కవిత రచన : సాత్విక
(వీలుంటే ఆలోచిద్దాము కుదిరితే మార్పుకు ప్రయత్నిద్దాము)
పొంచి ఉన్న ప్రమాదం కాపురముంది పొరుగింట్లోనేనా ?
'పొరుగింటి పుల్లకూర రుచి' అన్నది యిక్కడ కూడానా !
అది అయిదేళ్ళ చిన్నారైనా, అరవై ఏళ్ళ అవ్వైనా,
ఇవే అసలైన నిజాలు, అవే నేనున్న నవసమాజమపు ఆనవాళ్ళు..
సగటు మనిషి సంపాదన చిటికెడు, కట్టాల్సిన పన్ను గరిటెడు,
'ఆయన సంపాదన బీబీ కుట్టిపోగులకే సరి' అని సణుగుడు,
సత్కార, సరదాల, కారాగార సర్కారీ ఖర్చులు బండెడు,
ఇవే అసలైన నిజాలు, అవే నేనున్న నవసమాజమపు ఆనవాళ్ళు..
నవ్వరో యువ నాయకుడా, ఎప్పటికీ నీ నవ్వాగదులే,
'నవ్వు నాలుగు విధాల చేటు' అన్నది నీకు నిజం కాదులే,
'సిగ్గులేని ముఖానికి నవ్వే అలంకారం' యిది నీకు వర్తించునులే,
ఇవే అసలైన నిజాలు, అవే నేనున్న నవసమాజమపు ఆనవాళ్ళు..
హరిశ్చంద్రుడు పోటి చేస్తే ఒక్క ఓటయినా రాలదు యిది ఖాయం,
'హాస్యగానికి తేలుకుట్టిన చందమే' ఈ సామాజిక న్యాయం,
కుట్టినా, కుట్టకున్నా హాస్యగాని మాటలకు నవ్వడమే వారి ధ్యేయం,
ఇవే అసలైన నిజాలు, అవే నేనున్న నవసమాజమపు ఆనవాళ్ళు..
నడిచొచ్చే నాయకుడొకడు, అడక్కుండానే ఓదార్చేవాడొకడు,
అరిచి-గీ పెట్టినా 'నిమ్మకు నీరెత్తినట్టుండే' అసలోడింకొకడు,
'నువ్వే నచ్చలేదంటే నాట్యం చేసి చూపిస్తా'నంటాడు మరొకడు,
ఇవే అసలైన నిజాలు, అవే నేనున్న నవసమాజమపు ఆనవాళ్ళు..
నవ సమాజపు ఆనవాళ్ళు కాదు , నేటి సమాజపు ఆనవాళ్లు . చాలా చాలా బాగుంది .
ReplyDeleteరకరకాల పీడముఖాల్ :)
ReplyDeletechaalaa baavundi...-:)
ReplyDeleteExcellent!!
ReplyDeleteVery Nice
ReplyDeleteThanks a lot for your heart full wishes.
ReplyDelete(Iam little busy with something else...may be will be back again full fledged by July mid.... meanwhile definitely I will try to keep in touch at least 10 days once......)