కవిత రచన : సాత్విక
'ముక్కుసూటి' మంచిగుండదంటారు,
'లౌక్యం'తో ఉన్నా అవహేళన చేస్తారు,
వీళ్ళందరూ, నాకు పెట్టిన పేరే 'వంకర',
ఇంక వీళ్ళ బాధలు నే తాళలేను శంకరా !!
వీళ్ళందరూ, నాకు పెట్టిన పేరే 'వంకర',
ఇంక వీళ్ళ బాధలు నే తాళలేను శంకరా !!
నడవడిక బాలేకున్నా నేనే విశేషణమా, ( వంకర ప్రవర్తన )
భాష సరిగా రాకున్నా నేనే భూషణమా, ( వంకర భాష )
బుద్ది మందగించినా నా మీదనే హైడ్రామా, (వంకర బుద్ధి)
ఇంక, వలదు వలదు ఈ చిన్నచూపు అయ్యో రామా!
మీరానందించే ప్రతి అందమైన జీవిత ఆకృతులే..
ఆణువణువూ మెలితిరిగిన సోయగాల సొంపులే,
అక్షరమాల అందాలన్నీ సుడి తిరిగిన వంపులే,
అదృష్టాన్ని కలిగించే హస్తరేఖలు ఉండును నావలే,
ఇంతకుమించి వినిపించిన అందురు మీరు భలే భలే !!
ఇప్పుడు చెప్పండి నేను అందంగా లేనా ? ?
మనం చేస్తే లౌక్యం ఎదుటివాడు చేస్తే మోసం అనిపించారు గురజాడ
ReplyDeleteమహా బాగా చెప్పారు ...
Deleteఅందంగా ఏమిటి, అద్భుతంగ ఉంది. చాల బాగుందండి మీ subject. నిజంగా 'కాదేది కవితకనర్హం'అన్నది మీ కవితలకి సరిగ్గ సరిపోతుంది.
ReplyDeleteమీ ప్రోత్సాహమే ... అత్యద్భుతం ....
Deleteధన్యవాదములు !!
అందంగా ఏమిటి? అద్భుతంగా ఉంది :-)
ReplyDeleteమీరు ఆ మాటన్నారంటే....ఆనందముగానున్నది...
Deleteధన్యవాదములు !!
edenti nee gurinchi neekunna doubt ni ela express chesaava? :) very very nice!!! I really loved this!!
ReplyDeleteఆహా ఏమి నీ కామెంట్ బహు వంకరగా నున్నది
Deleteవంకర అంటే కవిత లో వివరించితిని .....!!
హ హ హ !!!
Thanks for the words (encouragement aspect) ....