కవిత రచన : సాత్విక
ఎవ్వరు ఏమనుకున్నా ...
నేను నువ్వై జీవిస్తున్నా !
సరిగా తయారే కాలేకున్నా,
అద్దములోనా నిన్నే చూస్తున్నా,
అందరినీ చూసి నవ్వేస్తున్నా,
వారిలోనా నిన్నే గుర్తిస్తున్నా!
గమ్యానికి చేరుకోలేకున్నా,
రహదారి పొడవునా నిన్నే కన్నా,
నువ్వే నా ప్రకనున్నావనుకున్నా,
చిన్నపిల్లలా చిందులువేసేస్తున్నా!
వానచుక్కని వారించలేకున్నా,
నువ్వేననుకొని పొరబడుతున్నా,
చందమామని చూడలేకున్నా,
నీలాగున్నాడని సిగ్గుతో తల తిప్పుకున్నా!
ఎందుకో ?
నా గుండె సవ్వడి నేనే వినేస్తున్నా,
అది నీ పేరే జపిస్తుంటే మురిసిపోతున్నా,
నా మనస్సు నాతోనే మారాం చేస్తున్నా,
అంతలోనే అది నీదని గుర్తొచ్చి మెదలకున్నా!
ఎవ్వరు ఏమనుకున్నా,
నేను నువ్వై జీవిస్తున్నా!
ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి ముందు ఎలా ఫీల్ ఔథున్దొ సరిగ్గా అలాగే రాసావ్!! nice one!!
ReplyDelete"పెళ్ళికి ముందు ఫీల్ అయిన ఆ అమ్మాయి పెళ్లి తరవాత ఎందుకు ఫీల్ అవ్వదు" అని చాలా మంది ఫీల్ అవుతున్నారు .... హ హ హ...(kidding)
DeleteThanks for enjoying the script..
Amazing సాగర్ గారు..అంతలా ప్రేమించబడే ఆ 'నువ్వు'ది ఎంత అదృష్టమో. Too good and cute.
ReplyDeleteప్రతి జంటలలో ఒకరికొకరికి ఇద్దురూ 'నువ్వు' లే కాకపోతే కాలమనే రహదారిలో యాంత్రిక వాహన ప్రయాణం వారి "నువ్వు "లే నీళ్ళతో వదిలేది "నువ్వులే' .....హ హ హ ....
Deleteఫ్లో లో రాసేసా లైట్ తీసుకోండి....
Thanks for your encouragement.
Deleteనాకు ఈ భాష రాదుగా !! కాకపోతే తిట్టారని మటుకు అర్ధం అయింది ;-)
Deleteహ హ హ !!
తిట్టలేదండి, light తీసుకున్న
Deletechala chala bagudhi... fresh ga undhi ee kavitha..
ReplyDeletekakapothey ammai laga feel ayyi ela rasava ani doubt ??
వాస్తవ ఊహలల కల్పనావర్ణనే కవిత్వము,
Deleteవాస్తవానికి దగ్గరగా పోల్చగలిగితే అద్భుత కల్పన అవుతుంది,
లేకుంటే అది అభూత కల్పన అవుతుంది .....
ఇది కూడా ఫ్లో లో రాసేసా , లైట్ తీసుకో...
Thanks.
" ఆ ముఖ కవళికలు ఆ యమ మనోభావాలు కవిత చాలా అందంగా ఉన్నాయి."
ReplyDeleteపొందికయిన పాప , అందమయిన భావం
Deleteఅని టైటిల్ ఎడితే పోలా ?
ధన్యవాదములు !!
chala baga raasavu... ammayi photo chusaka raasava or raasaka ammayi photo pettava?
ReplyDeleteనన్ను అందరు అడిగిన ప్రసన ఇదే .... హ హ హ ....
Deleteభావ వ్యక్తీకరణ తరువాత చిత్రము సమకూర్చితిని ....
Thanks.
chaalaa baavundannaiyya kavitha
ReplyDeleteThanks for the compliments.
Deleteహృద్యంగా ఉంది! -- Kamal Kishore Suruguchi
ReplyDeleteవినసొంపైన వాక్యం.
Deleteఆస్వాదిన్చినందుకు నెనర్లు !
ఈ సారి చిత్రాన్ని x-large సైజ్లో పెట్టకండి.
ReplyDeletelarge సైజ్ అయితే కవితను డామినేట్ చెయ్యదు.(మీకు తెలియదని కాదు, నాకనిపించింది చెప్పా, అంతే!)
అమ్మాయి లా భలే రాసారే!
అంటే అమ్మాయిలు మాత్రమే భలే రాస్తారా ? హ హ .... kidding..
Deleteధన్యవాదములు..