కవిత రచన : సాత్విక
చల్లగాలికి ఊగే చెట్లన్నీ ,
నా ప్రేమ సందేశానికి నీ సంకేతం ' ఓకే ' అని,
తెలియచేస్తున్నట్టు అనిపిస్తోందే ...
ఎగిరిపోతున్న పక్షులన్నీ,
నే రాసిన ప్రేమలేఖలని నీకు చేరవేయ,
ప్రయాస పడుతున్నట్టుగా అనిపిస్తోందే ...
కదులుతున్న మేఘాలన్నీ,
మన ఇద్దరి పెళ్ళికి పందిరిలా మార,
సంసిద్దమవుతున్నట్టుగా అనిపిస్తోందే ...
ఎగిసి పడే సాగర కెరటాలే,
తొలిరేయిన మన ఇరువురికి టాటా బై-బై చెప్ప,
ఉవ్విళ్ళూరుతున్నట్టుగా అనిపిస్తోందే ...
నీకూ ఇలానే అనిపిస్తే,
' తొండ ముదిరితే ఊసరవెల్లి ' - ' ప్రేమ ముదిరితే పిచ్చి' అని
నాకు గొంతు చించుకొని అరిచి చెప్పాలని,
అనిపిస్తోందే చెలీ! ఇలా అనిపిస్తోందే మరి !!
చాలా బాగుందండి. అనిపించేవన్ని చూసి మురిసి పోయే చెలికి ending twist పెట్టారుగా. పిచ్చిలో ప్రేమపిచ్చి Ok.
ReplyDeleteఊరికే ఎగతాళి చేద్దామనిపించి అలా ..... :-)
DeleteThanks...
ReplyDeleteప్రేమ , పిచ్చి ఒకటెనన్నారు . తొండ ఊసరవెల్లిగా మారితే రంగులు మారుస్తుంటుంది ఆకార , వ్యవహారాల్లో కూడా. ప్రేమ ముదిరితే పిచ్చిగా మారితే ద్వేషం ఏర్పడి ,వేష , భాషలని మార్చేస్తుందేమో ? పిచ్చిప్రేమ అయితే .
కవితగ కంటే , గీతంగా చాలా బాగుంటుంది.
yes sir you are right...
Deleteపాట గా మొదలెట్టి మధ్యలో వాన వచ్చి ఆగిపోయిన cricket మ్యాచ్లాగా ఆపేసి కవిత చేసేసా .... :-)
Thanks.
చిత్రం బాలేదు.మీ కవిత చూస్తే ప్రేమ-పిచ్చి" అని నేను రాసిన అనువాదం ఒకటి గుర్తొచ్చింది.:)
ReplyDeleteసినిమాలో హీరో కి దెబ్బ తగిలినప్పుడు కూడా ఆ దెబ్బకు కూడా చాలా అందమయిన మేకప్పు వేస్తారు ... అలా కాక ' పిచ్చి' గురించి చెబుతూ పిచ్చి బొమ్మ పెట్టాలని చేసిన ప్రయత్నమే ...... మీ కామెంట్ తో అది సఫలం అయింది అనిపించింది .....హ హ హ.....
Deleteధన్యవాదములు ....
haha!! nice thought....ప్రేమలో ఉన్నప్పుడు ఏది జరిగినా కూడా మనకి అన్వయిన్చుకోవటం చాల మాములుగా జరిగే విషయం. కాబట్టి నువ్వు రాసింది కరెక్టే .....
ReplyDeleteపిచ్చి అని confirm చేసినందుకు ..... thanks.... :-)
DeleteThanks Thanks ..... :-)
ప్రేమ పిచ్చి గురించి.. చాలా బాగా చెప్పారు.. కొచెం హస్యంగా..-:)
ReplyDeleteహాస్యాన్ని బయటకి లాగి మరీ పట్టుకున్నారు..... భలేవారే ....
DeleteThanks...