వు యార్డులు
కాదంటే  కన్ఫ్యూజన్, అవునంటే ఇల్యుజన్,  నేనిస్తా దీనికి సోల్యుషన్.

***************


10 comments:


 1. " నీకు పదహారు నాకు పద్దెనిమిది " సినిమాలోని పాటలోలా దేన్ని వదలక , ఇలా వదిలేస్తున్నావుగా. చాలా బాగుంది .
  అడుగడుగునా మహాకవి శ్రీ శ్రీ గారిని మననం చేసుకొనే అవకాశం కల్పిస్తున్నావు. సంతోషంగా ఉంది.

  ReplyDelete
  Replies
  1. ప్రోత్సాహం అనేది ఖచ్చితముగా కొంతమేర తోడ్పడుతుంది అన్నదానికి మీలాంటివారి స్పందనల ప్రభావితముగా ముందుకి వెళుతున్న నేనే ఒక ఉదాహరణ ...
   మీ ప్రోత్సాహానికి/ఆశీర్వాదానికి ధన్యవాదములు...

   Delete
 2. బాగుంది. ఇంతకీ latest version smart మొబైలే కదా మీ మనసు. :)

  ReplyDelete
  Replies
  1. "ఇదిగో రావుగారు నన్ను involve చేయకండి " అన్నా డైలాగు నాకు ఈ సందర్భములో బాగా ఉపయోగపడుతుంది .....

   ఎందుకు అని మీరు అడిగినా మళ్ళి మళ్ళి నేను మాత్రం అదే డైలాగు వాడేస్తానండి.
   ఇందులో కొంచెం వుంది మరి .... హ హ హ.....

   మీ ప్రోత్సాహం చాలా స్పెషల్ గా అనిపిస్తుంది... హ హ హ .... Thanks వెన్నెల గారు.

   Delete
 3. మనసు మొబైల్ అయితే.....ఇంకేం రోజుకో కొత్త వర్షన్, ఎంజాయ్ చేయండి :-)

  ReplyDelete
  Replies
  1. ఒక వెర్షన్ పూర్తిగా చొసి పర్ఫెక్షన్ పొందేలోపు మళ్ళి మొదలు కొత్త వెర్షన్ ...
   ఇది ఎంజాయ్ చేయడమో లేక అసంపూర్ణముగా విడిచి పెట్టడమో అర్ధం కాని కంఫ్యుషన్ నాది...ప్చ్ ప్చ్ ...

   థాంక్స్ అండీ !!

   Delete
 4. నీ స్పీడ్ చూస్తుంటే ఒక సంవత్సరం లో సహస్రం పూర్తి చేసేటట్టు ఉన్నావ్!! స్పీడ్ బ్రేకర్స్ వస్తున్నాయి లే :")

  ReplyDelete
  Replies
  1. వామ్మో వెయ్యే !!
   కాకపోతే నువ్వు చెప్పినట్టు స్పీడ్ బ్రేకేర్స్ ఉన్నాయి ఏప్రిల్ 29 నుంచి జూన్ 30 వరకు ని భాషలో ....
   నేను మటుకు జూన్ 30 తరవాత స్పీడ్ అప్ చేయించే జేనరేటర్స్ అనుకుంటున్నాను ... హ హ హ ....

   Thanks...

   Delete
 5. గీతాలు రాసేసి, కవిత్వాలు రాసేసి....:)
  చదివి పెడతాము, కానివ్వండి,బ్రేక్ రానంతవరకు!

  ReplyDelete
  Replies
  1. బ్రేక్ తీసుకోకుండా చదివి నాకు బ్రేక్ ఇస్తానంటే నా బైక్ కి కూడా బ్రేక్ వెయ్యనంతే ..... :-)

   థాంక్స్ అండీ !

   Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు